Wednesday, August 31, 2011

Social NW Sites - 38 - Post Scripts - 5

న్లైన్లో మీ పరిచయస్తులు వారి పర్సనల్ వివరాలు వివరాలు కాకుండా, మామూలు వివరాలు కూడా చెప్పకుండా స్నేహం చేసేవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువంటివారు ఎంతసేపూ వారి ఆనందాన్ని వెదుక్కొని, ఆనందాన్ని పొందుతుంటారే గానీ, ఎదుటివారిని గోరింటాకులా వాడుకొనే అవకాశాలు మెండు. కాని ఇలాంటివారికే ఆన్లైన్ స్నేహాలలో పిచ్చ క్రేజు.

న్లైన్ కి వచ్చేసి, మనకి విజిబిలిటీ లో ఉన్నప్పుడు మనం పలకరించినప్పుడు పలకక, బీజీగా ఉన్నట్లు పోజులు కొట్టేవారికి దూరముగా ఉండటం మేలు. ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే - అలా పలకరించినప్పుడు "కొద్దిగా బీజీ గా ఉన్నాను, ఫైవ్ మినట్స్ ప్లీజ్.." అని చెప్పోచ్చును కదా.. అలా చెబితే కాస్త మర్యాదగా కూడా ఉంటుందిగా. మీరూ మనో వాక్యులత చెందరు. ఇలా చెప్పనివారు మళ్ళీ పలకరించినప్పుడు కాస్త దూరముగా ఉండటమే మీకు మంచిది. 

కవేళ చాట్ చేస్తున్నప్పుడు వెంటవెంటనే ఏమీ మాట్లాడక, ఇంకా చాట్ లోనే మనల్ని నిలబెట్టి, మన అమూల్యమైన సమయం వృధా చేసినవారిని మన్నించకండి. మధ్యలో పవర్ పోయి ఉండొచ్చును. అలాంటి పరిస్థితుల్లో మీరు రెండు నిమిషాలు ఎదురుచూడండి. ఆ తరవాత ఏమీ అటునుండి రాలేదు అనుకోండి. ఇక సింపుల్ గా బై - హావ్ ఎ నైస్ డే అని చెప్పేసి ఆ చాట్ క్లోజ్ చెయ్యండి. ఆ తరవాత వారి నుండి ఏమీ రాకపోతే ఇక వారికి దూరముగా ఉండండి. వారికి స్నేహితులతో ఎలా వ్యవహరించాలో తెలీదు అన్నమాట. 

నిజాయితీగా, నమ్మకముగా... ఉండేవారితోనే మీ స్నేహాన్ని, మీ భావాలనీ, వ్యక్తిగత విషయాలనీ, ఫొటోస్ షేర్ చేసుకోండి. మిగిలిన వారితో హలో అంటే హలోగా, పోలో అంటే పోలో గా, పరిచయస్థులుగా ఉండండి. వారు స్నేహపరముగా దగ్గర అవటానికి ఒక అడుగు ముందుకు వేస్తే, మీరూ మరో అడుగు ముందుకు వెయ్యండి. అంతేకానీ అన్నీ స్నేహాలుగా ఫీల్ అవకండి. ముందే చెప్పాను మరియు మరీ మరీ గుర్తు పెట్టుకోండి.. - పరిచయాలు వేరు, స్నేహాలు వేరు. రెండూ ఒకటే అని అనుకుంటేనే మీకు చిక్కులు మొదలవుతాయి. ఇలా జాగ్రత్తగా ఉండటం తప్పేమీ కాదు. ఈరోజుల్లో మరీ అవసరముగా మారింది అని నా భావన. నేనూ ఈ మధ్య అలాగే ఉండటం నేర్చుకున్నాను.

మీరు వ్రాసిన మెయిల్స్, స్క్రాపులకీ తగు రిప్లై రానప్పుడు తగినన్ని సార్లు చూసి ఇక దూరముగా ఉండండి. నేను అయితే ఐదు (5) స్క్రాపుల వరకూ చూస్తాను. వాటిలో మధ్య తగిన సమయం ఇస్తాను. అప్పటికీ రిప్లై రాకుంటే ఇక వారు నాతో మాట్లాడడానికి ఇష్టం లేదేమో అని, వారికి దూరముగా ఉంటాను. అంటే స్నేహము నుండి పరిచయము గా మారుతాను. అలా దూరం జరిగి, ఇక ఒక్కొక్కటిగా దూరము చేస్తూ, చివరికి దూరం అవుతాను. చివరికి వారిని నా లిస్టు నుండి తీసేస్తాను. ఇగ్నోర్ కూడా పెట్టేస్తాను. ఇక నాకు ఎన్నడూ స్నేహితులు కాలేరు.

కనితో దూరమయ్యాను. అతనిది నిన్న (30) పుట్టినరోజు. నాకు SMS చేశాడు.. ఈరోజు నా పుట్టినరోజున మీ నుండి ఆశీస్శులు కావాలి అని - సారాంశం. మొదట్లో SMS గ్రీటింగ్స్ రిప్లై చేద్దామని అనుకున్నాను. ఎందుకో అలా చెయ్యటం బాగా అనిపించలేదు. కాల్ చేసి మాట్లాడుదాం అనుకొని, అది ఇంకా మా ఇద్దరినీ ఇదివరకట్లా కలుపుతుంది అని భావించి అలా కాల్ చేశాను.. పాతవి అన్నీ.. మరచి మాట్లాడాను. అతని పుట్టినరోజున ఎందుకు అలా లోపం చెయ్యాలని.. బాగా మాట్లాడాను. తను హ్యాపీ. అలా మన నుండి చిన్న విషెష్ ఆశించిన వారికీ చెప్పటం (మాజీ) స్నేహితుని బాధ్యతే కదా.. అతనేమీ మణులూ, మాణిక్యాలు అడగలేదుగా.. జస్ట్ విషెష్.. అంతే!.

Tuesday, August 30, 2011

Social NW Sites - 37 - Post Scripts - 4

పొరబాట్లు మానవ సహజం.. అంతే కాని చిన్న చిన్నపోరబాట్లకి దూరం చేసుకోవటం అంత మంచిది కాదు. క్రొత్తగా ఆడ్ అయిన వారి విషయములో అయితే కాస్త ఓకే అనుకోవచ్చును. అప్పటికి పరిచయం లెవల్లో ఉంటుంది కాబట్టి ఏమీ ఇబ్బందిగా ఉండదు. కాని పాత / చాలా కాలముగా సాగి స్నేహముగా మారినప్పుడు - అలా చేస్తే చాలా బాధగా ఉంటుంది. అది మీకే కాదు. అవతలివారికీ అలాగే ఉంటుంది. రేప్రోద్దున తను దూరం అయినా ఒక మంచి రీజన్ అంటూ ఉండాలి.

మీకేదైనా ఇబ్బందిగా అవతలి వారి ప్రవర్తన ఉన్నదే అనుకోండి. వారికే చెప్పండి ఇలా మీ అనడం నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. దయచేసి మళ్ళీ అనకండి అనీ.. బహుశా ఇక మీకు అలాంటి ఇబ్బంది రాకపోవచ్చును. ఒక చిన్న మాట (క్షమించండి అనే మాట ) మనల్ని చాలా ఇబ్బందుల్లోంచి బయటకి లాగుతుంది. అదే ఒక చిన్న మాట బాగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కనుక ఎలా వ్యవహరించాలో కాస్త రోజురోజుకీ నేర్చుకుంటూ ఉండండి.

పొరబాట్లు తెలిసో, తెలీకో అందరూ చేస్తారు. దాన్నే హైలెట్ చేసి చూస్తే - అంతా అదే కనిపిస్తుంది. స్నేహం అన్నప్పుడు అవన్నీ మరచిపోవాలి. కొన్నిసార్లు మరచిపోలేక పోవచ్చును. కానీ అవతలివారు సారీ చెప్పాక కూడా ఇంకా మనం అలాగే మన కోపాన్ని కొనసాగించటం అంత మంచిది కాదు. ఈ కోపాలు క్షణికం. వెంటనే సర్దుక పోవటం మరీ మంచిది. నిజానికి స్నేహం అంటేనే అదే కదా.. కావాలంటే - మీరొకసారి "హ్యాపీడేస్" సినిమా మరొకసారి చూడండి. అందులో రాజేష్ స్టాలిన్ తో "ఆ శంకర్ ని నమ్మకురా.. వాడు ఏదో ఒక రోజు నిన్ను మోసం చేస్తాడు.." అంటాడు. తనని మోసం చేస్తున్నాడు అని ఆ స్టాలిన్ కి తెలిసినా "ఎంతైనా మన ఫ్రెండ్ యే కదరా.." అని అంటాడు. అదీ స్నేహం అంటే. ఇక్కడ చెప్పే పాయింట్ ఏమిటంటే - మనసారా మన్నించటం - అదే స్నేహ ధర్మం. అంతే!.

దైనా పొరా పొచ్చాలు వస్తే అప్పుడే తేల్చేసుకోవాలి. కాని ఎప్పటి విషయమో, ఎప్పుడో అడిగితే అది బాగనిపించుకోదు. సంఘటన జరిగిన క్రొత్తల్లోనే అలా చెయ్యటం మంచిది. దాన్ని అలా సాగదీయటం అంత మంచిది కాదు. ఏదైనా సందేహం వస్తే, అప్పుడే అడగాలి. కాని ఆ తరవాత అడిగితే - ఈ ప్రశ్నని, ఆరోజే ఆ టాపిక్ వచ్చినప్పుడు అడిగితే అయిపోయేదిగా, ఇన్నిరోజుల తరవాత అడగటం ఏమిటీ? అప్పుడే ఎందుకు అడగలేదు? అంటే ఇంతకాలానికి ఆ ప్రశ్న వచ్చిందంటే ఈ మధ్యనే ఏమో జరిగింది అన్నమాట.. అని అవతలివారు అంటే ఏమీ చెయ్యలేకపోతాం.

లాంటి విషయం ఒకటి చెబుతాను. నేను ఒకతన్ని ఆడ్ చేసుకున్నాను. కొద్దిరోజుల తరవాత అతని పద్దతి నచ్చక రిమూవ్ చేశాను. ఎందుకు అలా చేశానో కూడా చెప్పి, అలా చేశాను. అయినా అతను మారలేదు. చాలా నెలల తర్వాత నన్ను అడిగాడు. నేను అప్పటికే అంతా మరిచాను. అయినా గుర్తుచేసుకొని చెప్పాను. ఇప్పుడు ఆడ్ చేసుకోమని అన్నాడు. ఇంకా మారలేదు మీరు కూల్ గా అన్నాను. దానికి ఆవేశముగా - చాలా చెడ్డగా - మీకు ఆడవారు అంటే ఇష్టం.. వారికే రిక్వెస్ట్ పెడతారు.. వారితోనే మాట్లాడుతారు.. వారితోనే షేర్ చేస్తారు.. అంటూ చాలానే అన్నాడు. అయినా కూల్ గా సమాధానం ఇచ్చాను. అప్పుడు అతను చెప్పింది నిజమా కాదా అని చూశాను. అదేమీ లేదు. నా ప్రొఫైల్ లో 32 % మహిళలు. (అలా అన్నాకే తొలిసారిగా లెక్కపెట్టాను.) ఇలా ఏవేవో మాట్లాడుతారు కొందరు.. కాని అవి నిజాలయితేనే ఏమైనా ఫీల్ అవండి. లేదా వారినీ, వారి కామెంట్స్ నీ మరచిపోయి హాయిగా ఉండండి. మనం బాగుంటే - ఇలా ఊహించని మాటలు కూడా పడాల్సి ఉంటుంది. ఎప్పుడూ పూలే కాదు, ఒక్కోసారి రాళ్ళూ పడతాయి. అయినా తట్టుకోక తప్పదు. అదేకదా జీవితం.  మీరు మాత్రం - ఇక వారితో వాదం పెట్టుకోకుండా ఉండండి. వారు కూడా - వారు ఆ విషయములో కరెక్ట్ గా ఉండి, ఇంకొకరిని అంటే మరీ బాగుంటుంది.

తని టాపిక్ చెప్పానుగా.. ఈ టాపిక్ వ్రాస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఒకతని ప్రొఫైల్ లో అయితే అంతా మహిళలే (60 కి పైగా), ఒక్క మగవాడూ లేరు అందులో, నాకు ఆడ్ రిక్వెస్ట్ వస్తే ఎవరాని చూశాను. ఆ రిక్వెస్ట్ ని ఒప్పుకొని ఉంటే ఆ ప్రొఫైల్ లోకి చేరే మొట్ట మొదటి మొగవాడిని నేనే అయ్యుండేవాడిని. హ ఆహా హ్హా.. కాని డిటైల్స్ లేవు కాబట్టి ఒప్పుకో బుద్ధి కాకుండా, రిజెక్ట్ చేశాను. ఈ ప్రొఫైల్ ఆ అబ్బాయికి కనిపించి, ఏమైనా అడగాలని అనుకుంటే ఏమని అంటాడో ఇక.. హ అహహా  (ఇలాంటి ఆసక్తికర విషయాలూ ఉన్నాయి. అయినా ఎవరిష్టాలు వారివి.)

క్కడ ఎవరు ఎవరికీ నీతులు చెప్పరు. "..ఇలా మీకు సమస్య రావచ్చును.. మీరు అలా చేస్తే గొడవల్లోకి వెళ్ళిపోవచ్చును.. ఆ ప్రొఫైల్ వారితో ఇలా ఉండకండీ.." అని కూడా చెప్పరు.. అన్నీ మీరంతట మీరుగా నేర్చుకోవాల్సిందే! అలాని నేర్చుకోవటములో సమయాన్ని వృధా చెయ్యకండి. అయినా అలాని చెప్పగానే వెంటనే నమ్మేయకండి. అన్నీ నిజాలు కాకపోవచ్చును. అవతలివారికీ బలమైన కారణాలు, ఆధారాలు ఉండొచ్చును. అందుకే ఒకరి మాటలు విని ఎన్నడూ ఒక నిర్ణయానికి రాకండి. అలా వచ్చేసి దూరం కాకండీ..

(సశేషం...)

Monday, August 29, 2011

Social NW Sites - 36 - Post Scripts - 3

సోషల్ సైట్ స్నేహాలు నిజానికి అందమైన ఊబి. మనసుకి నచ్చని మిత్రులు ఉన్నప్పుడు - అంతా బోర్ గా ఉంటుంది. "ఈ సైట్ బాగాలేదు.. ఆ సైట్ బాగుంది. ఫలానా దాంట్లో బాగున్నారు.. ఆ సైట్ కి బాగా పేరు ఉంది. అందులో అకౌంట్ లేకుంటే జన్మే వృధా.." అనే మాటలు వస్తాయి. నిజానికి ఎక్కడైనా ఒక్కటే! ఈ గదిలో కాకుంటే ఆ గదిలో మాట్లాడుకోవటం అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ మాట్లాడేవారే అక్కడ ఉంటారు. దానికోసం అనీ, వారు ఎక్కడ ఉన్నారో అని చూడటానికి ఆయా సైట్ లలోకి లాగిన్ అవ్వాలి.  సమయం వృధా..

న్ను ఒకరు ఎప్పుడూ ఆన్ లైన్లో కనిపిస్తావు అని బాగా అనేవాడు. నేను చెప్పాను - నేను ఒకటే సైట్లో ఉన్నాను అనీ. తను మాత్రం అలాని కాదు. అతను మాత్రం ఆరు సైట్లలో సభ్యుడు. అతను ఆక్టివ్ గా ఉండేది ఫేస్ బుక్. (తన సిస్టం లో ఫేస్ బుక్ తప్పనిసరిగా అడ్రెస్స్ బార్ లో ఉన్నది.) ఆఖరికి మొన్న మొన్న ఓపెన్ అయ్యిన గూగుల్ + సోషల్ సైట్ లో కూడా సభ్యుడే!.. ఓకే.. అది వారి ఇష్టం. కాదనను. నేను బాగా కనిపిస్తున్నాను అంటే తనూ బాగానే వస్తున్నాడనే కదా.. ఫలానా షాపింగ్ మాల్లో నీవు బాగా కనిపిస్తున్నావూ అంటే - తనూ అక్కడికి వస్తేనేగా - మనల్ని చూసి అలా అనేది. ఇదే మాట అన్నాను.. ఇక ఆ టాపిక్ బంద్.

క్కువ సైట్లలోకి లాగిన్ అయ్యామే అనుకోండి. కొన్ని స్నేహాల్ని మిస్ అవుతాము. జవాబు తొందరగా ఇచ్చే నేర్పు మీలో ఉంటే ఏమీ కాదు. కానీ, నెమ్మదిగా జవాబు ఇచ్చేవారిలా మీరు ఉన్నారే అనుకోండి. అప్పుడు కొందరిని దూరం అవుతారు. నా నేస్తం ఒకరు అలాగే మూడు నాలుగు సైట్స్ లలో ఉండి, రోజుకొక సైట్ కి లాగిన్ జవాబు చెప్పేవారు. ఏదైనా అడిగితే నాలుగురోజులకి గానీ జవాబు రాదు. విసుగొచ్చి, మానేశాను. తనకి వ్రాసినా, గత ఆరు నెలల నుండీ ఏమీ రిప్లైస్ రాలేదు. ఇక తనని రిమూవ్ చెయ్యటమే మిగిలుంది ఇక. ఇలాంటివి కూడా అవుతుంటాయి. 

స్నేహాల్ని కాపాడుకోవటం ఒక గొప్ప కళ. నిస్వార్థముగా, స్నేహాలు చేసేవారు ఇలా బాగా ప్రయత్నిస్తారు. అవతలివారి నుండి ఏదో లాభం పొందాలని చూసేవారు - వీరు నాకు ఉంటే ఏమిటీ? లేకుంటే ఏమిటీ? నేను వీరిదగ్గరి నుండి కొంత పొందానుగా అది చాలు అనుకునే సెల్ఫిష్ వాళ్ళు. ఇలాంటివారిని కాస్త అనుభవం మీద ఈజీగా గుర్తుపట్టొచ్చును. ఒకరకముగా పోలికతో చెప్పాలి అంటే - స్నేహాల్ని గోరింటాకుతో పోల్చవచ్చును. చేతికి పెట్టేసుకొని, ఎర్రగా అయ్యేవరకూ ఎంతో ప్రేమగా, బాగా కన్సర్న్ చూపి, ఉంచుకొని, ఆ తరవాత నిర్దాక్షిణ్యంగా పారేసే వాళ్ళు అనుకోవచ్చును. ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా ఉండండి. 

పైన చెప్పినదానికి ఒక ఉదాహరణ చెబుతాను. ఒక అబ్బాయి ఆడ్ అయ్యాక మాటలు కాని, రిప్లైస్ కానీ ఏమీ లేవు. ఏదో కమ్యూనిటీలో సభ్యుడు. అందులో ఒక తేదీ గడువు లోగా, ఎవరికీ ఎక్కువ వోట్లు వస్తాయో చూడటానికి, అదొక నోబెల్ ప్రైజ్ సాధించినట్లు ఫీల్ అవుతున్నారు. ఎవరికీ వారికి ఎక్కువ వోట్లు పడటానికి అందరికీ ఆడ్ రిక్వెస్ట్ పెట్టి, ఆడ్ అయ్యాక, మెల్లిగా మనల్ని ఆ కమ్యూనిటీలో జాయిన్ అయ్యేదాకా బాగా మాట్లాడుతారు. ఆ తరవాత మాటలు కరువవుతాయి.. ఆతరవాత ఏదైనా వోటింగ్ ఉంటేనే - "హాయ్.." అని పలకరింపులు.. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక ఇలా ఈ లింక్ లోకి వెళ్లి నాకు వోట్ చెయ్యండి అని పలకరింపులు. మనం ఓకే అన్నాక వెంటనే అంతే.. "మనం మళ్ళీ కలుద్దాం.." అని జంప్ జిలానీ. ఒక నెలలో మూడు నాలుగు ఇవే!.. చూసి చూసి అతన్ని రిమూవ్ చేసి, ఇగ్నోర్ చేశాను. తన లాభం కోసమే నన్ను వాడుకుంటున్నాడు అని అర్థం వచ్చేలా ప్రవర్తించాడు. 

న చిన్న చిన్న పొరబాట్లు ఎత్తి చూపినప్పుడు కోపంకి గురికాకుండా ఆ తప్పు ఉంటే సరి దిద్దుకోండి. ఇదే బ్లాగ్ లో నేను ఒకసారి వెళదాము అనే బదులు వెడతాము అని వ్రాశాను. నాకు అలాగే అలవాటు. ప్రసాద్ గారు కామెంట్ వ్రాశారు.. "వెడదాము కాదండీ.. వెళదాము" అనీ.. నేను ఆ పదం వ్రాసినప్పుడల్లా తనే గుర్తుకు వస్తారు.. బుద్ధిగా "వెళదాము" అని వ్రాసి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని హమ్మయ్య అని అనుకుంటాను. అలాని వారి మీద ఏదో కోపం చెందలేదు. ఇలా చాలామంది చెబుతారు. నచ్చితే పాటించండి. లేకుంటే విని ఊరుకోండి. మనం ఫీలయ్యి ఏదో అంటే - మనకి మంచి చెప్పేవారు దొరకక పోవచ్చును.

(సశేషం..)

Sunday, August 28, 2011

Google chrome Updates

గూగుల్ క్రోం ఇంటర్నెట్ బ్రౌజర్ ని మీరు వాడుతున్నారా?.. ఆ బ్రౌజర్ లోని అప్డేట్స్ ఎలా చేసుకోవాలో మీకు తెలుసునా..  ఒకవేళ తెలీయకుంటే - ఇలా చేసి చూడండి.

ముందుగా ఆ బ్రౌజర్ ని ఓపెన్ చేసి, కుడివైపున ఉన్న రెంచీ / సెట్ పానా ఆకారములో ఉన్న గుర్తు 1 మీద నొక్కండి. అప్పుడు వచ్చిన మెనూలో, 2 వద్ద నున్న About Google Chrome ని నొక్కండి.


అప్పుడు ఇలా క్రింది దానిలా వచ్చిన దాంట్లో, OK మీద నొక్కండి. అప్పుడు మీకు అప్డేట్ అయినట్లుగా వస్తుంది. 


Friday, August 26, 2011

Social NW Sites - 35 - Post Scripts - 2

సోషల్ సైట్లలో మీకు మీరుగా బ్రాండింగ్ పేరు తెచ్చుకోవాలి. ఎవరిదో సినిమా నటుల ఫొటోస్ పెట్టుకొని మీరు పాపులారిటీ సాధిస్తే దానివల్ల మీకు వచ్చేదేమీ ఉండదు. ఆ సినీ నటుల వారికి జీతం లేని పనివారుగా పనిచెయ్యటం తప్పితే. అదే సమయములో మీరు మీ ఫోటో పెట్టుకొని ఒక బ్రాండ్ గా ఎదగటం, మీకు కాస్తో, కూస్తో లాభముగా ఉంటుంది. మీరు మీకుగా ఈ లోకానికి మీరు పరిచయం చేసుకున్నవారుగా ఉంటారు.

మధ్య ఉద్యోగాలలో - మీకు ఏమైనా సోషల్ సైట్లలో అక్కౌంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అలాని ఎందుకు అంటే - మీలోని ప్రతిభ ఎలా ఉందో, ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవటానికి అలా అడుగుతున్నారు దానివల్ల మీలోని ఎదుటివారి మన్నన, వ్యవహరించే తీరు, మీ ఇష్టాలు, అయిష్టాలు.. మీరు కమ్యూనిటీలో ఎలా పాల్గొంటున్నారు, అక్కడ ఎలా చర్చ చేస్తున్నారు... ఇత్యాది వివరాల మీద కాస్త పరిశీలిస్తే మీ గురించి కాస్త చెప్పోచ్చును. మరీ ఎక్కువగా పాల్గొంటే - మీరు ఆఫీస్ సమయాల్లో అందులో ఉంటున్నారా? అనేది కూడా తెలిసిపోయి, మీకు సమయపాలన చెయ్యటం రాదనీ వారికి తెలిసిపోతుంది. ఇలా ఒకరి మీద ఉన్న ప్లస్సులూ, మైనస్సులూ తెలుసుకోవచ్చును. కనుక తస్మాత్ జాగ్రత్త. 

మీరు నాకు అలాంటి సైట్స్ ఏమీ లేవు అని అబద్ధాలు చెప్పినా, ఆ మేనేజ్మెంట్ గూగుల్ లో సర్చ్ చేస్తే - ఒకవేళ మీ ఖాతాలు ఉంటే అబద్ధం చెప్పేవారి క్రిందే జమ. ఎంత బాగా ఇంటర్వ్యూ చేసినా, చివరికి మీరో మోసకారు గా ఆ సంస్థ గుర్తిస్తుంది. మీ పేరు మీద సర్చ్ చెయ్యటం కేవలం ఐదు నిమిషాల పని. ఈ మధ్య అన్నీ ఆన్లైన్ కి వస్తున్నాయి. 

వరి మీదో ఏదో చెప్పారని, వాటిని అందరికీ ఫార్వర్డింగ్ చేసే అలవాటు మీకుంటే ఇక మానుకోవాలి. అందులో నిజానిజాలు ఏమిటో మీకు సరిగ్గా తెలీవు. మనకి తెలిసేదంతా అన్నీ నిజాలు కావచ్చును.. అబద్ధాలూ ఉండవచ్చును. ఇక్కడ ఎలాగూ మీ స్నేహితులే ఉంటారు. మీరు అలా ప్రచారం చేసినా, ఎవరలా చెప్పారు అని అసలువారు అడిగితే, అందరి చేతి వ్రేళ్ళూ మీవైపే చూపిస్తాయి. ఆ అసలు స్నేహితులతో ఇక స్నేహం అనేది - పెద్ద దెబ్బ. ఇక ఆ స్నేహం మునపటిలా ఉండేది కష్టం. 

రువురి కలహాల మధ్యకి పోవటం అంత మంచిది కాదు. ఎక్కడో ఏదో నోరుజారారు అంటే ఇక మీరు కోలుకోవటం కష్టం. ఆ ఇద్దరికీ మీ మీద సదభిప్రాయం ఉంది అంటే - ఓకే.. అప్పుడు జాగ్రత్తగా డీల్ చెయ్యండి. లేకుంటే మీ వల్ల కాదని చెప్పండి. ఇందులో సాధారణముగా ఇద్దరివీ తప్పులు ఉంటాయి. లేదా ఒకరివే తప్పులు ఉండొచ్చును. కాని వారు ఒప్పుకోరు. మధ్యే మార్గముగా రాజీ చేసే సత్తా మీలో ఉంటేనే ఇలాంటివి చెయ్యండి. లేకుంటే హాయిగా మీ పనిలో మీరు ఉండండి. లేకుంటే మీకు చుక్కలు కనిపిస్తాయి.. 

మీ మిత్రులు మీతో ఎలా ఉన్నారు..? ఇప్పుడు మీతో ఎలా ఉంటున్నారు..? అప్పటికీ ఇప్పటికీ గల తేడా ఏమిటీ.. ఇలా అప్పుడప్పుడు అంచనాకి రండి. చిన్న చిన్న లోపాలు కనిపించినా మామూలుగానే ఉండండి. ఆ లోపాలని విశ్లేషించండి. అప్పుడు మీకు ముందు ముందు ఏదైనా ఉపద్రవం వస్తుందో లేదో మీకు కాస్త ముందుగానే తెలిసిపోతుంది. ఉదాహరణకి : ఒకప్పుడు మీతో బాగున్నవారు, ఇప్పుడు సరిగా లేరు అంటే - అందుకు గల కారణాలు ఏమిటో విశ్లేషించుకోండి. అలా ఎప్పటి నుండి జరిగిందో, అలా ఎందుకు, ఏమిటి కారణాలు.. చాలా నిజాయితీగా ప్రశ్నించుకోండి. అలా చేశాక మీది ఏదైనా తప్పు ఉంటే - ఆ అవతలి బాధితులకి ఆ విషయం చెప్పండి. లేదా కారణం అడగండి. ...ఇక అలాంటి పొరబాట్లు చెయ్యకండి. ఉదాహరణకి : నా మిత్రుడు ఒకరికి గుడ్ మార్నింగ్ విషెష్ చెప్పటం ఇష్టం ఉండదు. అలాని మా మధ్య గ్యాప్ వస్తే - ఒకసారి తనతో మాట్లాడాను. కారణం చెప్పాడు. మన్నించమని చెప్పి, ఇక అతగాడికి అప్పటి నుండి విషెష్ చెప్పటం మానుకున్నాను. అతనికి ఇష్టం లేనప్పుడు మానుకోవటమే మంచిది. అప్పటి నుండీ మా మధ్య స్నేహం మునపటిలా ఉండిపోయింది.  

మీకు నిజాయితీగా చేసే స్నేహితులు దొరికితే వారిని వదులుకోకండీ.. వారిలో లోపాలు కనిపిస్తే పట్టీపట్టనట్లు, చూసీ చూడనట్లు ఉండి పొండి. వారు ఏమీ అనుకోనివారైతేనే - అవి ఏమిటో సున్నితముగా చెప్పి చూడండి. అప్పటికీ వారు తమదే సరియైనది అని అంటే - "అవునా!! కావచ్చును.. మీదే సరియైనది. ఎందుకో అలాని అనిపించింది, అడగాలనిపించింది అడిగాను.." అని ప్రక్కకి తప్పుకోండి. కాని - ఇక్కడ అవతలివారు చెప్పింది - ఒకసారిఆత్మ పరిశీలన చేసుకోండి. అలా వారు చెప్పింది నిజమేనా మీకు మీరే ప్రశ్నించుకోండి. 

కవేళ వారే మీద అలా విమర్శ చేస్తుంటే - సావధానముగా వినండి. ఊ కొట్టండి. వారు చెప్పేదేదో చెప్పనివ్వండి. మధ్య మధ్య మంచి ప్రశ్నలు వేసి, మీమీద ఏమి విమర్శలో - వాటిని రాబట్టుకోండి. ఎదుటివారిని ఆసాంతం చెప్పనివ్వండి. సమయం ఉంటే కాసేపు సమయం అడిగి రిఫ్రెష్ అవండి. అదయ్యాకే - రిఫ్రెష్ అయిన మీరు తీరుబాటుగా అది ఎంతవరకు నిజమో మనసాక్షిగా ప్రశ్నించుకోండి. వారు చెప్పిన కోణములో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వారు చెప్పినది నిజమే అయితే - సిగ్గుపడకుండా, లేనిపోని భేషజాలకి పోకుండా వారికి కృతజ్ఞతలు చెప్పి, మీలోని లోపాలని మార్చుకుంటాను అని చెప్పండి. అది మీద చాలా రెట్టింపు గౌరవాన్ని కలుగచేస్తుంది. ఒకవేళ వారు చెప్పినవి అప్పటికీ అబద్ధాలుగా అనిపిస్తే - వారిని ఏమీ అనకుండా నవ్వేసి ఊరుకోండి.

దాహరణకి నా మిత్రులు ఒకరి ప్రవర్తన కాస్త తేడాగా ఉంటుంది. అందరూ చాటుగా కాస్త వేరుగా అనుకున్నారు. కానీ వారి ప్రవర్తన చిన్నప్పటి నుండీ అంతే!. కాస్త కలివిడితనం ఎక్కువ. కాని ఇక్కడ అలాని అనుకోవటం లేదు. ఒకసారి.. ఒక విషయములో దెబ్బ తిని, అలా ఓదార్పుకోసం చాట్ కి వస్తే  ఆ విషయం స్మూత్ గా చెప్పాను... తనకి అర్థం అయింది. నామీద ఇలా ఇంత చెడ్డగా అనుకుంటున్నారా?.. మరీ ఇంత చండాలముగానా?.. అని అన్నారు. తరవాత థాంక్స్ చెప్పారు. మార్చుకుంటాను అని చెప్పి ప్రవర్తన మార్చుకున్నారు. అప్పటిదాకా అలా ఉన్న తను ఇప్పుడు హుందాగా ఉంటున్నారు. ఇలా ప్రతివారికీ మైనస్సులూ ఉంటాయి.. (అలా నా సూచన వల్ల మారినందుకు - నాకు మరింత గౌరవం ఇస్తున్నారు. తనపట్ల నాకూ గౌరవం పెరిగింది.) ఈవెన్ నాలో లోపాలు ఉన్నాయి. లేవని కాదు. కొందరు చెప్పారు.. ఇవీ ఇవీ అనీ. బాగున్నవన్నీ మార్చుకున్నాను. ఇంకోన్నింటిని మార్పుల్లో ఉన్నాను. కనుక మార్చేవి చెబితే మారండి. అది మీకే మంచిది. నాకూ ఇంతగా తెలిసిందని మీరు అనుకోవచ్చును గానీ, నాకూ ఇంకా చాలా విషయాలు తెలీవు. నాలోని లోపాలు చాలా ఉన్నాయి. నామీద విమర్శలు తెలుస్తున్న కొద్దీ నేనూ మారుతున్నాను. అలా మంచి విమర్శల నేను మారాలీ అని వారు అనుకుంటుంటే - నేనూ ఆలోచిస్తున్నాను. మారితే ఎలా ఉంటుంది, అలా చెయ్యటం మూలాన నాకెంత కలిసివస్తుంది అనీ..

స్నేహం అంటేనే కొంత ఇస్తూ, కొంత తీసుకోవటం.. అంతే కాని కొందరుంటారే! వాళ్లకి తీసుకోవటమే గాని, ఇవ్వటం రాని వారు. ఇలాంటివారు చాలామంది కనిపిస్తారు. ఇలాంటివారు మీ స్నేహితులు అయ్యారే అనుకోండి. మీనుండి వారు పొందటమే గానీ, వారి నుండి మీకు ఏమీ రాదు.. ఇది బిజినెస్ కాదు. అయినా స్నేహం అనేది ఇస్తూ, తీసుకునేదిలా ఉంటేనే చాలా బాగుంటుంది. అలాంటి స్నేహితులు తక్కువ దొరుకుతారు.. అలాంటివారితో స్నేహముగా ఉంటే ఈ ఆన్ లైన్ స్నేహాలు బోర్ కొట్టవు. లేకుంటే మీకు సమయం వృధా, డబ్బూ వృధా..


(సశేషం) 

Thursday, August 25, 2011

Srishailam Photos

శ్రీశైలం ఫొటోస్ 

శ్రీ శైలం డ్యాం.

శ్రీ శైలం డ్యాం గట్టు 


శ్రీ శైలం డ్యాం విద్యుత్ కేంద్రము.


శ్రీ శైలం కి వెళ్ళే ముందు కనిపించే గుట్ట. 


శ్రీ శైలం కి వెళ్ళే ముందు కనిపించే గుట్ట. 


శ్రీ శైలం కి వెళ్ళే ముందు కనిపించే గుట్ట. అవతలి గట్టు 


శ్రీ శైలం డ్యాం ముందు భాగం.


శ్రీ శైలం డ్యాం ముందు ఉండే రహదారి. 


శ్రీ శైలం డ్యాం ముందు ఉండే రహదారి. 


శ్రీ శైల దేవాలయం ముందు భాగం.


శ్రీ శైల దేవాలయం ముందు భాగం.


శ్రీ శైల దేవాలయం ముందు భాగం.


శ్రీ శైల దేవాలయం ముందు భాగం.


శ్రీ శైల దేవాలయం ముందు భాగం.


శ్రీ శైల దేవాలయం ముందు భాగం. చౌరాస్తా లో.


శ్రీ శైల దేవాలయం ముందు భాగం. చౌరాస్తాలో 


శ్రీ శైల దేవాలయం ముందు భాగం. మార్కెట్ 


శ్రీ శైల దేవాలయం ముందు భాగం. క్యాంటీన్. (భోజన శాల) 


శ్రీ శైల దేవాలయం ముందు భాగం. 


శ్రీ శైల దేవాలయం ముందు భాగం.


శ్రీ శైల దేవాలయం.. దూరము నుండి. 


Good Morning - 41


Wednesday, August 24, 2011

ఒకప్పటి టీవీ కలర్ ఫోటో

సాంకేతిక విప్లవం దినదిన ప్రవృద్ధి చెందుతుండగా, ఇటు ప్రజలకి ఒకప్పుడు విలాస వస్తువులు అనేవి - ఇప్పుడు కనీస అవసరాలుగా మారిపోయిన వేళ - ఒకప్పటి రోజులు చిత్రాతి చిత్రముగా తోస్తాయి. అదో మరపురాని అనుభవాలు ఇప్పటి కాలం వారికి నవ్వులాటగా అనిపిస్తుంది. అలాంటి ఒక ఉదాహరణ చెబుతాను. 

ఒకప్పుడు టీవీ అంటే చాలా గొప్ప. వేయి ఇండ్లు ఉన్న ఊర్లలో కూడా ఒకప్పుడు రెండు, మూడు టీవీల కన్నా ఎక్కువగా ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో ఆ టీవీనే తాకాలి అంటేనే - నాలుగైదు సార్లు రెక్కీ చేసి మరీ త్రాకేవారు. "నేను ఈరోజు టీవీ ముట్టుకున్నానురోయ్.." "నీ మొహం.. ఈరోజు టీవీ సిచ్చు ఒత్తి నేనే ఆన్ చేశాను తెలుసా.. నాదే గ్రేటు రా.." అని గొప్పగా చెప్పెరోజులవి. అప్పుడు అలా ఆ టీవీతో కలర్ ఫోటో తీసుకోవటం గొప్పగా ఉండేది.. అలాంటి ఒక ఫోటో చూడండి. 


హ హ్హా హ్హ.. అప్పుడు అప్పటివారు ఈ ఫోటో చూస్తే - సంభ్రముగా చూసేడివారు. ఇప్పటివారు నవ్వుకుంటారు. 

Tuesday, August 23, 2011

పరమత సహనం

పరమత సహనం అంటే - ఆ పదానికి గల అర్థం ఏమిటో వీరు తెలియచేస్తున్నారు. జన్మతా ముస్లిమ్స్ అయినా వారి అబ్బాయికి ఇలా శ్రీ కృష్ణ జయంతి న ఇలా వేషం వెయ్యటం నిజముగా - భారత దేశం వంటి లౌకిక రాజ్యానికి మాత్రమే  చెల్లు.. ఆ ముస్లిం దంపతుల విశాల భావాలకి నిదర్శనం. ఇది అహ్మదాబాద్ నగరములో జరిగినది. 


Thursday, August 18, 2011

చాముండేశ్వరి దేవాలయము.

ఈమధ్య చాముండేశ్వరి దేవాలయానికి వెళ్లాను. ఆ విశేషాలు మీకోసం చెబుతున్నాను. 

చాముండేశ్వరి  దేవాలయం - ఇది హైదరాబాద్ దగ్గరలోని మెదక్ జిల్లాలో పశ్చిమ దిశగా ఉంది. హైదరాబాద్ - నాందేడ్, అకోలా నేషనల్ హైవే మీద, జోగిపేట పట్టణానికి దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ నుండి తొమ్మిదో జాతీయ రహదారి అయిన ముంబై రహదారి మీదుగా వెళ్ళాలి. దాదాపు యాభై కిలోమీటర్లు వెళ్ళాక BHEL, పటాన్ చెరువు దాటి, సంగారెడ్డి వద్ద క్రాస్ తీసుకొని, సంగారెడ్డి మీదుగా నలభై కిలోమీటర్ల దూరములోని - జోగిపేట పట్టణం వస్తుంది. అది దాటాక ఐదు కిలోమీటర్ల దూరములో ఈ ఇంకా నిర్మితములోని ఈ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది.  మరింత రూట్ మ్యాప్ కోసం ఈ ఫోటో మీద క్లిక్ చేసి చూడండి. 


ఆకాశము ఆహ్లాదకరముగా ఉన్న ఈ శ్రావణ మాసం లో అలా బయలుదేరాను. దూదిపింజల్లాంటి ఆ మేఘాలని చూస్తే మనసులో అదోలాంటి అనుభూతి. 


దారిలో ఇలాంటి భారీ మర్రి ఊడలు ఉన్న చెట్లనీ, కళ్ళు పెద్దవిగా చేసుకొని చూస్తూ సాగిపోయాను. 


అలా సాగిన మా ప్రయాణం, దేవాలయానికి దగ్గరగా వచ్చేశాం. ఆ గుడికి దక్షిణ దిశలో ఉండి, పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న మంజీరానది మీద కట్టిన నూతన వంతెన మీదుగా మా ప్రయాణం సాగింది. 


ఇదిగో ఇలా ఆ వంతెన మీద నుండి చూస్తే - ఆ మంజీరానది ఇలా కనిపిస్తుంది. 






అలా వచ్చేశాక అల్లంత దూరములో చిన్నగా గుడి కనిపిస్తున్నదా !.. హా.. అక్కడికి వెళదాము.


అలా సాగాక గుడి వద్దకి వచ్చేశాం. రోడ్డు మీద నుండి ఇలా కనిపిస్తుంది. 



రోడ్డు దిగి లోని వెళ్ళాము.. ఎదురుగా పెద్దగా ఆలయము ఇలా కనిపిస్తుంది. 




ఆలయము ఎడమ ప్రక్క (పశ్చిమ భాగం) నుండి ఇలా కనిపిస్తుంది. 



ఆలయ వాయవ్య దిశ నుండి ఇలా కనిపిస్తుంది. 




ఆలయ వెనక భాగమున నుండి.. 


ఇక ఈశాన్య భాగము నుండి ఇలా కనిపిస్తుంది. 





గర్భగుడి బయటవైపు నుండి ఇలా ఉంటుంది. 


ఇక అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద (ఇంకా నిర్మానములోనే ఉంది) కాళ్ళు కడుక్కొని ఇక లోనికి వెళదామా? 


ఇక లోనికి వెళదాం. లోపలి నిర్మాణాలు చూడండి. దేవత ఫోటో తీయనీయలేదు. కాబట్టి అది చూపించలేక పోతున్నాను. లోపలి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అయినా పూర్తి అయితే ఎలా కనిపిస్తుందో మీకే తెలుస్తుంది. ఇందులో మీకు గర్భగుడీ కనిపిస్తుంది. 







మేము వెళ్ళినప్పుడు ఇంకా నిర్మాణం పని సాగుతున్నది ఇలా.. 


స్థంభాలకీ దీనితో అచ్చులు చేసి అతుకుతారు.


ఇది స్థంభాలకీ డిజైన్ కోసం వాడుతారు. 


పిల్లర్ కి డిజైన్ చేస్తున్నారు. 


ఆలయం వరండా ఇలా ఉంటుంది. 


స్తంభాల మీద నగిషీ పని చేస్తున్నారు. 


ఇదీ మా యాత్ర కి సంబంధించిన ఫొటోస్. ఇక అక్కడ ఇంకా ఏమీ దొరకవు. హోటల్స్ అంటే దగ్గరలోని ఐదారు కిలోమీటర్ల దూరం లోని జోగిపేట కి వచ్చి తినాలి. బస్ లో వస్తే - నాందేడ్ అకోలా హైవే మీద జోగిపేట వద్ద దిగి ఆటోల్లో పోవచ్చును.  

మరిన్ని ఫొటోస్ మీకోసం.. 20-సెప్టెంబర్-2011 న తీసినవి

ఇది చాముండేశ్వరి ఆలయం.. తుది మెరుగుల్లో ఉంది.


గుడి లోపల తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పుడు అవి చివరి దశల్లో ఉన్నాయి. ఇక క్రింద బండలు వేస్తే లోపలి పని ముగిసినట్లే!.


నిత్య పూజా కార్యక్రమాల పట్టిక.


ఇది అమ్మవారి రూపు. ఇక్కడ ఫొటోస్ తీయటం నిషేధం అని చెప్పానుగా.. అక్కడ ఆలయం వారు ఇలా అమ్మవారి ఫొటోస్ అమ్మటానికి అలా ఒక ఫోటో అక్కడ పెడితే, దాన్ని ఫోటో తీసి , మీకు చూపిస్తున్నాను. 



Related Posts with Thumbnails