నిన్న నాకో మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసి హాస్చర్యపడిపోయాను. ఎంటబ్బా! నేను సెలెక్ట్ అయ్యానా? ఆహా! నా దరిద్రం మొత్తం తీరిపోయింది అనుకోలేదు. ఆ మెయిల్స్ గురించి నాకు ఎప్పుడో తెలుసు కాబట్టే - అంత హాస్చర్యపడిపోలేదు. లైట్ తీసుకున్నాను. అది ఏమిటో మీకు చెప్పాలని అనుకున్నాను. నేను కోట్లాది రూపాయల లాటరీని పొందాను అని వాటి సారాంశం. అందులకు నాకు మీరు అభినందనలు ఏమీ తెలియచేయకండి.
అలా వచ్చిన మూడు మెయిల్స్ ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి.
నేను అలా లక్షలాది, కోటి బ్రిటీష పౌండ్స్ ని పొందటానికి అర్హుడిని అన్నమాట. ఒక బ్రిటీష పౌండ్ ఇప్పుడు 1 British pound = 71.005258 భారతదేశ రూపాయలుగా ఉంది. ఆ లెక్కన చూస్తే ఆ 850,000 పౌండ్స్ కి 5,99,29,184-20 రూపాయలు, ఆ 1000,000 పౌండ్స్ కి 7,05,04,922-60 రూపాయలు మారకం ఉంది. హుర్రే అని అనుకోలేదు.
నిజానికి అవన్నీ ఫేక్ / అబద్దపు మెయిళ్ళు. అందులో సంస్థల పేర్లూ అడ్రెస్ లూ, కాంటాక్ట్ నంబర్స్ కానీ, అడ్రెస్ కానీ ఉండవు. అంతా బోగస్. ఇదేదో బాగుంది అనుకొని మన వివరాలు మెయిల్ చేశామే అనుకోండి. ఇక చిక్కులు తప్పవు అన్నమాట. ఆ తరవాత ప్రాసెస్ కోసం కొంత డబ్బు పంపమని చేపటం, మనం వెయ్యటం, వారు ఇంకొద్దిగా వెయ్యమనటం........... అంతులేని వాయిదాలు నడుస్తూనే ఉంటాయి. ఒకరోజు అది అంతా బోగస్ అని తెలుసుకొని లబో దిబో అని ఏడుస్తూ కూర్చోవాల్సిందే! కనుక తస్మాత్ జాగ్రత్త.
అలాంటి మెయిల్స్ వస్తే - వెంటనే డిలీట్ చేసి మరచిపోవటం ఉత్తమం.
2 comments:
avunu maaku kooda vachchayi.manchi vishayam chepparu.
ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే - ఇలా మెయిల్స్ మాత్రమె కాకుండా SMS కూడా వస్తున్నాయి.. నాకు అలా మూడు SMS లు వచ్చాయి.
Post a Comment