ఎప్పుడూ నీవు నీలాగే ఉండు.
ఉండడానికే ప్రయత్నించు..
ప్రేమకోసమో, వేరే అవసరం కోసమో,
వేరేవారికోసమో మారితే,
జీవితాంతం నీవు మారుతూనే ఉండాల్సిందే..!!
అవును.. మనం మనలాగే ఉండాలి. అంటే నిన్నటివరకూ ఎలా ఉన్నామో అలాగే మన పద్ధతులు, నడవడిక ఉండాలి. అలా ఉండటానికే ప్రయత్నించాలి. మధ్యలో ఎదురయ్యే కొన్ని మంచి, సద ఆచరణాలు మనలోకి చేర్చుకోవాలి. అంతేగానీ - ఒకరి కనుసన్నల్లో పడటానికి, ఎదుటివారి గుర్తింపు పొందటానికో, వేరొకరి ప్రాపకానికోసమో, ప్రేమ కోసమో, మరే ఇతర అవసరం కోసమో మారితే, జీవితాంతం అలా మనం మారుతూనే ఉండాలి. అలా మారితే - ఒకలాంటి చులకన భావం అంటూ ఏర్పడుతుంది. మనం ఎప్పుడూ మనలాగే ఉండాలి. మన పద్ధతులు సరియైనవి అయినప్పుడు ఇతరుల కోసం మారాల్సిన అవసరం లేదు.
No comments:
Post a Comment