చాలారోజుల క్రిందట నుండీ ఒకతను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు.. కారణం ఏమిటో తెలీదు.. అతను ఏమి ఆశించి అలా చేశాడో / చేస్తున్నాడో నాకు ఇంతవరకూ తెలీదు.. అయ్యో.. వాటి తాలూకు వివరాలు చెప్పనే చెప్పలేదు కదూ.. సరే. చెబుతాను.
నా బ్లాగులోనే - నేను డిసెంబర్ 26, 2009 న ఒక టపా ఉంచాను. అది Shri Vaikuntha Ekadashi at Shrila Prabhupada's ISKCON Bangalore ఇదీ ఆ టపా. ఆ టపా అంతా బెంగుళూరు లోని ఇస్కాన్ టెంపుల్ లోని స్వామి వారి అభిషేక పూజా ఫోటోలతో కూడినది. సమస్య అవి పెట్టడములో కాదు. ఆ టపాకి వచ్చిన కామెంట్స్.
ఎవరో ఒకరు anonymous గా ఉంటూ అక్కడ ప్రతిరోజూ కామెంట్స్ వ్రాసేడివారు. అసలు ఆ టపాకి ఏమాత్రం సంబంధం లేకుండా ఆ కామెంట్స్ ఉండేడివి - ఉదాహరణకి: ఫలానా లింకుని నొక్కండి.. మీకు ఇలా కనపడుతుంది, ఈ సైటు చూడండి. మీకు అత్యవసరమైనది అంటూ... ఇలా రకరకాలుగా కామెంట్స్ ఉండేడివి. అవి ఆ టపాకి సంబంధం లేకుండేడిటివి కావటముతో రోజూ తప్పనిసరిగా ఆ టపాకి వచ్చి ఆ కామెంట్ డిలీట్ చేసేవాడిని.
వారెవరో రోజూ అలా ఒకటి సంబంధం లేని కామెంట్ ని ఆ టపాలో వ్రాయడం, నేను తీరుబాటుగా నా బ్లాగుకి వచ్చి, ఆ కామెంట్ ని డెలీట్ చేసెయ్యడం.. ఇలా రోజూ, కొన్ని నెలలు గడిచాయి. ఓపికగా అలా డెలీట్ చేస్తూనే పోయాను. వారికి టైపు చేసీ, చేసీ చేతులు నొప్పి పెట్టినట్లున్నాయి.. చాలా తగ్గించాడు.
ఇలా వేరే వారికి ఎందుకు ఇబ్బంది కలిగించి ఏమి బావుకుంటారో నాకు అసలు అర్థం కాదు. అతడు anonymous గా వ్రాసాడు గాని, తన పేరు పెట్టుకుని వ్రాస్తే అతడు చేసిన పనినే నేనూ చేసి, అతడిని ఇబ్బంది కలిగించేవాడినేమో!.. మీలో ఎవరైనా కామెంట్ మాడరేషన్ పెట్టకుండా ఉన్నట్లయితే వెంటనే పెట్టేసుకోండి.
నా బ్లాగులోనే - నేను డిసెంబర్ 26, 2009 న ఒక టపా ఉంచాను. అది Shri Vaikuntha Ekadashi at Shrila Prabhupada's ISKCON Bangalore ఇదీ ఆ టపా. ఆ టపా అంతా బెంగుళూరు లోని ఇస్కాన్ టెంపుల్ లోని స్వామి వారి అభిషేక పూజా ఫోటోలతో కూడినది. సమస్య అవి పెట్టడములో కాదు. ఆ టపాకి వచ్చిన కామెంట్స్.
ఎవరో ఒకరు anonymous గా ఉంటూ అక్కడ ప్రతిరోజూ కామెంట్స్ వ్రాసేడివారు. అసలు ఆ టపాకి ఏమాత్రం సంబంధం లేకుండా ఆ కామెంట్స్ ఉండేడివి - ఉదాహరణకి: ఫలానా లింకుని నొక్కండి.. మీకు ఇలా కనపడుతుంది, ఈ సైటు చూడండి. మీకు అత్యవసరమైనది అంటూ... ఇలా రకరకాలుగా కామెంట్స్ ఉండేడివి. అవి ఆ టపాకి సంబంధం లేకుండేడిటివి కావటముతో రోజూ తప్పనిసరిగా ఆ టపాకి వచ్చి ఆ కామెంట్ డిలీట్ చేసేవాడిని.
ఇలా కాదనుకొని ఆ టపానే నా హోం పేజీగా మారింది. అంటే నెట్ లోకి రాగానే ముందుగా ఆ పేజే ఓపెన్ అయ్యేలా పెట్టుకోవాల్సివచ్చింది. అదీ కొద్దిరోజులు.. ఇక లాభం లేదనుకొని తెలుగు బ్లాగర్ల గుంపు కి ఈ సమస్యని వివరించాను.. కామెంట్ మాడరేషన్ పెట్టుకోండి.. మీ సమస్య తీరుతుంది అన్నారు. అలాగే ఇలా పెట్టుకున్నాను. వారికి నా కృతజ్ఞతలు.
1. ముందుగా మీ బ్లాగ్ హోం పేజీ ఓపెన్ చెయ్యండి. అందులో Settings 1 ని నొక్కండి.
2. అలా నొక్కగా వచ్చిన మరియొక టూల్ బార్ లో నాలుగోది అయిన Comments 2 ని నొక్కండి.
. ఇప్పుడు మీకు కామెంట్స్ సెట్టింగ్స్ పేజీ ఇలా ఓపెన్ అయ్యి కనిపిస్తుంది.
3. Comment moderation వద్ద Always 3 ని ఎన్నుకోండి. ఇదే అసలైన సెట్టింగ్ ఆప్షన్.
4. ఎవరైనా కామెంట్స్ గనుక పెడితే, ఆ కామెంట్ ని చూసి OK చెయ్యటానికి, మీరు మీ బ్లాగ్ హోం పేజీలోకి రాకుండానే, మీ మెయిల్ బాక్స్ లోనే అలా చూసి OK చెయ్యాలీ అనుకుంటే - ఆ మీ మెయిల్ ID ని ఆ 4 వద్ద వ్రాయండి.
5. ఇక్కడ మీరు Show word verification ని NO అనే 5 అని సెలెక్ట్ చెయ్యండి. ఇలా ఎందుకూ అంటే - ఆ కామెంట్స్ వ్రాసేవారు మతి స్థిమితమూ, చదువు లేనివారై, మత్తులో ఉండి వ్రాయకుండా నిరోధించటానికి ఆ ఆప్షన్ పెడతారు. కాని ఇక్కడ మాడరేషన్ పెట్టుకుంటున్నాము కాబట్టి అది ఇక్కడ మనకి అవసరం ఉండదు. కనుక మీరు NO అని ఎంచుకోవాలి. ఇది పెట్టుకుంటే కామెంట్స్ వ్రాయటానికి మిగతావారు కాస్త ఇష్టం చూపకపోవచ్చును.
6. Show profile images on comments అనేది ఆ వచ్చిన కామెంట్స్ చేసినవారి ప్రొఫైల్ ఫోటో ఆ కామెంట్ ప్రక్కన కనిపించేలా చేసుకోవచ్చును. ఇది పెట్టుకోవటం మంచిది. కనుక మీరు YES ని ఎంచుకోవాలి.
7. చివరిగా ఇక మీరు SAVE SETTINGS నొక్కితే సరి. ఇక మీ బ్లాగ్ కి వచ్చే కామెంట్స్ ని హాయిగా ఎంజాయ్ చేస్తూ, బాగున్నవి పబ్లిష్ చేస్తూ, బాగా లేనివి డెలీట్ చేస్తూ హ్యాపీగా ఉండొచ్చును.
ఇలా వేరే వారికి ఎందుకు ఇబ్బంది కలిగించి ఏమి బావుకుంటారో నాకు అసలు అర్థం కాదు. అతడు anonymous గా వ్రాసాడు గాని, తన పేరు పెట్టుకుని వ్రాస్తే అతడు చేసిన పనినే నేనూ చేసి, అతడిని ఇబ్బంది కలిగించేవాడినేమో!.. మీలో ఎవరైనా కామెంట్ మాడరేషన్ పెట్టకుండా ఉన్నట్లయితే వెంటనే పెట్టేసుకోండి.
No comments:
Post a Comment