ఆర్కుట్ అనే సోషల్ నెట్వర్క్ సైట్ ని మూసేశారని మీకు తెలిసిన విషయమే..అందులో కొన్ని బొమ్మలని వేశాను.. Ortist అనే అప్లికేషన్ తో, మౌస్ ని కదుపుతూ వాడుతూ బొమ్మలని గీసుకోవచ్చును. ఇలా వేసుకున్న వాటిని ప్లే ( Play ) చేస్తే - ఎలా వేశామో అలా ఒక వీడియోగా కనిపిస్తుంది. ఓహో! ఇలా వేశారు, అలా వేస్తే ఈ బొమ్మ వస్తుంది.. అని తెలుసుకొనేలా ఉంటుంది - ఈ పద్ధతి. అప్పట్లో ఇలా చాలానే చిత్రాలు వేశాను. క్రొత్తలో కాబట్టి ఇందులో బాగా మమేకమైపోయాను. అలాగీసుకున్న ఒక అసంపూర్తి చిత్రాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను.
ఆర్కుట్ లోని నా క్రియేషన్స్ కాలగర్భములో కలసిపోకుండా, ఇలా నా బ్లాగులో దాచుకొనే ఒక చిన్న ప్రయత్నం ఇది. ఇలా గీసుకున్న చిత్రాల్లో ఇదొక్కటే దాచుకున్నాను.. మరెన్నో చిత్రాలు అలా కాలగర్భములో కలసిపోయాయి.. ప్చ్!.
ఇలా గీసుకున్న ఇంకొన్ని చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిని ఇక పోస్ట్ చెయ్యలేను.. కారణం : ఆ సోషల్ సైట్ ని మూసేసారని ముందే మీకు తెలియచేశాను. వాటిని ఈ బ్లాగులో సేవ్ చేసుకోవటం మరిచాను. ఇలా కంప్యూటర్ మౌస్ వాడి గీసుకున్న చిత్రాలని అందరికీ చూపించుకోవటంలో ఆ తృప్తియే వేరు.. ఇప్పుడు ఆ అప్లికేషన్ మిగతావాటిల్లో ఉందో, లేదో నాకు అంతగా తెలీదు. నాకు మిగిలిన ఏకైక Ortist స్కెచ్ ఇదొక్కటే. ఈ క్రిందున్న వీడియోని ప్లే చెయ్యండి. ఎలా గీశానో మీకూ తెలుస్తుంది. క్రిందన కుడి మూలగా Speed అనే స్లైడ్ అడ్జస్ట్ బటన్ ఉంటుంది. దాన్ని ముందుకూ, వెనక్కి జరుపుకొని కావలసిన వేగములో ఆ వీడియోని చూడవచ్చును.
దీన్ని నేను 19 - ఫిబ్రవరి - 2009 న 5:55:34 A.M కి గీయటం పూర్తిచేసి, పోస్ట్ చేశాను. ఇప్పుడైతే మరింత బాగా గీసేవాడిని.. ఇది శివరాత్రికి నా మిత్రులకు - శుభాకాంక్షలు తెలియచెయ్యటానికి ఈ ప్రయత్నం చేశాను.. కానీ సమయం చిక్కకనో, మరే కారణం వల్లనో ఇంకా బాగా వెయ్యటానికి ప్రయత్నించలేకపోయా..
No comments:
Post a Comment