[తెలుగుబ్లాగు:22373] నమస్తే!,
దిల్^సుఖ్ – ఇది లేఖిని లో ‘దిల్‌సుఖ్’ గా నిలబడుతోంది. కానీ Microsoft Indic Language Input Tool తో టైప్ చేస్తున్నప్పుడు ‘దిల్సుఖ్’గానే ఉంటోంది. ఇక్కడ వేరే ప్రత్యామ్నాయం ఉన్నదా, దయచేసి తెలుపగలరు. పొల్లు తర్వాత అక్షరం సంయుక్తాక్షరంగా అయిపోతోంది. సలహా ఇవ్వగలరు.
వేరే ప్రత్యామ్నాయాలు లేవు.. మీరు ఉదాహరించినట్లుగానే సాగాలి.
మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజ్ ఇన్పుట్ టూల్ అయినా, గూగుల్ వాడి లిప్యంతరమైనా ఒకటే.. ఇవి యూనికోడ్ ని ఆధారం చేసుకొని ఏర్పరచిన పరికరములు. వాటిల్లో పొల్లు తరవాత అక్షరం సంయుక్తాక్షరం గా మారిపోతుంది. రెండు పదాలని మధ్యన స్పేస్ వాడి వేరుచేసి, సేవ్ చేసుకొని, ఆ తర్వాత ఎడిట్ చేసి, స్పేస్ తొలగించిననూ ఆ రెండుపదాలు కలసిపోయి - మీరు చెప్పినట్లుగా దిల్సుఖ్ గానే మారుతుంది. వాటిల్లో అలాగే వస్తుంది. అందుకే అలాంటి పదాలని ఆ టూల్స్ వాడేవారు విడివిడిగానే ( దిల్ సుఖ్ ) వ్రాస్తున్నారు.
లేఖిని, క్విల్ ప్యాడ్, యంత్రం, ఆపిల్, ఇంస్క్రిప్ట్, స్వేఛ్చ.. మొదలగునవి వాటిల్లో ఇలాంటి పదాలని మనం అనుకున్నట్లుగా వ్రాసుకోవచ్చును. యూనికోడ్ లా కాకుండా వీటి టైపింగ్ కాస్త ఎక్కువగా ( షిప్ట్ కీ మొదలగు సహాయక మీటలని ) వాడాల్సి ఉంటుంది. కానీ మనం అనుకున్నట్లుగా వీటివల్ల ( దిల్‌సుఖ్ ) వ్రాయగలుగుతాం. ఇలాంటి పదాలని యూనికోడ్ పరికరాల వల్ల వ్రాయలేము.
ఈ యూనికోడ్ పరికరాలని వాడిన నాకు కొద్ది సంవత్సరాల క్రితం వరకూ - " పాఠం " అన్న పదం వ్రాయటం ఎంత ప్రయత్నించినా కుదిరేది కాదు. ఆ ఒక్క పదం కోసం వేరేవాటిని తెరచి, ఆ పదాన్ని టైపు చేసుకొని, తెలుగులోకి వచ్చినదాన్ని కాపీ చేసుకొని నా బ్లాగ్ కోసం పేస్ట్ చేసుకొని వాడుకొనేవాడిని. ఇప్పుడు ఆ పదం యూనికోడ్ లో నేరుగా టైప్ చేస్తే (paatham) వచ్చేస్తున్నది. ఇలాంటివి బగ్స్ ఇంకా కొన్ని ఈ యూనికోడ్ లలో (ఇక్కడా యూనికోడ్ లలో అంటూ విడి విడిగా వ్రాశాను. గమనించగలరు. కలిపివ్రాస్తే వేరుగా - యూనికోడ్లలో - అని వస్తుంది ) అభివృద్ధి చెయ్యాల్సి ఉంది.
- అచ్చంపేట్ రాజ్.
No comments:
Post a Comment