[తెలుగుబ్లా గు:22246] పాటలు టైపు చేసేటపుడు
చరణం తరువాత మళ్ళీ పాటని కొద్దిగా లైను చివరలో ఒక అక్షరం వ్రాసి అక్షరం మొదట్లో చివరన రెండు గీతలను అమర్చడానికి నాకు రావటం లేదు. దయచేసి తెలుపగలరు.
సినిమా పాటలు బ్లాగుల్లో గానీ, మరేచోట వ్రాస్తున్నప్పుడు - పల్లవి, చరణాల చివర మళ్ళీ పల్లవి మొదలవుతుంది. ఇలా మళ్ళీ పల్లవి మొదలవుతుంది అని సూచనగా వాటి చివరన - పల్లవిలోని మొదటి పదాన్ని - అక్కడ వ్రాస్తారు. దీన్ని తేలికగా గుర్తించేందుకై ఆ పద భాగాన్ని ఇటు రెండు, అటు రెండు - వంగిన గీతలు లేదా నిలువు గీతల చూపిస్తారు. అంటే అక్కడ ఆ పల్లవి మళ్ళీ మొదలవుతుంది అనే సూచనగా. ఈ గీతలు / లేదా | గా ఉంటాయి. ఉదాహరణకు : అత్తారింటికి దారేది సినిమాలోని పాట " నిను చూడగానే చిట్టి గుండె గట్టిగానే.. " అనే పాటనే ఉదాహరణగా తీసుకొంటే - చివరలో
// నిను చూడగానే //
|| నిను చూడగానే ||
అని వ్రాస్తారు. అలా చూడగానే మనకి ఓహో.. మళ్ళీ పల్లవి ఇక్కడ మొదలవుతుంది అని గ్రహించేస్తాం. మామూలుగా చేతి ద్వారా తేలికగానే వ్రాయవచ్చును. కానీ కంప్యూటర్లో టైపింగ్ చేసేటప్పుడు - మొదట్లో ఎలా వీటిని వ్రాస్తారు ? అన్న మీమాంస మొదలవుతుంది. నిజానికి ఇది చా__లా చిన్న సమస్య. కీ బోర్డులో ఏమేమి కీలు / సంజ్ఞలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలనగా చూస్తే అన్నీ తెలిసిపోతాయి.
కంప్యూటర్ కీ బోర్డులో ఈ గుర్తులను / | సూచించేందుకై ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. సాధారణముగా వీటిని కుడివైపున / కుడిచేతి వ్రేళ్ళ క్రిందకు వచ్చే కీలలో మీరు వీటిని తేలికగా గుర్తించవచ్చును. ఎలా అంటే - Enter కీ చుట్టూ ఈ మీటలను తేలికగా కనుగొనగలం. ఈ క్రింది ఫోటోలో మీరు గమనించవచ్చును.
చాలా కీ బోర్డుల్లో ఈ రెండు సంజ్ఞలు ఇతర సంజ్ఞలతో కలిసి ఉంటాయి. కీ అమరికలను బట్టి షిఫ్ట్ ( Shift ) కీ వాడి ఉపయోగించాల్సి ఉంటుంది.
1 గుర్తు వద్ద చూపించిన | సంజ్ఞని ఆంగ్లములో పైప్ ( Pipe ) అంటారు. ఇది నిలువు గీత ఆకారములో ఉంటుంది. దీన్ని కీ బోర్డ్ అమరికను బట్టి షిఫ్ట్ కీ వాడి, నొక్కాల్సి ఉంటుంది. ఇది చాలా కీ బోర్డుల్లో ఉండకపోవచ్చును. కారణం ఎక్కువగా ఉపయోగములో లేకపోవడం వల్లనేమో కావొచ్చును.
2 గుర్తు వద్ద చూపిన / సంజ్ఞని ఆంగ్లములో స్లాష్ ( Slash ) అంటారు. ఇది కాస్త వాలుగా ఉండే గీత. కుడివైపుకి వాలి ఉంటుంది. సాధారణముగా షిఫ్ట్ కీ వాడకుండానే నేరుగా వాడుకోవచ్చును. ఇది కీ బోర్డులో రెండు చోట్ల ఉంటుంది.
ఒకటేమో ఎంటర్ బటన్ వద్ద,
రెండోది : నంబర్ కీల వద్ద.
నంబర్ కీల వద్ద దీన్ని అంకెలను భాగించటానికి (Divide) ఎక్కువగా వాడుతుంటారు.
పై రెండింటినీ అలా వాడుకోవచ్చును.
1 comment:
తెలుగులో type చేసినప్పుడు మీకు pipe character చక్కగా మనకు కావలసినట్లుగా
॥ పల్లవి ॥
అని వ్రాసేందుకు సదుపాయం ఇస్తుంది.
Pramukh IME లో ఈ సదుపాయం ఉంది. ఇది Windows లో పనిచేస్తుంది తెలుగు typingకి.
Linux వాడేటప్పుడు కూడా ఇలా మనకు ॥ type చేయటం సదుపాయం ఉంది.
నేను ఈ రెండు విధానాలూ వాడుతున్నాను.
Post a Comment