ఇప్పటివారికి ఫొటోస్ దిగటం - అందమైన చోట్లలో దిగటం ఇప్పుడు ఈజీ గానీ పాతకాలము అంటే 1970 నుండి 1980 ప్రాంతములో ఫోటో దిగాలంటే ఈ క్రింది బ్యాక్ గ్రౌండ్స్ లలోనే దిగేవారు.. అప్పట్లో కెమరా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న, మరియు ప్రయాసలకి గురయ్యే పనిగా భావించేవారు. అప్పట్లో కెమరాలు చాలా తక్కువగా, ఫొటోస్ మరీ తక్కువగా ఉండెడివి. అప్పట్లో ఆ ఊర్లకి వచ్చిన సర్కస్ కంపనీల వద్దనో, జాతర్లప్పుడో ఫొటోస్ దిగేవారు. అలా దిగిన ఫొటోస్ వెంటనే ఇచ్చేదివారు కాదు. ఒక స్లిప్ ఇచ్చి మూడు, నాలుగు రోజులకి రమ్మనేడివారు. అయినా సరే! అలా ఫొటోస్ దిగటం ఒక గొప్ప విశేషముగా భావించెడివారు. ఆ దిగిన ఫోటోని పడే పడే చూస్తూ, దగ్గరివారికి చూపిస్తూ ఎంతో సంతోషం పడేవారు కూడా.
అప్పట్లో ఆరుబయట ఫోటో దిగటం అంటే పెద్ద పనిలా భావించేడివారు. ఒకవేళ తీసినా సరిగ్గా వచ్చేది కావు. కెమరా బటన్ ఎలా నొక్కాలో కూడా చాలామందికి తెలీదు. ఈనాటికీ అలాంటివారు ఉన్నారు కూడా. చాలావరకు ఇలా స్టూడియోలలోనే దిగేడివారు. సర్కస్‌లు వస్తే అక్కడ కాస్త తక్కువ డబ్బులకి ఫొటోస్ తీసేడివారు. అక్కడ ఒక చిన్న గదిలో, మూడువైపులా మూడు బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్స్ ఉండెడివి. అందులో ఒకవైపు ప్రకృతి దృశ్యాలు, మరోవైపు అక్కముక్కల చంద్రుడు మధ్య నిలబడటం, మూదోవైపుగా పాతకాలం మోటార్ సైకిల్ ఉండెడివి. ఇవిగాక ఒక హీరోయిన్, ఒక హీరో నిలువెత్తు సైజులో అట్టతో చేసినవీ ఉండేవి. అవి బ్యాక్‌గ్రౌండ్ గా వచ్చేలా చాలామంది దిగేవారు. చాలామంది ఎక్కువగా అప్పట్లో ఎంతో విలాసమైన లాండ్ ఫోన్, బ్లాక్ అండ్ వైట్ టీవీ ముందో, లేదా మోటార్ సైకిల్ మీదనో కూర్చొని ఫొటోస్ దిగటం పిచ్చ క్రేజుగా ఉండెడిది. అవి ఎలా ఉండేవో ఈ క్రింది ఫోటోలలో చూడండి.
3 comments:
last photo 'ADHURS'
రాణీ ముఖర్జీ మోజుపడి పుటో తీయించుకున్న ఆయబ్బాయి ఎవరో ?
నేను మాత్రం కాదండీ.. నాకు ఇవి ఒక మెయిల్ లో దొరికాయి. + అప్పటి నా జ్ఞాపకాలు కలిపి ఆ పోస్ట్ ని పోస్ట్ చేశాను.
Post a Comment