నీవు చేసే పని గురించి నీకు ఆమూలాగ్రం తెలిస్తే, ప్రతి విషయం మీదా క్షుణంగా అవగాహన ఉంటే నీ వ్యాపారం విజయవంతమవుతుంది.
అవును.. మనం చేసే ప్రతిపని మీదా మనకి చక్కని అవగాహన ఉంటే, మనం చేసే ప్రతి పనీ చక్కగా, సమర్థవంతముగా పూర్తి అవుతుంది. లేకుంటే గాభరా, అయోమయం, సమయం వృధా, అవహేళనలు, కోపం, తిట్లూ.. తప్పవు. ఒక పనిని మనం చేసే ముందే - ఆ పని అంటే ఏమిటీ ? ఎలా చెయ్యాలి? ఎలా చేస్తే ఆ పనిని తేలికగా, సమర్తముగా, సంపూర్తిగా చెయ్యగలమో తెలుసుకోగలగాలి. ఇందుకు మన సీనియర్స్ సలహా, తోడ్పాటు గానీ, మన అనుభవ పాఠాల వల్లనే గానీ అవసరం. అప్పుడు మనం చేసే వ్యాపారం చక్కగా సాగుతుంది. అప్పుడే మనకు ఒక చక్కని గుర్తింపు, మనం పనిచేసే సంస్థ విజయవంతమవుతుంది. ఇలా ఒక్క వ్యాపార రంగమే కాదు.. మన ఉద్యోగమే కానీ, కుటుంబ బాంధవ్యాలే గానీ, మన సోషల్ సైట్లలోనే కానీ, మన చుట్టూ ఉన్నవారితోనే గానీ.. ప్రతిచోటా ఇలా తెలుసుకోవడం తప్పదు. అలాని పూర్తిగా తెలుసుకుంటూ ఉండాలంటే మన సమయం వృధా.. పని చేస్తూ, ఆ విషయాల్ని తెలుసుకోవడం ఉత్తమమైన పని.
No comments:
Post a Comment