Monday, December 16, 2013

Good Morning - 518


" మనంతట మనం పని చెయ్యం, 
పనిచేసేవారిని పని చెయ్యనియ్యం, 
వారిని విమర్శించి, తప్పులెంచి, అవహేళన చేస్తాం. 
మానవ జాతి పతనానికి ముఖ్యమైనది ఈ లక్షణమే.. " 
- స్వామి వివేకానంద

అవును.. మనంతట మనం పని చెయ్యలేం.. మనమీద ఎవరైనా అజమాయిషీ చేస్తే సహించలేం.. మన ప్రక్కన పనిచేసేవారిని పనిచెయ్యకుండా చేస్తాం. అలా చేసేవారిని వెక్కిరించో, విమర్శించో, వారి తప్పులూ, లోపాలని లెక్కిస్తూ, బరద జల్లటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన పతనానికీ, మన చుట్టూ ఉన్న సమాజ పతనానికీ మిక్కిలి దోహదపడేదే ఈ లక్షణం అని స్వామి వివేకానందుల వారు సెలవిచ్చారు.

ఇక్కడ మీకో నా అనుభవం కూడా చెప్పాలనిపిస్తోంది. సోషల్ సైట్స్ గురించి (లింక్ : http://achampetraj.blogspot.in/search/label/Social%20Networking%20Sites ) ఈ బ్లాగులో, నా సోషల్ సైట్ ప్రొఫైల్ లో వ్రాస్తున్నప్పుడు - కొందరు వారిలో వారు చెప్పుకొని, బాగా నవ్వుకొన్నారు. కొద్దిమంది మాత్రం మాకు తెలీని విషయాలా అని చిన్న చూపు చూసిన తరవాత మెచ్చుకొన్నారు. చాలామంది మాత్రం మెచ్చుకొన్నారు. చాలా బాగా విషయాల్ని తెలియ చేశారు అనీ. నవ్వుకొన్న వారు నవ్వుకోనీ అనుకున్నాను. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎందరో అనుమానం గా చూస్తుంటారు. వారికి విమర్శించడమే తప్ప వెన్నుతట్టడం రాదు. వారికి కావలసింది వెక్కిరింతలూ, ఫన్ చేసుకోవడం తప్ప వాళ్ళల్లో ఏమీ టాలెంట్స్ ఉండవు. వారిలో ఏమీ స్పెషాలిటీస్ కూడా ఉండవు. తమలోని ఒకరు ఒక మంచిపని చేస్తున్నారు కదా అని అనుకోరు. వారు చెప్పరు చెప్పేవారిని చెప్పకుండా వారికి అడ్డుపడాలని చూస్తుంటారు. ఇలాంటివారిని వారి మానాన వారిని వదిలెయ్యడం మంచిది. నేనూ అదే పని చేశాను. ఫలితముగా ఆ సీరీస్ అందరినీ బాగా ఆకట్టుకొంది. నాకో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నన్ను విమర్శించిన వారు అలాగే మామూలు వ్యక్తులుగా మిగిలిపోయారు.. నాకు దూరమయ్యారు.. వారి స్థానాన మరికొందరు వచ్చి చేరారు. 

No comments:

Related Posts with Thumbnails