ఆన్లైన్లో మీ పరిచయస్తులు వారి పర్సనల్ వివరాలు వివరాలు కాకుండా, మామూలు వివరాలు కూడా చెప్పకుండా స్నేహం చేసేవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువంటివారు ఎంతసేపూ వారి ఆనందాన్ని వెదుక్కొని, ఆనందాన్ని పొందుతుంటారే గానీ, ఎదుటివారిని గోరింటాకులా వాడుకొనే అవకాశాలు మెండు. కాని ఇలాంటివారికే ఆన్లైన్ స్నేహాలలో పిచ్చ క్రేజు.
ఆన్లైన్ కి వచ్చేసి, మనకి విజిబిలిటీ లో ఉన్నప్పుడు మనం పలకరించినప్పుడు పలకక, బీజీగా ఉన్నట్లు పోజులు కొట్టేవారికి దూరముగా ఉండటం మేలు. ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే - అలా పలకరించినప్పుడు "కొద్దిగా బీజీ గా ఉన్నాను, ఫైవ్ మినట్స్ ప్లీజ్.." అని చెప్పోచ్చును కదా.. అలా చెబితే కాస్త మర్యాదగా కూడా ఉంటుందిగా. మీరూ మనో వాక్యులత చెందరు. ఇలా చెప్పనివారు మళ్ళీ పలకరించినప్పుడు కాస్త దూరముగా ఉండటమే మీకు మంచిది.
ఒకవేళ చాట్ చేస్తున్నప్పుడు వెంటవెంటనే ఏమీ మాట్లాడక, ఇంకా చాట్ లోనే మనల్ని నిలబెట్టి, మన అమూల్యమైన సమయం వృధా చేసినవారిని మన్నించకండి. మధ్యలో పవర్ పోయి ఉండొచ్చును. అలాంటి పరిస్థితుల్లో మీరు రెండు నిమిషాలు ఎదురుచూడండి. ఆ తరవాత ఏమీ అటునుండి రాలేదు అనుకోండి. ఇక సింపుల్ గా బై - హావ్ ఎ నైస్ డే అని చెప్పేసి ఆ చాట్ క్లోజ్ చెయ్యండి. ఆ తరవాత వారి నుండి ఏమీ రాకపోతే ఇక వారికి దూరముగా ఉండండి. వారికి స్నేహితులతో ఎలా వ్యవహరించాలో తెలీదు అన్నమాట.
నిజాయితీగా, నమ్మకముగా... ఉండేవారితోనే మీ స్నేహాన్ని, మీ భావాలనీ, వ్యక్తిగత విషయాలనీ, ఫొటోస్ షేర్ చేసుకోండి. మిగిలిన వారితో హలో అంటే హలోగా, పోలో అంటే పోలో గా, పరిచయస్థులుగా ఉండండి. వారు స్నేహపరముగా దగ్గర అవటానికి ఒక అడుగు ముందుకు వేస్తే, మీరూ మరో అడుగు ముందుకు వెయ్యండి. అంతేకానీ అన్నీ స్నేహాలుగా ఫీల్ అవకండి. ముందే చెప్పాను మరియు మరీ మరీ గుర్తు పెట్టుకోండి.. - పరిచయాలు వేరు, స్నేహాలు వేరు. రెండూ ఒకటే అని అనుకుంటేనే మీకు చిక్కులు మొదలవుతాయి. ఇలా జాగ్రత్తగా ఉండటం తప్పేమీ కాదు. ఈరోజుల్లో మరీ అవసరముగా మారింది అని నా భావన. నేనూ ఈ మధ్య అలాగే ఉండటం నేర్చుకున్నాను.
మీరు వ్రాసిన మెయిల్స్, స్క్రాపులకీ తగు రిప్లై రానప్పుడు తగినన్ని సార్లు చూసి ఇక దూరముగా ఉండండి. నేను అయితే ఐదు (5) స్క్రాపుల వరకూ చూస్తాను. వాటిలో మధ్య తగిన సమయం ఇస్తాను. అప్పటికీ రిప్లై రాకుంటే ఇక వారు నాతో మాట్లాడడానికి ఇష్టం లేదేమో అని, వారికి దూరముగా ఉంటాను. అంటే స్నేహము నుండి పరిచయము గా మారుతాను. అలా దూరం జరిగి, ఇక ఒక్కొక్కటిగా దూరము చేస్తూ, చివరికి దూరం అవుతాను. చివరికి వారిని నా లిస్టు నుండి తీసేస్తాను. ఇగ్నోర్ కూడా పెట్టేస్తాను. ఇక నాకు ఎన్నడూ స్నేహితులు కాలేరు.
ఒకనితో దూరమయ్యాను. అతనిది నిన్న (30) పుట్టినరోజు. నాకు SMS చేశాడు.. ఈరోజు నా పుట్టినరోజున మీ నుండి ఆశీస్శులు కావాలి అని - సారాంశం. మొదట్లో SMS గ్రీటింగ్స్ రిప్లై చేద్దామని అనుకున్నాను. ఎందుకో అలా చెయ్యటం బాగా అనిపించలేదు. కాల్ చేసి మాట్లాడుదాం అనుకొని, అది ఇంకా మా ఇద్దరినీ ఇదివరకట్లా కలుపుతుంది అని భావించి అలా కాల్ చేశాను.. పాతవి అన్నీ.. మరచి మాట్లాడాను. అతని పుట్టినరోజున ఎందుకు అలా లోపం చెయ్యాలని.. బాగా మాట్లాడాను. తను హ్యాపీ. అలా మన నుండి చిన్న విషెష్ ఆశించిన వారికీ చెప్పటం (మాజీ) స్నేహితుని బాధ్యతే కదా.. అతనేమీ మణులూ, మాణిక్యాలు అడగలేదుగా.. జస్ట్ విషెష్.. అంతే!.