స్నేహితులని అభిమానించు,
అవమానించకు..
అభిమానంతో స్నేహం పెరుగుతుంది.
అవమానంతో స్నేహం తరుగుతుంది.
స్నేహితులంటే ఇష్టపడండి. స్నేహమంటే అభిమానించండి. వారిని అర్థం చేసుకోండి. అంతే కానీ అపార్థం చేసుకోకండి. అర్తానికీ, అపార్థానికీ కేవలం ఒకే ఒక అక్షరం తేడా.. అలాగే స్నేహానికీ సంబంధించిన - అబిమానించటానికీ, అవమానించటానికీ మధ్య ఒకే ఒక అక్షరమే తేడా.. అంటే చాలా చిన్న తేడా చూపిస్తే అలా అంతగా అర్థం మారిపోతుంది.
అందుకే మీతో ఎవరైనా స్నేహం చేస్తున్నప్పుడు వారిని అభిమానించండి. నలుగురిలో ఉన్నప్పుడు గొప్పగా ప్రశంసించండి. అదే చోట అవమానించకండి. అలా చేస్తే వారు మీమీద ఎన్నటికీ తరగని కోపముతో, రగిలిపోతూనే ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా మీ మీద మానసికముగా, శారీరకముగా దాడికి దిగొచ్చు. అలాగే మీరిద్దరే ఉన్నప్పుడు అలా అవమానించక. అనునయముగా చెప్పండి. మీ మీద ఉన్న అభిమానంతో - మీరు చెప్పేది శ్రద్ధగా వింటారు. అలా చెప్పిన విషయం బాగుంది, తమ బాగు కోసమే చెప్పారు అని వారికి అనిపిస్తే - వారు ఖచ్చితముగా వాడి, చూపిస్తారు. అప్పుడు మీమధ్య స్నేహం మరింతగా అభివృద్ధి చెందుతుంది. అందుకే అభిమానంతో స్నేహం పెరుగుతుంది. అంతే కానీ అవమానంతో స్నేహం అభివృద్ధి కాదుకదా.. పైగా అది అక్కడితోనే సమసిపోవచ్చును కూడా. అంటే ఆ స్నేహం బ్రేకప్ అయిపోవచ్చును.
No comments:
Post a Comment