Monday, August 29, 2011

Social NW Sites - 36 - Post Scripts - 3

సోషల్ సైట్ స్నేహాలు నిజానికి అందమైన ఊబి. మనసుకి నచ్చని మిత్రులు ఉన్నప్పుడు - అంతా బోర్ గా ఉంటుంది. "ఈ సైట్ బాగాలేదు.. ఆ సైట్ బాగుంది. ఫలానా దాంట్లో బాగున్నారు.. ఆ సైట్ కి బాగా పేరు ఉంది. అందులో అకౌంట్ లేకుంటే జన్మే వృధా.." అనే మాటలు వస్తాయి. నిజానికి ఎక్కడైనా ఒక్కటే! ఈ గదిలో కాకుంటే ఆ గదిలో మాట్లాడుకోవటం అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ మాట్లాడేవారే అక్కడ ఉంటారు. దానికోసం అనీ, వారు ఎక్కడ ఉన్నారో అని చూడటానికి ఆయా సైట్ లలోకి లాగిన్ అవ్వాలి.  సమయం వృధా..

న్ను ఒకరు ఎప్పుడూ ఆన్ లైన్లో కనిపిస్తావు అని బాగా అనేవాడు. నేను చెప్పాను - నేను ఒకటే సైట్లో ఉన్నాను అనీ. తను మాత్రం అలాని కాదు. అతను మాత్రం ఆరు సైట్లలో సభ్యుడు. అతను ఆక్టివ్ గా ఉండేది ఫేస్ బుక్. (తన సిస్టం లో ఫేస్ బుక్ తప్పనిసరిగా అడ్రెస్స్ బార్ లో ఉన్నది.) ఆఖరికి మొన్న మొన్న ఓపెన్ అయ్యిన గూగుల్ + సోషల్ సైట్ లో కూడా సభ్యుడే!.. ఓకే.. అది వారి ఇష్టం. కాదనను. నేను బాగా కనిపిస్తున్నాను అంటే తనూ బాగానే వస్తున్నాడనే కదా.. ఫలానా షాపింగ్ మాల్లో నీవు బాగా కనిపిస్తున్నావూ అంటే - తనూ అక్కడికి వస్తేనేగా - మనల్ని చూసి అలా అనేది. ఇదే మాట అన్నాను.. ఇక ఆ టాపిక్ బంద్.

క్కువ సైట్లలోకి లాగిన్ అయ్యామే అనుకోండి. కొన్ని స్నేహాల్ని మిస్ అవుతాము. జవాబు తొందరగా ఇచ్చే నేర్పు మీలో ఉంటే ఏమీ కాదు. కానీ, నెమ్మదిగా జవాబు ఇచ్చేవారిలా మీరు ఉన్నారే అనుకోండి. అప్పుడు కొందరిని దూరం అవుతారు. నా నేస్తం ఒకరు అలాగే మూడు నాలుగు సైట్స్ లలో ఉండి, రోజుకొక సైట్ కి లాగిన్ జవాబు చెప్పేవారు. ఏదైనా అడిగితే నాలుగురోజులకి గానీ జవాబు రాదు. విసుగొచ్చి, మానేశాను. తనకి వ్రాసినా, గత ఆరు నెలల నుండీ ఏమీ రిప్లైస్ రాలేదు. ఇక తనని రిమూవ్ చెయ్యటమే మిగిలుంది ఇక. ఇలాంటివి కూడా అవుతుంటాయి. 

స్నేహాల్ని కాపాడుకోవటం ఒక గొప్ప కళ. నిస్వార్థముగా, స్నేహాలు చేసేవారు ఇలా బాగా ప్రయత్నిస్తారు. అవతలివారి నుండి ఏదో లాభం పొందాలని చూసేవారు - వీరు నాకు ఉంటే ఏమిటీ? లేకుంటే ఏమిటీ? నేను వీరిదగ్గరి నుండి కొంత పొందానుగా అది చాలు అనుకునే సెల్ఫిష్ వాళ్ళు. ఇలాంటివారిని కాస్త అనుభవం మీద ఈజీగా గుర్తుపట్టొచ్చును. ఒకరకముగా పోలికతో చెప్పాలి అంటే - స్నేహాల్ని గోరింటాకుతో పోల్చవచ్చును. చేతికి పెట్టేసుకొని, ఎర్రగా అయ్యేవరకూ ఎంతో ప్రేమగా, బాగా కన్సర్న్ చూపి, ఉంచుకొని, ఆ తరవాత నిర్దాక్షిణ్యంగా పారేసే వాళ్ళు అనుకోవచ్చును. ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా ఉండండి. 

పైన చెప్పినదానికి ఒక ఉదాహరణ చెబుతాను. ఒక అబ్బాయి ఆడ్ అయ్యాక మాటలు కాని, రిప్లైస్ కానీ ఏమీ లేవు. ఏదో కమ్యూనిటీలో సభ్యుడు. అందులో ఒక తేదీ గడువు లోగా, ఎవరికీ ఎక్కువ వోట్లు వస్తాయో చూడటానికి, అదొక నోబెల్ ప్రైజ్ సాధించినట్లు ఫీల్ అవుతున్నారు. ఎవరికీ వారికి ఎక్కువ వోట్లు పడటానికి అందరికీ ఆడ్ రిక్వెస్ట్ పెట్టి, ఆడ్ అయ్యాక, మెల్లిగా మనల్ని ఆ కమ్యూనిటీలో జాయిన్ అయ్యేదాకా బాగా మాట్లాడుతారు. ఆ తరవాత మాటలు కరువవుతాయి.. ఆతరవాత ఏదైనా వోటింగ్ ఉంటేనే - "హాయ్.." అని పలకరింపులు.. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక ఇలా ఈ లింక్ లోకి వెళ్లి నాకు వోట్ చెయ్యండి అని పలకరింపులు. మనం ఓకే అన్నాక వెంటనే అంతే.. "మనం మళ్ళీ కలుద్దాం.." అని జంప్ జిలానీ. ఒక నెలలో మూడు నాలుగు ఇవే!.. చూసి చూసి అతన్ని రిమూవ్ చేసి, ఇగ్నోర్ చేశాను. తన లాభం కోసమే నన్ను వాడుకుంటున్నాడు అని అర్థం వచ్చేలా ప్రవర్తించాడు. 

న చిన్న చిన్న పొరబాట్లు ఎత్తి చూపినప్పుడు కోపంకి గురికాకుండా ఆ తప్పు ఉంటే సరి దిద్దుకోండి. ఇదే బ్లాగ్ లో నేను ఒకసారి వెళదాము అనే బదులు వెడతాము అని వ్రాశాను. నాకు అలాగే అలవాటు. ప్రసాద్ గారు కామెంట్ వ్రాశారు.. "వెడదాము కాదండీ.. వెళదాము" అనీ.. నేను ఆ పదం వ్రాసినప్పుడల్లా తనే గుర్తుకు వస్తారు.. బుద్ధిగా "వెళదాము" అని వ్రాసి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని హమ్మయ్య అని అనుకుంటాను. అలాని వారి మీద ఏదో కోపం చెందలేదు. ఇలా చాలామంది చెబుతారు. నచ్చితే పాటించండి. లేకుంటే విని ఊరుకోండి. మనం ఫీలయ్యి ఏదో అంటే - మనకి మంచి చెప్పేవారు దొరకక పోవచ్చును.

(సశేషం..)

No comments:

Related Posts with Thumbnails