Monday, July 11, 2011

Mark as Spam(er)

నాకు రెండు, మూడు సంవత్సరాలుగా నా బ్లాగ్ ని దర్శించి, ఒక కామెంట్ పెడుతున్న ఒక వ్యక్తి గురించి చెబుతాను.

చాలాకాలము నుండి అలా కామెంట్స్ పెట్టేవాడు. అందులో ఏమీ ఉండదు.. అన్నీ లింకులే!. అవి నొక్కితే యే మాల్వేర్లు నా సిస్టంలో తిష్టవేస్తాయో అని హడలిచచ్చాను. నా బ్లాగ్ కి మొదట్లో కామెంట్స్ మాడరేషన్ అసలు పెట్టేవాడినే కాదు. ఎవరైనా కామెంట్స్ పెట్టేలా పెట్టాను. ఈ ఒకేఒక్క వ్యక్తి వల్ల కామెంట్స్ మాడరేషన్ పెట్టాల్సి వచ్చింది. పోనీ ఆ కామెంట్స్ లలో ఏమైనా పస ఉందా అంటే - ఏమీ ఉండదు. అన్నీ లింకులే. అదీ కూడా ఒకే ఒక పోస్ట్ కి మాత్రమే అలా చేసేవాడు. మొదట్లో డిలీట్ చెయ్యలేక బాగా విసుగు వచ్చేడిది.



ఇలా ఉండేది ఆ కామెంట్స్. ఇక ఏమి చేస్తాం. అలా చదువుకున్న అతనూ అలా కామెంట్స్ పెట్టడములో ఉద్దేశ్యమేమిటో నాకు ఇంతవరకూ అర్థం కాలేదు.

ఇక లాభం లేదని మాడరేషన్ పెట్టాను. కొద్దిగా బాధ తగ్గింది. వేరేవారు వ్రాసినవి కూడా అలా మాడరేషన్ లో ఉండిపోయేవి. ఒక్కొక్కటి చూస్తూ అక్సేప్ట్ చెయ్యాల్సివచ్చేడిది. కాస్త ఇబ్బందిగా తోచేది. వారానికి మూడు నాలుగు అలా వస్తే ఏమి చేస్తాం.? ఆ పెట్టేది కూడా ఎక్కువగా ఈ Shri Vaikuntha Ekadashi at Shrila Prabhupada's ISKCON Bangalore అనే టపాకే. 



అప్పుడే ఒక విషయం తెలిసింది. అలాంటి కామెంట్స్ వస్తే ఆ 1 వద్ద నున్న Mark as spam ని సెలెక్ట్ చేశాను. ఇక నుండీ ఆ అతనివద్ద నుండి వచ్చే మెయిల్స్ అన్నీ స్పాం లోకి వెళ్లిపోతున్నాయి. ఐదారు నెలలకి ఒకసారి ఆ స్పాం బాక్స్ ఓపెన్ చేసి అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని, డిలీట్ నోక్కేస్తున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను.  ఈ సదుపాయం ఇచ్చిన బ్లాగర్ వాళ్లకి కృతజ్ఞతలు..

No comments:

Related Posts with Thumbnails