Friday, July 15, 2011

Word press బ్లాగుల్లో కామెంట్స్ పెట్టడం.

బ్లాగ్ స్పాట్లో మాదిరిగా, వర్డ్ ప్రెస్ లోని బ్లాగుల్లో కామెంట్స్ పెట్టాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చును. కాస్త తేడా ఉంటుంది. అర్థం అయితే చాలా ఈజీ అది. అదే మీ సమస్య అయితే, చాలా తేలికగా మీరు ఈ క్రింది పద్దతులని ఆచరించి చేయవచ్చును. ఒకసారి చూడండి. మీ ప్రశ్నకి సమాధానముగా మీకు (అందరికీ) చక్కగా తెలియాలని కామెంట్ పెట్టాను. అవి అన్నీ తెరపట్టు రూపములో చూపిస్తున్నాను. 

బ్లాగ్ స్పాట్ లాగా వర్డ్ ప్రెస్ లో కూడా కామెంట్స్ పెట్టవచ్చును. కాకపోతే కామెంట్స్ మాడరేషన్, కామెంట్స్ బ్లాకింగ్.. ఇత్యాది సెట్టింగ్స్ కూడా ఉంటాయి. కాకపోతే బ్లాగ్ స్పాట్ లలో కామెంట్స్ పెట్టే అలవాటు అయినవారికి, ఈ వర్డ్ ప్రెస్ కాస్త క్రొత్తగా, తికమకగా ఉంటాయి (అలాని అనిపిస్తాయి కాని కాదు). మీరు వర్డ్ ప్రెస్ లో కామెంట్ పెట్టాలీ అనుకుంటే ఆ టపా క్రింద ఇలా మీకు కనిపిస్తుంది. (ఎక్కడైనా అర్థం కాకుంటే ఆ ఫోటోల మీద డబల్ క్లిక్ నొక్కండి.)


పైన వద్ద మీ ప్రస్తుత మెయిల్ ID ని వ్రాయాలి. ఇది మీరు తప్పనిసరిగా వ్రాయాల్సిందే. లేకుంటే మీ వాఖ్యని సర్వర్ అంగీకరించదు. 
2 వద్ద మీ పేరుని వ్రాయాలి. ఈ పేరు మీదే అక్కడ కామెంట్ పబ్లిష్ అవుతుంది. 
3 వద్ద మీ యొక్క వెబ్ సైట్ (బ్లాగ్) వ్రాయాలి. వ్రాయకున్నా ఫరవాలేదు. వ్రాస్తే మీ బ్లాగ్ కి కాస్త ప్రచారం వస్తుంది. అవతలివారు మీ బ్లాగ్ ని సందర్శించవచ్చును. 
వద్ద మీరు ఏమని కామెంట్ చెయ్యదలచుకున్నారో, ఆ కామెంట్ ని అక్కడ వ్రాయండి. 

ఇప్పుడు - మీకు మరింతగా తెలియటానికి ఒక కామెంట్ ని పోస్ట్ చేస్తున్నాను. క్రింద తెరపట్టులో చూడండి. అలా వ్రాశాక 5 వద్ద Post comment ని నొక్కండి. అంతే!..


ఒకవేళ ఆ బ్లాగ్ స్వంతదారుడు కామెంట్స్ మాడరేషన్ పెట్టాడే అనుకుంటే - మీ కామెంట్ ఇలా 6 లా అక్కడ కనిపిస్తుంది. అలా వారు ఓకే చేస్తే మీ కామెంట్ అక్కడ పబ్లిష్ అవుతుంది. 



2 comments:

Anonymous said...

బ్లాగ్ స్పాట్ లో ఉన్నట్లు, వర్డ్ ప్రెస్ లో వీక్షణాల వివరాలు onliner's location ఎలా పెట్టుకోవాలో కాస్త వివరించగలరా? నేను గత రెండేళ్ళనుండి వర్డ్ ప్రెస్ లో ఇప్పటికి 600 పైన టపాలు వ్రాశాను. ఏం లేదూ, వివరాలు కూడా తెలుస్తే బావుంటుందనీ. ప్రస్తుత వీక్షకుల సంఖ్య లక్షా పాతికవేలు దాటింది.

Raj said...

హరేఫల గారూ!.. మన్నించాలి. నాకు బ్లాగ్ స్పాట్ లోనే అక్కౌంట్ ఉంది. వర్డ్ ప్రెస్ లో లేదండీ.
బ్లాగ్ స్పాట్ లో అయితే సాయం చేయగలనేమో! ఒకవేళ - మీకు అలా వర్డ్ ప్రెస్ లో చెయ్యాలో చెప్పాలంటే - నేను వర్డ్ ప్రెస్ లో అకౌంట్ ఓపెన్ చేసి, మీరడిగినవి ఎలా చెయ్యాలో తెలుసుకొని, చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీకు సహాయం చెయ్యలేకున్నాను. మన్నించండి.

Related Posts with Thumbnails