అధికులం, సర్వజ్ఞులం, ఉన్నతులం అనుకొనే వాళ్ళంతా - ఆ వంచనలో దాగిన బోలుతనాన్ని గుర్తించకుండానే బ్రతుకుతున్నారు..
మేము చాలా గొప్పవారం, మా వెనకాల ఎంతో ఆస్థి, అంతస్థు, హోదా, పరపతీ ఉన్నాయి.. అలాగే మాకు అన్నీ తెలుసు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఈ ప్రపంచములో ఉన్న విషయాలన్నీ మాకు తెలుసు.. అని భావించేవారు మన జీవితాల్లో మనకు ఎందరెందరో తారసిల్లుతారు. అది వారొక గొప్పగా ఏదో తమకే చెందిన హోదా గా వారు అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనకాల ఉన్న బోలుతనాన్ని వారు గుర్తెరగరు. ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంది, ఎంత ఆస్థి ఉన్నా ఇంకా ఉండాల్సింది చాలానే ఉంది అనీ, మాకంటే గొప్పవారు ఈ ప్రపంచాన ఉన్నారనీ, మాకంటే గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచాన చాలామంది ఉన్నారనీ వారు తెలుసుకోరు. ఆమాటకొస్తే - తెలుసుకోకుండానే అలాగే జీవిస్తూ ఉన్నారు కూడా.
No comments:
Post a Comment