Wednesday, July 6, 2016

[తెలుగుబ్లాగు:22161] బ్లాగ్ ని రిజిస్టర్ చేసుకోవాలా ?

[తెలుగుబ్లాగు:22161నమస్కారం సోదరులకు 

గూగుల్ బ్లాగ్ కు ఒక పేరు పెట్టినతరువాత దానిని రిజిస్టర్ చెయాల ? చేయకపోతే అట్టి బ్లాగ్ నేమ్ రిజిస్టర్ చెసిఉన్నదని ఎలా తెలుసుకోవాలి
ఎందుకంటే
మా స్నేహితుడు ఒక బ్లాగ్ కు తను ఒక పేరు పెట్టినవెంటనే బ్లాగ్ పేరు రిజిస్టర్ చేసియున్నాము పేరు తీసి వేయాలి మెయిల్ ఎవరో పంపారు
వేరొక పేరు నిర్ణయిస్తే దానికి  ఇలాగే జరుగుతుందేమో అని అనుమానం
అసలు బ్లాగ్ నేమ్ ఎలా రిజిస్టర్  చేస్తారు దయచేసి తెలుపగలరు - అనే ఈ 6-January-2014 న అడిగిన ప్రశ్నకి నా జవాబు ఇచ్చాను. ఆ సమాధానాన్ని కాస్త అభివృద్ధి / జత చేసి - ఇప్పుడు మీకోసం.. ( అలాగే నా ఈ బ్లాగ్ లో Blog tips లేబుల్ లో ఒక టపాగా చేరుస్తున్నాను )బ్లాగ్ ఓపెన్ చేశాక,దాన్ని రిజిస్టర్ చేసుకోవాలా : అవసరం లేదండీ.. బ్లాగ్ పేరు అనేది మీ ఇష్టం. మీరు యే పేరు అయిన పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఆ పేరు ఇంతకు ముందే వాడుకలోగానీ, ఎవరైనా ఆ పేరున బ్లాగ్ తెరచి ఉంచితే అపుడు మార్చుకోవాలి. ఇలా ఎందుకూ అంటే - భవిష్యత్తులో ఒకే పేరు మీద ఉన్న బ్లాగుల్లో ఏదైనా ప్రఖ్యాతి చెందినప్పుడు, ఆ బ్లాగ్ ని ఇతరులు చేరుకోవాలని చూసినప్పుడు సాంకేతిక సమస్యలు / కన్ప్యూజన్ ఏర్పడే ప్రమాదం ఉందని - యూనిక్ పేరుని ఎన్నిక చేసుకోమని సూచన బ్లాగర్ / వర్డ్ ప్రెస్ /.... వారి దగ్గర నుండి సూచన వస్తుంది. ఒక బ్లాగ్ పేరు గాంచినది అయితే, అలాంటి పేరుగల ( పోలిక ఉన్న ) బ్లాగ్ ఉన్నట్లయితే - ఆ బ్లాగ్ వీక్షకుల సంఖ్య బాగా ఉంటుంది. ఇలాంటివి బ్లాగుల్లో తక్కువే కానీ సైట్లలో చాలానే ఉన్నాయి. వారేమి చెయ్యకుండానే మన బ్లాగ్ ఖ్యాతి వల్ల వారి బ్లాగ్ కి వీక్షకులు పెరుగుతారు. తద్వారా వారు ఒక స్థాయికి చేరుకోగానే - గూగుల్ వారి ప్రకటన రూపములో ఆడ్ సెన్స్ వల్ల వారు ఆదాయం పొందుతారు. ఇలాంటి ఆదాయం మన తెలుగు భాష బ్లాగులకి అవకాశం లేదు. 

మీ బ్లాగ్ పేరుని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరము లేదు. బ్లాగ్ అనేది ఉచితముగా నిర్వహించుకోవచ్చు. మీరు ఏదైనా సైట్ ని అంతర్జాలములో నిర్వహించాలీ అనుకుంటే అప్పుడు ఆ సైట్ ని, కొంత డబ్బు కట్టి, మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ( ఉచితముగా కూడా మన పేరు మీద సైట్స్ నిర్వహించుకోవచ్చును.. అది వేరే విషయం ) 

చేయకపోతే అట్టి బ్లాగ్ నేమ్ రిజిస్టర్ చెసిఉన్నదని ఎలా తెలుసుకోవాలి : మీ బ్లాగ్ ని క్రియేట్ చేస్తున్నప్పుడే ఏమి పేరు ఉండాలో అడుగుతుంది. అప్పుడు మీరు టైప్ చేసిన పేరు ఇంతకు ముందే ఆ పేరుతో ఏదైనా బ్లాగ్ పేరు ఉంటే - ఆల్రెడీ ఆ పేరు వాడుకలో ఉంది - అని సూచన వస్తుంది. అప్పుడు ఇంకో పేరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా అభ్యంతర సూచన రానంతవరకూ మార్చి, సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఆ పేరు ఆ బ్లాగ్ వారు మీకు కేటాయించినట్లే ! 

మా స్నేహితుడు ఒక బ్లాగ్ కు తను ఒక పేరు పెట్టినవెంటనే బ్లాగ్ పేరు రిజిస్టర్ చేసియున్నాము పేరు తీసి వేయాలి మెయిల్ ఎవరో పంపారు అలా మెయిల్ పెట్టిన వారికి తిరిగి మెయిల్ పెట్టండి.. వారి బ్లాగ్ లింక్ ఇవ్వమని అడగండి. ఆ లింక్ ద్వారా ఆ బ్లాగ్ కి వెళ్ళి, మీ బ్లాగ్ పేరుతో పోల్చుకోండి. సరిపోతే మార్చుకోవాలో వద్దో, లేదా ఏదైనా మార్పు చెయ్యటమో మీరు మీకుగా ఆలోచించుకోండి. 

వేరొక పేరు నిర్ణయిస్తే దానికి  ఇలాగే జరుగుతుందేమో అని అనుమానం అన్నీ మీరే అనుమానించుకుంటూ ఉంటే అక్కడే ఆగిపోతారు. 

బ్లాగ్ పేరు వేరు, బ్లాగ్ అడ్రెస్ వేరు. క్రొత్తలో కొద్దిగా తికమకగా ఉన్నా, రెండూ వేరు వేరు. ( బ్లాగ్ విజిబిలిటీ ఆప్షన్ ని ఎన్నుకుంటే - ఈ రెండూ గూగుల్ సర్చ్ లో కనిపిస్తాయి ) మీకు మరింతగా అర్థం అవ్వాలీ అంటే - నా బ్లాగ్ పేరు My VALUABLE LESSONS అని ఉంటుంది. కానీ నా బ్లాగ్ అడ్రెస్ (URL) మాత్రం  www.achampetraj.blogspot.in గా ఉంటుంది. ఇలా అడ్రెస్, బ్లాగ్ పేరూ వేరు వేరుగా కూడా ఉండవచ్చును. బ్లాగ్ పేరు అనేది మీ బ్లాగ్ యొక్క పేరు.. అది మీ ఇష్టమైనది పెట్టుకోవచ్చును. కాకపోతే వేరేవారి బ్లాగ్ పేరులకి దగ్గరగా ఉంటే గందరగోళంగా ఉండి, ఆ తరవాత కొన్ని చిక్కులు ఏర్పడతాయి. అప్పుడు మీరే మార్చుకోవాల్సి వస్తే - అప్పటిదాకా ఆ బ్లాగ్ కి వచ్చిన ఆదరణాన్ని కోల్పోవాల్సివస్తుంది. అంటే బ్లాగ్ పేరు ని అందరిలోకి తీసుకెళ్లాలీ అంటే ఆ పేరుని పరిచయం చెయ్యటానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. 

బ్లాగ్ పేరుని ఎవరికైనా మెయిల్ చేస్తే / చెబితే - వారు ఆ పేరు మీదుగా నేరుగా ఆ బ్లాగ్ కి వెళ్ళలేరు. గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్ లలో టైపు చేసి, వచ్చిన వాటిల్లో ఈ బ్లాగ్ పేరుకి సరియైన లింక్ చూసి, తెరవాల్సి ఉంటుంది. కాస్త పేరున్న బ్లాగ్స్ కి దగ్గరగా ఒక అక్షరం తేడాతో చాలా సైట్స్ కనిపిస్తుంటాయి. వాటిల్లో వెదికి తెరవాల్సి ఉంటుంది. ఇలా పోలిక అబద్దపు సైట్స్ లేకుంటే ఆ పేరుతో ఆ సైట్ / బ్లాగ్ కి నేరుగా వెళ్ళొచ్చును. 

అదే లింక్ / URL ద్వారా అయితే ఆ లింక్ మెయిల్ చేసినప్పుడు - అది నీలిరంగులోకి మారి లింక్ గా పనిచేస్తుంది. దాన్ని పొందినవారు - దాన్ని క్లిక్ చేస్తే - ఆ సైట్ / బ్లాగ్ లాంటి ఎన్ని  పోలిక సైట్స్ ఉన్నా - ఎక్కడికైతే వెళ్లాలని లింక్ ఇచ్చామో అక్కడికే వెళ్ళుతారు. ఇదీ URL వల్ల లాభం. ఇది నిజమా కాదా తెలుసుకోవటానికి క్రింద మరియు పైన నా బ్లాగ్ లింక్ పెట్టాను. నొక్కి చూడండి. 

URL అంటే  Universal Resource Locator అని అర్థం. ఇది 1994 లో టిమ్ బెర్నర్స్ లీ   Tim Berners-Lee వరల్డ్ వైడ్ వెబ్ World wide web (WWW) కోసమని తయారుచేశారు. దీనివల్ల బ్లాగ్ అడ్రెస్ / సైట్ అడ్రస్ ని తేలికగా చేరుకోవచ్చును. దీనికి ఉదాహరణగా నా బ్లాగ్ అడ్రెస్ ని మరొకసారి ఇస్తున్నాను - www.achampetraj.blogspot.in 

- అచ్చంపేట్ రాజ్. 


No comments:

Related Posts with Thumbnails