క్రొత్త స్నేహితులని చేసుకోవటం తొందరలో - పాత స్నేహితులను మరచిపోరాదు.
క్రొత్త స్నేహితులను చేసుకోవటంలో చాలామంది పాత స్నేహితులని మరచిపోతారు. ఇలాంటివారు ఇప్పుడు చేసుకొనే క్రొత్త స్నేహితులని కూడా మరచిపోయే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇలాంటివారు మనకి తారసపడినప్పుడు - అప్పుడు ఎవరైనా పాత మితృలు తనని కలవడానికి వస్తే - వారితో ఎలా ప్రవర్తిస్తున్నారో, వారితో ఎలా సంభాషిస్తున్నాడో గమనించాలి. పాత మితృలు వెళ్ళిపోయాక, వారిమీద ఏమైనా వ్యంగంగా, హేళన చేస్తూ మాట్లాడితే, నిశ్చయముగా వారు మీకు మామూలు పరిచయం ఉన్న వ్యక్తులుగానే భావించండి. అంతే కానీ మీ స్నేహితులుగా అనుకోకండి. రేపు మీనుండి వారు దూరమయితే - మీ మీద కూడా హేళనగా, అమర్యాదగా మాట్లాడారని గ్యారంటీ ఏమీ లేదు.
No comments:
Post a Comment