Wednesday, August 17, 2011

టీచర్ ఐడియా - వారి క్లాస్ నే మార్చింది.

మా బంధువుల అమ్మాయి క్లాసులో మొన్న జరిగిన ఒక విషయాన్ని మీకు ఇప్పుడు చెబుతాను. మాంచి డ్రామా లా ఉన్ననూ నిజముగా జరిగింది.

డే స్కాలర్ మరియు బోర్డింగ్ స్కూల్ అది. అలాగే కో ఎజుకేషన్ స్కూల్ అది. ఉదయం ఎనిమిదిన్నర కి వెళ్లి సాయంత్రం ఆరింటికి తిరిగి వస్తారు. ఈ అమ్మాయి క్లాసులో అబ్బాయిలూ సరిసమానముగానే ఉన్నారు. ఒకప్పుడు కాలేజీ వయస్సులో చేసే అమ్మాయిల మీద కామెంట్స్ చెయ్యటం, వెంటపడటం ఇప్పుడు అన్ని వయస్సుల్లో సాధారణ విషయం అయ్యింది. చిన్న చిన్న తరగతుల్లో కూడా చూస్తే - వీరు వ్రేలెడంత ఉండరు కాని, అప్పుడే ప్రేమలు, ప్రేమ లేఖలు.. అంటూ పైత్య ప్రకోపరాలకి లోనవుతున్నారు. ఈ అమ్మాయికి UKG లోనే, ఒక అబ్బాయి ప్రేమలేఖ వ్రాశాడు అంటేనే - నేటి విద్యార్థులు ఎలా ఉన్నారో అర్థం చేసుకోవచ్చును.

ఈ అమ్మాయి క్లాసులో కూడా ఇలాంటి బాపతుగాళ్ళు ఉన్నారు.. వీళ్ళని టీజ్ చెయ్యటం, వెంటపడటాలు అవో మామూలు విషయాలు అనేలా అయ్యాయి కూడా. ఇప్పుడు ఇది యూనివర్సల్ సమస్య అనుకుంటాను. మా అప్పుడు మాత్రం ఇవన్నీ అస్సలు కానవచ్చేడివి కావు.

ఈ విషయం మీద వారి క్లాస్ టీచర్ కి ఫిర్యాదు చేశారు ఈ అమ్మాయిలు. ఆ టీచర్ కూడా ఏమీ అనలేకపోయింది. ఇక అలా ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది కూడా.. మొన్న రాఖీ పూర్ణిమ రోజున అన్ని స్కూల్స్ కి సెలవు ప్రకటించినా - ఈ స్కూల్ యాజమాన్యం మాత్రం సిలబస్ కంప్లీట్ అనే విషయం క్రింద సెలవు ఇవ్వక, ఆ రోజు స్కూల్ వర్కింగ్ డే గా చేశారు.

ఈ విషయం ఆ క్లాస్ టీచర్ ఆ క్లాస్ లో ప్రకటించేశారు. ఎవరైనా రేపు ఆబ్సేంట్ అవుతే ఫైన్ కూడా ఉంటుందని హెచ్చరించారు. వరుసగా మూడు రోజులు సెలవు వస్తుందని ఆశ పడ్డ ఆ పిల్లలు ఆరోజున ఇక తప్పక స్కూల్ కి రాక తప్పింది కాదు.

ఆ క్లాస్ టీచర్ ఈ కొంతమంది ఆడపిల్లల్ని పిలుచుకొని, రేపు ఇలా చెయ్యండి అని ఒక ఐడియా ఇచ్చారు. అది విన్న ఆ అమ్మాయిల మొహాల్లో సంభ్రమం. హా! ఎంత బాగుంది ఈ ఐడియా.. కాని వర్కవుట్ అవుతుందా? అన్న ఆలోచన. అయినా ప్రయత్నిస్తే పోయేదేమీలేదుగా అనుకున్నారు. ఆ ఆడపిల్లలు అంతా చర్చించుకున్నారు. అబ్బాయిలకి ఎవరికీ తెలీకుండా జాగ్రత్త పడ్డారు.

మరునాడు యాధావిధిగా స్కూల్ మొదలయ్యింది. ప్రేయర్ కాగానే, మొదటి పీరియడ్ తో క్లాస్ మొదలయ్యింది. యాధావిధిగా క్లాస్ టీచర్ వచ్చారు. క్లాస్ రూం తలుపు మూశారు. అటెండన్స్ తీసుకున్నారు. ఆ తరవాత ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఆ టీచర్ కి రాఖీ కట్టారు. ఆ తరవాత అబ్బాయిలూ కట్టారు. ఇక ఆ తరవాతే అసలు కార్యక్రమం జరిగింది.

ఆ అమ్మాయిలందరూ తమ తమ బ్యాగుల్లోనుండి రాఖీలు బయటకి తీశారు. తమని ఎవరైతే ప్రేమా, దోమా అంటూ వెంటపడుతున్నారో వారి దగ్గరికి వెళ్లి, రాఖీలు కట్టారు. వారికి నిజముగా షాక్. వద్దంటే టీచర్ ఎదురుగా ఉంది. ఆమె అసలే స్ట్రిక్ట్. ముందు నుయ్యి, వెనకాల గొయ్యి, ప్రక్కన బావి అన్నట్లుగా ఉంది వారికి. ఇక ఆ అమ్మాయిలతో రాఖీ కట్టించుకోలేక తప్పింది కాదు. ఆ అమ్మాయిలేమో "..అన్నయ్యా" అని పేరు పేరునా సంభోదిస్తూ, తక్కువ ధరలోని రాఖీలు తెచ్చి కట్టేశారు. సగానికి పైగా పీరియడ్ అంతా ఈ కార్యక్రమానికే సరిపోయింది. అబ్బాయిల మొహాల్లో కత్తి గాటు పెట్టినా రక్తం రాలేనంత షాక్.

ఈ ప్రోగ్రాం అంతా రాఖీ పండగ రోజున శనివారం న జరిగింది. ఆదివారం స్కూల్ కి సెలవు. సోమవారం న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఇక మంగళవారం న అంటే నిన్నటి రోజున, యధావిధిగా క్లాస్ మొదలయ్యింది. అబ్బాయిలు తమకి రాఖీలు కట్టినవారికి ఫైవ్ స్టార్ బార్లూ, చాక్లెట్స్, బిస్కట్ ప్యాకెట్స్, పెన్నులూ.. బహుమతులుగా ఇచ్చారు.
అబ్బాయిలు ఎప్పటిలా వేధించినట్లుగా కాకుండా, సిస్టర్ సిస్టర్ అనుకుంటూ బాగా మాట్లాడారుట. క్లాస్ బ్రేక్ లో ముచ్చట్లలో - మనం ఇలా బాగా చదివి పెద్ద పెద్ద హోదాల్లో ఉండాలి, మనం ఇలా ఉండాలి, ఈ సబ్జెక్ట్స్ ఇలా చదువుకోవాలి అంటూ కబుర్లు చెప్పుకున్నారుట.

ఇదంతా ఆ అమ్మాయి చెబుతుంటే - నవ్వుకున్నాను.. ఆ అబ్బాయిల మనస్సుల్ని ఎంత దారుణముగా దెబ్బ కొట్టారో అనీ. అయినా మంచే జరిగిందిగా.. ఇదివరటిలా వేధింపులు లేవు.. స్వీట్స్, పెన్స్ అంటూ షేర్ చేసుకున్నారు. ప్రేమలూ అంటూ ఇబ్బంది పెట్టడాలు ఏమీ కనిపించలేదట. అది ఎప్పటికీ ఇలాగే జరిగితే బాగుండును అని ముగించింది.

ఈ విషయం లో ఏదైనా అప్డేట్స్ వస్తే / చెబితే తప్పక ఇక్కడే మళ్ళీ చెబుతాను.

టీచర్ ఇచ్చిన చిన్న ఐడియా కి వీళ్ళు ఎంతో సంతోషముగా, బాగా కలిసిపోయారు. 

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

oh.. Great thing.. very nice. I like it.nijampaa pillala madya sneha souhaardrabhaavam,sodara sodareemani bhaavam undaali. lenappudu..Inthe..nayya.ammayila telivi ilaage nayya.

Raj said...

అవును కదా.. ఇలా చేస్తే - ఈవ్ టీజింగ్ కాస్తైనా అరికట్టవచ్చును.

Related Posts with Thumbnails