Monday, August 1, 2011

నా షట్టర్ రిపేరింగ్ పనితనం

ది చాలా సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన..

ఒకసారి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాను. అతను నూతనముగా నిర్మిస్తున్న చిన్ని షాప్ కి షట్టర్ ఎక్కిస్తున్నారు. అందుకే అక్కడే ఉన్నాను.. అక్కడికే రారా అంటే అక్కడికి వెళ్లాను. అక్కడ నలుగురు షట్టర్ తయారీ పనివారు ఆ షట్టర్ ఎక్కిస్తున్నారు. సుత్తేలతో దడ మని ఒకటే బాదుడు. ఆ చప్పుడు భరించరాకున్నా.. అక్కడే ఉండక తప్పింది కాదు. 

"ఏరా? ఏమయ్యింది.." అని అడిగాను. 

"ఇంతకు ముందు అక్కడ తలుపు చెక్కలు ఉండెను. కాస్త సెక్యూరిటీ ప్రాబ్లెం వల్ల ఇలా షట్టర్ ఎక్కిస్తున్నాను. నాలుగు రోజులుగా ఆ షట్టర్ ఎక్కించటానికి ప్రయత్నిస్తున్నారు. అసలు కావటం లేదు. పూర్తిగా ఎక్కించాక, పైకీ, క్రిందకి లాగితే బాగా గట్టిగా ఉండి, జరపటానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ షట్టర్ తయారీ దారుడు మొదట్లో అలాగే ఉంటుంది, తరవాత  ఈజీగా ఫ్రీగా అవుతుంది అని అంటున్నాడు. నాకేమో నమ్మ బుద్ధి అవటం లేదురా. వీళ్ళు జంప్ అయ్యాక ఆ బాధలు నేను పడాలి. డబ్బులు ఇచ్చి ఆ తలనొప్పులు నేను పడాలి ఇక. అందుకే ఈజీగా ఉండేలా చేయమని చెబితే - ఇదిగో ఇలా  నాలుగురోజులుగా ఇలా పెద్ద చప్పుళ్ళు. ఆ షట్టర్ తిరగటానికి అటూ ఇటూ ఉండే గైడ్స్ ( U ఆకారములో ఉండే నిలువు ఇనుప పట్టీలు) లలో ఈ షట్టర్ పట్టీల లాక్స్ (రెండు పట్టీలని ఒకటే లెవల్లో ఉంచే త్రికోణాకార ముక్కలు, ఇవి వంచితే లాక్ లా పనిచేస్తాయి) తాకుతున్నాయి అని వాటిని సరి చేస్తున్నారు.. ఈ చప్పుడుకి, ఎందుకురా ఈ షట్టర్ వేయిస్తున్నానురా భగవంతుడా అని అనుకుంటున్నాను.." అని చెప్పాడు. 

అవును.. అతను చెప్పింది నిజమే. ఆ శబ్దం భరించలేనిది లా ఉంది కూడా.. అదీ నాలుగు రోజులుగా.. వామ్మో!. అనుకున్నాను.. నేనూ దగ్గరికి వెళ్లి చూశాను.. నిజమే.. ఆ గైడ్స్ లలో రాడ్ పెట్టి కొడుతూ, ఆ పట్టీల లాక్స్ ని కొడుతున్నారు.. కాని శబ్దం ఏమాత్రం తగ్గలేదు.. కాని కీచుగా భరించరానిదిగా మారింది. అలా చాలాసేపు ప్రయత్నించాక ఆ షట్టర్ తయారీదారుడు పని ఆపేశాడు.. "దీన...(బూతు). నాలుగురోజులుగా ఏమి సతాయిస్తుంది. ఇలా కాదుగానీ, మీకుఇంకో షట్టర్ చేసి పెడుతాను.." అని అన్నాడు. 

నా మిత్రుడు "ఇంకోవారమా.. అంతవరకూ ఆగాల్సిందేనా? ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.ఇక ఓపెనింగ్ చెయ్యాల్సిన తేదీ కూడా దాటేలా ఉంది.." అని ఏడుపు మొహం పెట్టాడు. 

నా మిత్రుడి బాధ చూసి దాని సంగతి ఏమిటో తేల్చేద్దామని అనుకున్నాను. దూరముగా వెళ్లి పరిశీలించాను. షట్టర్ మొత్తం క్రిందకి అనమని చెప్పాను. అతి కష్టం మీద వారు దాన్ని క్రిందకి అన్నారు. కాని నేలకి త్రాకకుండా ఇంకా గాలిలోనే ఉండి ఆగిపోయింది. అలా చూస్తుండగానే సమాధానం దొరికింది. 

ఆ షట్టర్ లేపినప్పుడు పైన చుట్టుకునే బార్ ని, ఇది చిన్న షట్టర్ కాబట్టి ఈజీగా రావటానికి మధ్యలో పట్టీలు పెట్టి, బెలూన్ లా చేశారు. వాటిమీద ఈ షట్టర్ పట్టీలు ఎక్కించేటప్పుడు వాడే రంధ్రాలు కాస్త వంకరగా అయ్యాయి. నిజం చెప్పాలీ అంటే రెండు వీల్స్ కి మధ్య పట్టీలు వంకరగా అతికారు. ఒక ఇంచీ దాకా తేడా ఉంది. 

ఆ విషయం ఆ షట్టర్ తయారీదారునితో చెబితే అసలు నమ్మలేదు. అది కాదు సమస్య అంటాడు. నాకు కాస్త తాపీ మేస్త్రీ పని కూడా వచ్చు. ఆ అనుభవముతో, "లేవేలింగ్ పైప్ ఉందా?.." అడిగాను. 

"ఉంది" అన్నాడు. "అవన్నీ చూశాం" అన్నాడు. 

"ఓకే. అవన్నీ చూశారు కాని అసలుది చూడలేదు.." అని అన్నాను. అతనికి అర్థం కాలేదు. ముందు ఆ పైప్ లో వాటర్ నింపి ఇవ్వండి అని ఒక స్టూల్ వేసుకొని ఆ షట్టర్ ముందు ఎక్కి నిలబడ్డాను. 

ఆ షట్టర్ తయారీవాడు అలాగే ఆ పైప్ లో నీరు నింపి ఇచ్చాడు. నేను లేవలింగ్ చూపాను. నేను అనుకున్నట్లే ఎడమ షట్టర్ బేరింగ్ రింగ్ కి, కుడి షట్టర్ బేరింగ్ రింగ్ కి దాదాపు ఒక అంగుళం పైకి జరిగి, తేడా ఉంది. అందరూ షాక్. 


ఆ షట్టర్ వాడు ఒప్పుకున్నాడు. తన పనివాళ్ళని ఆ బేరింగ్ పైప్ విప్పమని చెప్పాడు. అది తీసుకెళ్ళి, ఆ సాయంత్రం వరకల్లా లేవలింగ్ చేసుకొని, వచ్చి బిగించాడు. ఈజీగా ఉంది అప్పుడు. ఆ షట్టర్ గైడ్స్ లలో మామూలు గ్రీజు నల్లనిది పూయబోయాడు. నేను వద్దని మంచి క్వాలిటీ తెల్లని గ్రీజు తెప్పించి (పదిహేను రూపాయలు తేడా) పూయించాను. ఇప్పుడు ఒక్కసారి క్రిందకి అంటే నేలకి త్రాకుతున్నది. అందరూ సంతోషం. 

నేనూ షట్టర్ రిపేరింగ్, నిర్మాణాలు చేసుకుంటూ బ్రతకవచ్చును అని ఒక నామీద నాకు నమ్మకం ఏర్పడింది. కాని ఆ అవసరం ఇంతవరకూ పడలేదు.. 

No comments:

Related Posts with Thumbnails