Tuesday, December 31, 2013

Good Morning - 527


మంచి పుస్తకం మంచి స్నేహితునితో సమానం. 
ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయం తో సమానం..
- A.P.J అబ్దుల్ కలాం. 

Monday, December 30, 2013

Good Morning - 526


స్నేహితులని అభిమానించు, 
అవమానించకు.. 
అభిమానంతో స్నేహం పెరుగుతుంది. 
అవమానంతో స్నేహం తరుగుతుంది. 

స్నేహితులంటే ఇష్టపడండి. స్నేహమంటే అభిమానించండి. వారిని అర్థం చేసుకోండి. అంతే కానీ అపార్థం చేసుకోకండి. అర్తానికీ, అపార్థానికీ కేవలం ఒకే ఒక అక్షరం తేడా.. అలాగే స్నేహానికీ సంబంధించిన - అబిమానించటానికీ, అవమానించటానికీ మధ్య ఒకే ఒక అక్షరమే తేడా.. అంటే చాలా చిన్న తేడా చూపిస్తే అలా అంతగా అర్థం మారిపోతుంది. 

అందుకే మీతో ఎవరైనా స్నేహం చేస్తున్నప్పుడు వారిని అభిమానించండి. నలుగురిలో ఉన్నప్పుడు గొప్పగా ప్రశంసించండి. అదే చోట అవమానించకండి. అలా చేస్తే వారు మీమీద ఎన్నటికీ తరగని కోపముతో, రగిలిపోతూనే ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా మీ మీద మానసికముగా, శారీరకముగా దాడికి దిగొచ్చు. అలాగే మీరిద్దరే ఉన్నప్పుడు అలా అవమానించక. అనునయముగా చెప్పండి. మీ మీద ఉన్న అభిమానంతో - మీరు చెప్పేది శ్రద్ధగా వింటారు. అలా చెప్పిన విషయం బాగుంది, తమ బాగు కోసమే చెప్పారు అని వారికి అనిపిస్తే - వారు ఖచ్చితముగా వాడి, చూపిస్తారు. అప్పుడు మీమధ్య స్నేహం మరింతగా అభివృద్ధి చెందుతుంది. అందుకే అభిమానంతో స్నేహం పెరుగుతుంది. అంతే కానీ అవమానంతో స్నేహం అభివృద్ధి కాదుకదా.. పైగా అది అక్కడితోనే సమసిపోవచ్చును కూడా. అంటే ఆ స్నేహం బ్రేకప్ అయిపోవచ్చును. 

Sunday, December 29, 2013

Saturday, December 28, 2013

Thursday, December 26, 2013

Happy New Year 2014



మిత్రులకూ, 
తోటి బ్లాగర్స్ కీ, 
నా బ్లాగ్ వీక్షకులకీ, 
అందరికీ.. 
నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

Wish you a Happy & Prosperous New Year 2014

Monday, December 23, 2013

Good Morning - 525


పూర్వీకులు తనకు ఏమీ ఇవ్వలేదనుకునేవాడే పేదవాడిగా మిగిలిపోతాడు. తానేం చెయ్యాలో తెలుసుకున్నవాడు ఎదుగుతాడు. పుట్టెడు కష్టాల్లో కూడా ఈరోజు గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు ఏరోజుకైనా గొప్పవాడు అవుతాడు. 

నా తల్లితండ్రులు, తాత, ముత్తాతలు నాకు ఏమీ ఆస్థి ఇవ్వలేదు అని ఎప్పుడూ బెంగ పడేవాడు ఏమీ కష్టపడకుండానే గొప్పవాడిని కాలేకపోయానని బాధపడుతూ ఎప్పటికీ పేదవాడిగానే మిగిలిపోతాడు. నాకేమీ లేకున్నా, నా అంతట నేనుగా సంపాదించుకొని, గొప్పవాడిగా మారటానికి తగిన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చినదే చాలు.. ఈమాత్రం దానితో నేను ఒక గొప్ప స్థాయికి చేరుకుంటాను అనుకున్నవాడు ఖచ్చితముగా ఎదుగుతాడు. 

కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని చూసి, బెంబేలెత్తి పోయేవాడు - పలాయన మంత్రం పాటించి, జీవితాన అధముడిగా తయారవుతాడు. ఒక్కోసారి కాలం కచ్చగా దాడి చేస్తుంది. ఆ సమయాన, తట్టుకొని నిలిచి, ఆ ప్రతికూల పరిస్థితులని ఎదురుకొని, వాటికి ఎదురునిలిచి, లక్ష్యసాధన చేసి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని తపించేవాడు - ఏ రోజుకైనా గొప్పవాడు అవుతాడు. 

Sunday, December 22, 2013

Good Morning - 524


నీవు చేసే పని గురించి నీకు ఆమూలాగ్రం తెలిస్తే, ప్రతి విషయం మీదా క్షుణంగా అవగాహన ఉంటే నీ వ్యాపారం విజయవంతమవుతుంది. 

అవును.. మనం చేసే ప్రతిపని మీదా మనకి చక్కని  అవగాహన ఉంటే, మనం చేసే ప్రతి పనీ చక్కగా, సమర్థవంతముగా పూర్తి అవుతుంది. లేకుంటే గాభరా, అయోమయం, సమయం వృధా, అవహేళనలు, కోపం, తిట్లూ.. తప్పవు. ఒక పనిని మనం చేసే ముందే - ఆ పని అంటే ఏమిటీ ? ఎలా చెయ్యాలి? ఎలా చేస్తే ఆ పనిని తేలికగా, సమర్తముగా, సంపూర్తిగా చెయ్యగలమో తెలుసుకోగలగాలి. ఇందుకు మన సీనియర్స్ సలహా, తోడ్పాటు గానీ, మన అనుభవ పాఠాల వల్లనే గానీ అవసరం. అప్పుడు మనం చేసే వ్యాపారం చక్కగా సాగుతుంది. అప్పుడే మనకు ఒక చక్కని గుర్తింపు, మనం పనిచేసే సంస్థ విజయవంతమవుతుంది. ఇలా ఒక్క వ్యాపార రంగమే కాదు.. మన ఉద్యోగమే కానీ, కుటుంబ బాంధవ్యాలే గానీ, మన సోషల్ సైట్లలోనే కానీ, మన చుట్టూ ఉన్నవారితోనే గానీ.. ప్రతిచోటా ఇలా తెలుసుకోవడం తప్పదు. అలాని పూర్తిగా తెలుసుకుంటూ ఉండాలంటే మన సమయం వృధా.. పని చేస్తూ, ఆ విషయాల్ని తెలుసుకోవడం ఉత్తమమైన పని. 

Saturday, December 21, 2013

Good Morning - 523


మనిషి పోయినా మాట నిలుస్తుంది.. 
మాట కన్నా స్నేహం ముఖ్యం. 
అలాంటి మనిషితో స్నేహం చెయ్యండి. 
మంచి స్నేహం ని వెదకండి. 
కానీ ప్రేమించకండి. 

మనుష్యులు ఎన్నడూ ఉండరు.. వారు శాశ్వతం కాదు. సమయం ఆసన్నమవగానే - ఈ లోకము నుండి వెళ్ళిపోతారు. కానీ మాట అలాకాదు. అది శాశ్వతం.  మాట అన్న మనిషి ఉన్నాడా ? లేడా ? అన్నది ప్రశ్న కాదు. దానితో ఏమాత్రం సంబంధం ఉండదు కూడా. మంచి మాట చెప్పే మనుష్యులతో మనం స్నేహం చెయ్యాలి. అలాంటి మంచి స్నేహాన్ని వెదకండి. ఊబుసుకుపోని కబుర్లూ, ముఖస్తుతి మాటలతో గడిపే వాళ్ళకన్నా - మంచి స్నేహాన్ని వెదికి వారితో స్నేహించండి. మీకు ఎప్పటికీ వీలులేకున్నా కనీసం రోజుకి అరగంటైనా వారితో గడపండి. అలాంటి స్నేహాల వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ఇలాంటివారితో స్నేహముగానే ఉండండి.. కానీ ప్రేమించకండి. అభిమానించండి చాలు. ( ఆరాధించే స్థాయి వరకూ రాకండి.) 

Friday, December 20, 2013

Good Morning - 522


అన్ని గాయాలని మానిపేది మనస్సే అయితే, ఆ మనసుకి తగిలిన గాయాలని మానిపెవారు ఎవరు.? 

మన దైనందిక జీవితములో విమర్శలూ, ఈర్ష్యా ద్వేషాలు అతిసహజం. రకరకాల సందర్భాలల్లో శారీరకముగా, మానసికముగా ఎన్నోగాయాలు అవుతుంటాయి. ఇలాంటివి ఎన్ని తగిలినా ఆ బాధ మన మనసుకే. అన్నిరకాల గాయాలకీ ఆ మనసే స్వాంతన చేకూరుస్తుంది. అలాంటి మనసుకే గాయమే అవుతే, అప్పుడు ఆ మనసుకి తగిలిన గాయాన్ని మానిపేసే వారుఎవరున్నారు..? 

Thursday, December 19, 2013

Good Morning - 521


ఈ తల నొప్పులతో, ఈ బాధలతో, ఈ దరిద్రంతో కూడా జీవితం అంటే నాకు చాలా మధురముగా ఉంది. జీవితం లేకుండా " శూన్యం " తలచుకొంటేనే నాకు భయం కలుగుతుంది.. నాకు జన్మ రాహిత్యం వద్దు. 
- చలం.

Wednesday, December 18, 2013

Good Morning - 520


నిన్ను ఎవరు ఏమన్నారన్నది ముఖ్యం కాదు.. వారన్నదానికి నువ్వెలా ప్రతిస్పందించావన్నది ముఖ్యం. కొన్నిసార్లు తప్పుకొని వెళ్ళిపోవడం కంటే, నిలబడి నవ్వడం మంచి ఫలితాన్నిస్తుంది. 

మనల్ని ఎవరు ఏమి అన్నారు అన్నది ప్రధానం కాదు. వారు ఏదో తెలీకనో, తెలిసీ తెలీనిది తెలిసినట్లుగానో, మరేదో ఊహించుకొని గానీ, అస్సలుకే మన గురించి తెలీక కావొచ్చు.. ఏదేదో మన మనసు గాయపడేలా అంటుంటారు. అలా అన్నదానికి మనం ఎలా ప్రతిస్పందిస్తామో అన్నది చాలా ముఖ్యం. వారు అన్నదానికి ఏమీ బదులివ్వక మౌనం వహించి, ఆ మాటలు పడుతాం. లేదా వాళ్ళతో వాదించి గొడవపడుతాం. మాటలు పడి, మౌనముగా తప్పుకుంటే - మనం ఆ మాటల్ని నిజం చేస్తాం. ఎదిరించి వాదిస్తే - చులకన కావొచ్చు + వారితో శాశ్వత ఎడబాటుకి గురి అవొచ్చు. కొన్నిసార్లు మనం వారి మాటలు పడి, ప్రక్కకి తప్పుకొనే బదులు, కాస్తంత చిరునవ్వు చిందిస్తూ, వారి మాటలకు సమాధానముగా చిరునవ్వు చిందిస్తే - అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. 

Tuesday, December 17, 2013

Good Morning - 519


క్రొత్త స్నేహితులని చేసుకోవటం తొందరలో - పాత స్నేహితులను మరచిపోరాదు. 

క్రొత్త స్నేహితులను చేసుకోవటంలో చాలామంది పాత స్నేహితులని మరచిపోతారు. ఇలాంటివారు ఇప్పుడు చేసుకొనే క్రొత్త స్నేహితులని కూడా మరచిపోయే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇలాంటివారు మనకి తారసపడినప్పుడు - అప్పుడు ఎవరైనా పాత మితృలు తనని కలవడానికి వస్తే - వారితో ఎలా ప్రవర్తిస్తున్నారో, వారితో ఎలా సంభాషిస్తున్నాడో గమనించాలి. పాత మితృలు వెళ్ళిపోయాక, వారిమీద ఏమైనా వ్యంగంగా, హేళన చేస్తూ మాట్లాడితే, నిశ్చయముగా వారు మీకు మామూలు పరిచయం ఉన్న వ్యక్తులుగానే భావించండి. అంతే కానీ మీ స్నేహితులుగా  అనుకోకండి. రేపు మీనుండి వారు దూరమయితే - మీ మీద కూడా హేళనగా, అమర్యాదగా మాట్లాడారని గ్యారంటీ ఏమీ లేదు. 

Monday, December 16, 2013

Good Morning - 518


" మనంతట మనం పని చెయ్యం, 
పనిచేసేవారిని పని చెయ్యనియ్యం, 
వారిని విమర్శించి, తప్పులెంచి, అవహేళన చేస్తాం. 
మానవ జాతి పతనానికి ముఖ్యమైనది ఈ లక్షణమే.. " 
- స్వామి వివేకానంద

అవును.. మనంతట మనం పని చెయ్యలేం.. మనమీద ఎవరైనా అజమాయిషీ చేస్తే సహించలేం.. మన ప్రక్కన పనిచేసేవారిని పనిచెయ్యకుండా చేస్తాం. అలా చేసేవారిని వెక్కిరించో, విమర్శించో, వారి తప్పులూ, లోపాలని లెక్కిస్తూ, బరద జల్లటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన పతనానికీ, మన చుట్టూ ఉన్న సమాజ పతనానికీ మిక్కిలి దోహదపడేదే ఈ లక్షణం అని స్వామి వివేకానందుల వారు సెలవిచ్చారు.

ఇక్కడ మీకో నా అనుభవం కూడా చెప్పాలనిపిస్తోంది. సోషల్ సైట్స్ గురించి (లింక్ : http://achampetraj.blogspot.in/search/label/Social%20Networking%20Sites ) ఈ బ్లాగులో, నా సోషల్ సైట్ ప్రొఫైల్ లో వ్రాస్తున్నప్పుడు - కొందరు వారిలో వారు చెప్పుకొని, బాగా నవ్వుకొన్నారు. కొద్దిమంది మాత్రం మాకు తెలీని విషయాలా అని చిన్న చూపు చూసిన తరవాత మెచ్చుకొన్నారు. చాలామంది మాత్రం మెచ్చుకొన్నారు. చాలా బాగా విషయాల్ని తెలియ చేశారు అనీ. నవ్వుకొన్న వారు నవ్వుకోనీ అనుకున్నాను. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎందరో అనుమానం గా చూస్తుంటారు. వారికి విమర్శించడమే తప్ప వెన్నుతట్టడం రాదు. వారికి కావలసింది వెక్కిరింతలూ, ఫన్ చేసుకోవడం తప్ప వాళ్ళల్లో ఏమీ టాలెంట్స్ ఉండవు. వారిలో ఏమీ స్పెషాలిటీస్ కూడా ఉండవు. తమలోని ఒకరు ఒక మంచిపని చేస్తున్నారు కదా అని అనుకోరు. వారు చెప్పరు చెప్పేవారిని చెప్పకుండా వారికి అడ్డుపడాలని చూస్తుంటారు. ఇలాంటివారిని వారి మానాన వారిని వదిలెయ్యడం మంచిది. నేనూ అదే పని చేశాను. ఫలితముగా ఆ సీరీస్ అందరినీ బాగా ఆకట్టుకొంది. నాకో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నన్ను విమర్శించిన వారు అలాగే మామూలు వ్యక్తులుగా మిగిలిపోయారు.. నాకు దూరమయ్యారు.. వారి స్థానాన మరికొందరు వచ్చి చేరారు. 
Related Posts with Thumbnails