చిత్రం : తాజ్‌మహల్ (1995),
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ,
గానం : బాలు, చిత్ర
**************
పల్లవి :
మంచు కొండల్లోన చంద్రమా - చందనాలు చల్లిపో
మెచ్చి మేలుకున్న బంధమా - అందమంతా అల్లుకో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో- మధురమీ సంగమం
కొత్త దాహంలో వింతమోహంలో - మనదిలే సంబరం
పల్లవించుతున్న ప్రణయమా - మళ్లీ మళ్లీ వచ్చిపో
విన్నవించుకున్న పరువమా - వెన్నముద్దులిచ్చిపో
కొంటె రాగంలో జంట గానంలో - వలపుకే వందనం
చరణం 1 :
ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి - ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు
నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని - ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి
తోడై నువ్వుంటే నీడై నేనుంటా - లోకం నువ్వంటా ఏకంకమ్మంటా
వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా - యుగము క్షణమై సదా జగము మరిపించనా
వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని - తరగని ప్రేమలలో // మంచుపూల //
చరణం 2 :
వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ - నిన్న కన్నె వన్నెలన్నీ చూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి
గున్నమావి కొమ్మ సన్నజాజి రెమ్మ - ముచ్చటాడే నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి
చిందే సింగారం సిగ్గే సింధూరం - పొందే వైభోగం నాదే ఈ భాగ్యం
కలయికల కావ్యమై కలలు చిగురించెనా - శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా
ఏడేడు లోకాల ఎల్లలు దాటిన - అల్లరి ప్రేమలలో // మంచుపూల //
No comments:
Post a Comment