నిన్నటి రోజున అలా చిన్నగా డ్యాం చూడటానికి వెళ్లాను. వెళ్తూ కెమరాని కూడా తీసుకెళ్ళాను. ఓవర్ ఫ్లో అయిన ఆ నీళ్ళలో చాలా ఎంజాయ్ చేశాను. అక్కడికి చాలామంది వచ్చారు. అందరిలో అలా నేనూ ఒకడినై బాగా ఆనందం అనుభవించాను. పనిలో పనిగా నూటయాభై వరకు ఫొటోస్ దిగాను. చాలా మెమొరబుల్ ఫొటోస్ అవి. బాగా నీళ్ళల్లో ఆడి, అలసిన శరీరముతో ఇంటికి వచ్చాను.
వాటిని సిస్టం లోకి అప్లోడ్ చేద్దామని చూస్తే రావటం లేదు. అన్నీ, అంతా బాగున్నాయి. ఇలా ఓపెన్ అయ్యి అలా వెళ్లిపోతున్నాయి. వైరస్ స్కాన్ చేశా.. ఊహు.. కట్ కానీ, కాపీ గానీ అవటం లేదు. ఎందుకాని చూస్తే ఒక ఫోటో ప్రాపర్టీస్ లో కాస్త టెక్నికల్ ఇబ్బందులు. అది నా పొరబాటు కాదు. కొన్ని అప్లోడ్ అయ్యాక, ఆ ఫోటో వచ్చాక అక్కడితో ఆగిపోతున్నాయి.
ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కట్ చేద్దామన్నా రాలేదు. కాపీ చేద్దామన్నా రావటం లేదు. సిస్టం లోనే ఓపెన్ పెద్దగా ఓపెన్ చేసి, స్క్రీన్ షాట్ ద్వారా ఒపే చేద్దామన్నా ఊహు.. రాలేదు. థంబ్నెయిల్ ఫొటోస్ వస్తున్నాయి అంతే. ఆ ఒక్క ఫోటో ప్రాపర్టీస్ బ్లాక్ అయ్యి ఇదంతా ఇబ్బంది. ఆ ఫోటోని డిలీట్ చేస్తే ప్రాబ్లం పోతుందేమో అనుకొని డిలీట్ చేశాను. కాని అది ఎంతకే డిలీట్ అవటం లేదు. ఇటు సిస్టం లో ఓపెన్ అవక, అటు అప్లోడ్ అవక ఎంతో ఇబ్బంది పడ్డాను.
పోనీ, అందులో మెమొరీ కార్డ్ లో ఫొటోస్ లేవా అని కాదు.. ఉన్నాయి. ప్రాపర్టీస్ లో 531 MB అని చూపిస్తున్నది. రికవరీ టూల్స్ వాడాను. ఊహు.. ఇలా కాదనుకొని ఆన్ లైన్ లో ప్రయత్నించాను. అదీ అంతే!.. ఆ ఫోటో ఒక్కటే అంతా ఆపేస్తున్నది. ప్రాబ్లమూ చిన్నదే! ఆ ఫోటో సీరియల్ నంబర్ లో సరిగా రాక.. ఇదంతా జరిగింది. ఇక లాభం లేదు అనుకొని, ఆ ఫొటోస్ మీద ఆశ వదులుకున్నాను. ఇక ఆ మెమొరీ కార్డ్ ని ఫార్మాట్ చెయ్యాలని అనుకున్నాను. అది కూడా సిస్టం లో అవటం లేదు. ఇక కేమరాలోనే పెట్టి చెయ్యాలి. అదీ కాకపోతే ఇక ఆ కార్డ్ ని విసిరేయ్యాలి. ఇదో వింతగా ఉంది నాకు.
చేద్దామని డిసైడ్ అయ్యాక చివరిగా ఫార్మాట్ నోక్కేలోగా - చప్పున ఒక ఆలోచన. కేమరాకి USB కేబుల్ తగిలిస్తే? అని. వావ్.. బాగుంది. ఇదీ ఒకసారి ప్రయత్నిద్దాం అనుకున్నాను. వెంటనే USB కేబుల్ తగిలించాను.
ఆశ్చర్యం. అన్నీ ఓపెన్ అయ్యాయి. (((((( వావ్ )))))) అని అరిచాను. నన్ను నేను గిల్లుకున్నాను. బాగానే నొప్పిపెట్టింది. ఒక్కో ఫోటో ఓపెన్ చేస్తూ చూస్తూ, అప్లోడ్ చెయ్యటం మొదలెట్టాను. హమ్మయ్య!. అన్ని ఫొటోస్ అప్లోడ్ చేశాక.. ఒకసారి అంతా ఒకే చేసుకొన్నాక, ఆ మెమొరీ కార్డ్ ని ఫార్మాట్ చేశాను.
అలా కొన్ని మధుర జ్ఞాపకాలు నాకు దక్కాయి.
No comments:
Post a Comment