[తెలుగుబ్లాగు:22292] pasting problem typed matter in lekhini is not pasted on word document. what to do? కి నేనిచ్చిన సమాధానం :
( అక్కడ ఇచ్చిన సమాధానానికి కన్నా కాస్త వివరంగా ఇక్కడ చెబుతున్నాను. )
( అక్కడ ఇచ్చిన సమాధానానికి కన్నా కాస్త వివరంగా ఇక్కడ చెబుతున్నాను. )
ముందుగా మీరు లేఖిని సైట్ లోకి వెళ్ళి, తెరవండి. అందులో పైన గడిలో రోమన్ ఇంగ్లీష్ లో anTE ilA టైపింగ్ చేసుకోవాలి. అలా చేస్తూ ఉంటే డిఫాల్ట్ సెట్టింగ్ బట్టి వెనువెంటనే తెలుగులోకి మారుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఆ క్రిందన ఉన్న గడిలో వచ్చిన తెలుగు పదాలు - సరియైన పదాలు - అచ్చుతప్పులూ, భావం సరియైనవేనా నిర్ధారించుకోండి. అలా గమనిస్తూ టైపింగ్ చేస్తూ వెళ్ళండి.
అలా కొద్దికొద్దిగా టైప్ చేస్తూ కాపీ చేసుకుంటూ వెళ్ళండి. ఒక పేరా కాగానే దాన్ని మీ మౌస్ సహాయన క్రింద గడిలో ఉన్న తెలుగులోకి మారిన విషయాన్ని మార్కింగ్ చెయ్యండి. అలా చేసినప్పుడు ఆ విషయం అంతా నీలిరంగులోకి మారుతుంది. ( క్రింది ఫోటో చూడండి ). అప్పుడు మీ కీ బోర్డ్ న ఉన్న Control + C అనే రెండు మీటల్ని ఒకేసారి నొక్కితే ఆ విషయం అంతా కాపీ అవుతుంది.
ఇప్పుడు మీ సిస్టం న ఉన్న Microsoft వారి word pad తెరవండి. అందులో ఉన్న పేజీ మీద ఒకసారి మీ మౌస్ ని క్లిక్ చెయ్యండి. అలా చేశాక - ఇప్పుడు Control + V అనే రెండు మీటల సహాయాన ఒక్కసారిగా నొక్కితే ఆ కాపీ చేసిన విషయం అంతా అక్కడ పేస్ట్ అవుతుంది. ( క్రిందన ఉన్న ఫోటో చూడండి )
అపుడు ఆ వర్డ్ ప్యాడ్ ని సేవ్ చేసుకుంటే సరి. అంతే!
No comments:
Post a Comment