సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ Facebook లో మనకి ఎందరెందరో స్నేహితులు అవుతుంటారు. మనకి స్నేహితులు కావాలీ అంటే మన ఫేస్ బుక్ అకౌంట్ శుభ్రముగా, మంచి పోస్ట్స్ తో కూడి ఉండాలి. అప్పుడు మనతో స్నేహానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆ వివరాలు ఏమిటో తరవాత చెప్పుకుందాం.. అంతలోగా ఎవరైనా మనకి స్నేహితులు అవటానికి మాటిమాటికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ ( ఆ రిక్వెస్ట్ ని ఒప్పుకోక రిజెక్ట్ చేస్తే ) విసుగు తెప్పిస్తుంటారు. ఇక వారంతే అనుకొని చాలామంది వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఒప్పుకోవడమో, లేక అలాగే అట్టి పెట్టడం చెయ్యటమో చేస్తారు. వచ్చిన ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని అలాగే అట్టి పెట్టేస్తే - మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ పెట్టలేడు సరికదా - ఇంకో లాభం ఏమిటంటే మనకు ఒక ఫాలోవర్ దొరుకుతాడు. అలా చేస్తే ఆ ఫాలోవర్ లిస్టు పెరిగి - " అబ్బో వీరికి ఇంత ఫాలోయింగ్ ఉందా?.." అని ఈర్ష్యగా ఫీలవుతుంటాం..
ఒక్కోసారి వద్దనుకున్నవారు మాటి మాటికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే - వారిని బ్యాన్ BAN చెయ్యకుండా - వారి వద్దనుండి ఫ్రెండ్ రిక్వెస్ట్స్ వద్దనుకుంటే ఇలా చెయ్యండి.
వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని తీరుబాటుగా పరిశీలించండి. వారు ప్రొఫైల్ వివరాలు - వారి కవర్ ఫోటో క్రిందన ఉన్న - About అబౌట్ లో చూడండి. ఏమైనా వివరాలు ఉన్నాయా అనీ..
ఆ తరవాత వారి ఫ్రెండ్ లిస్టులో ఉన్నవారిని చూడండి. ( చెత్త ప్రొఫైల్స్, అశ్లీల దృశ్యాల ప్రొఫైల్ పిక్స్ గల తన మిత్రులు ఎవరైనా ఉన్నారేమో చూడండి. )
టైం లైన్ లోని పోస్ట్స్ ని గమనించండి. వాటి ఫ్రీక్వెంట్స్ Freequents, వాటిలోని సత్తానీ, ( వచ్చిన లైక్స్ ని పట్టించుకోకండి. అమ్మాయిల పోస్ట్స్ కి అవి ఎక్కువగానే ఉంటాయవి ) వాటికి వచ్చిన కామెంట్స్, ఆ కామెంట్స్ కి వారిచ్చిన రిప్లైస్ Replies ని గమనించండి.
వారి ఫోటో ఆల్బమ్స్ ని పరిశీలించండి.
చివరిగా వారు లైక్ చేసిన పేజెస్ Pages ని ఒకసారి సింహావలోకం చెయ్యండి. అందులో వారు చేసిన లైక్ చేసిన పేజెస్ - వారి ప్రస్తుత మనస్తత్వాన్ని చూపిస్తాయి.
అప్పుడు వద్దనుకున్న ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ వారు - ఇక వారి వద్ద నుండి మళ్ళీ రిక్వెస్ట్స్ రావొద్దు అనుకుంటే ఇలా ఈ క్రింది ఫోటోలో చూపినట్లు చెయ్యండి.
1. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఒప్పుకోకుండా Delete చెయ్యండి.
2. అప్పుడు ప్రొఫైల్ కవర్ ఫోటో మీద - రిక్వెస్ట్ రిమూవ్డ్ Request Removed అని కనిపిస్తుంది. దాని ప్రక్కనే మార్క్ ఆజ్ స్పాం Mark as spam అని వస్తుంది. మీరు దాన్ని గనుక నొక్కితే ( ఇక్కడ - If you tick 'Mark as Spam', this person will not be able to send you any more friend requests ) చాలు. వారింక మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పెట్టలేరు.
No comments:
Post a Comment