మీ స్మార్ట్ ఫోన్ లో ఫేస్ బుక్ రావాలనుకుంటున్నారా?.. ఇలా ఓపెన్ చేసుకోవటం చాలా ఈజీ. అదెలాగో ఇప్పుడు చెబుతాను. ఈ వివరణలు అన్నీ - క్రొత్తగా ఆన్లైన్ వాడకందారుల కోసం పోస్ట్ చేస్తున్నాను. మొదట్లో - అంటే ఐదేళ్ళ క్రితం నాకు ఈ అంతర్జాలం గురించి తెలీనప్పుడు - చాలా ఇబ్బంది పడ్డాను. నాలాంటి కష్టం మన తెలుగువారికి రావద్దని కాసింత ప్రయాస తీసుకొని, చెప్పటం.
ముందుగా మీరు మీ ఫోన్ యూనిట్ లో మెనూ లోకి వెళ్ళండి. కాసింత పాతతరం ఫోన్ యూనిట్ అయితే - నేరుగా Internet అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. కాసింత నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. అప్పుడు అక్కడ వచ్చిన అడ్రస్ బార్ మీద లేదా గూగుల్ సర్చ్ బార్ మీద - www.facebook.com అని టైప్ చేసి, ఎంటర్ కొట్టండి. నెమ్మదిగా ఆ పేస్ బుక్ తెరచుకుంటుంది.
ఇలా చాలా నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. కొన్నింట్లో అయితే అస్సలు ఓపెన్ కావు. కారణాలు ఏమిటంటే - నెట్వర్క్ ప్రొవైడర్ (అంటే - మొబైల్ సిమ్ కంపనీ వారు) అలా మొబైల్ లో ఇంటర్నెట్ చూడటానికి ఆ ఫోన్ లో బ్యాలన్స్ కనీసమొత్తం (Rs. 100 లేదా 150) అయినా ఉండాలి. ఈ బ్యాలన్స్ అనేది నెట్వర్క్ ప్రొవైడర్ ని బట్టి ఉంటుంది.
మరొక కారణం ఏమిటీ అంటే - ఫోన్ యూనిట్ ప్రాసెసర్ చాలా తక్కువ వేగముతో ఉన్నది అయి ఉంటుంది. ఇలా తక్కువ వేగం తో ప్రాసెసర్ ఉన్న ఫోన్ తో మొబైల్ లో అంతర్జాలం ని చూడటం చాలా కష్టమే!. చూసేబదులు ఊరుకోవటమే ఉత్తమం. ఇలాంటి తక్కువ స్పీడ్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ లో మొబైల్ కేమరాతో తీసిన ఫొటోస్ చూడటానికే (అవి తెరచుకోవటానికే) అయ్యే నెమ్మదనంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఉన్న ఫోన్ యూనిట్ లో అంతర్జాలం చూడటం ప్రయాసే అవుతుంది. చూడకుండా ఊరుకోవటమే ఉత్తమం.. ఇప్పుడు 1 GB ప్రాసెసర్ ఉంటున్నది కాబట్టి చాలా నయం.
ఇక ఫోన్ RAM. ఇది ఆ పాత ఫోనుల్లోచాలా తక్కువగా ర్యాం ఉంటుంది. ఒకటి, రెండు కన్నా ఎక్కువ అప్లికేషన్స్ ఓపెన్ చెయ్యలేం. కేమరాతో తీసిన ఫోటోలని చూస్తూ, వెంట వెంటనే చూస్తుంటే - అంత త్వరగా ఆ ఫోన్ లో ఫొటోస్ ఓపెన్ కాకుంటే - అది ఆ ర్యాం తక్కువ చలువే. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత తొందర తొందరగా మన పని పూర్తవుతుంది.
ఇక ఫోన్ కి వచ్చే నెట్ స్పీడ్ కూడా కీలకమే. సర్వర్ మీద వత్తిడి బాగా ఉన్నప్పుడు నెమ్మదిగా, అంతర్జాలం తెరచుకుంటుంది. ఆ ఫోన్ మెమొరీ, టెంపరరీ ఫైల్స్, తెరచి ఉంచిన ఫైల్స్ / అప్లికేషన్స్, అప్డేట్స్... కూడా అంతర్జాలం ని మొబైల్ లో చూడటానికి కీలకమైనవే. ఇవన్నీ కొన్ని సందర్భాలల్లో బాగా నెమ్మదిగా పనిచేసేలా చేస్తాయి. (అవన్నీ చెప్పుకోవచ్చును కానీ చాలా పెద్దగా అవుతుందని ముగించేశాను)
పై ఇబ్బందుల్లో చాలా భాగం స్మార్ట్ ఫోన్ లలో ఉండవు. కాసింత ఎక్కువ వేగముతో అంతర్జాలాన్ని చూస్తాము.
ఇప్పుడు అంతర్జాలములో సైట్స్ ని ఎలా చూడొచ్చో చూద్దాం. ఇక్కడ ఉదాహరణకి ఫేస్బుక్ ని చూద్దాం. మీ స్మార్ట్ మొబైల్ నుండి మెనూ లోకి వెళ్లి, అందులో ఉన్న Internet ఆప్షన్ వాడి, తెరచిన అడ్రెస్ బార్ లో సైట్ పేరు కొట్టేస్తే సరి. మీకు ఆ సైట్ నేరుగా తెరచుకుంటుంది. ఇదిగో ఇలా..
అలా కాకుండా ఏదైనా బ్రౌజర్ ని (ఉదా : ఒపేరా మినీ - దీని సింబల్ ఎరుపు రంగు O మాదిరిగా ఉంటుంది) ఇన్స్టాల్ చేసుకొని, ఆ బ్రోజర్ ని తెరచి, అందులో సైట్ అడ్రెస్ టైపు చేసి అలా ఓపెన్ చేసుకోవచ్చును.
ఇక అలా కాకుండా ఇంకోరకముగా - తేలికగా ఒక సైట్ వద్దకి నేరుగా వెళ్ళాలీ అంటే - ఆ సైట్ అప్ App (Application = ముద్దుగా App) ని మన మొబైల్ లో ఆడ్ చేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఉదాహరణకి మనం ఫేస్ బుక్ ని మనం తరచుగా మొబైల్ లో చూడాలని అనుకున్నట్లయితే - మీరు ఆ ఆప్ ని మీ మొబైల్ మెనూ లో పెట్టేసుకోవటం బెస్ట్. (Internet లో బుక్ మార్క్ లాగా పెట్టేసుకోవచ్చును.. కానీ ఇంకో రెండు మూడు స్టెప్స్ ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. ఈ ఆప్ వల్ల - పని తొందరగా, నేరుగా వెళ్ళొచ్చును). దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మొబైల్స్ కొన్నిట్లో నేరుగా అలా ఇన్స్టాల్ అయి వస్తున్నాయి. ఇంకొన్ని వాటిల్లో మనమే అలా ఆడ్ చేసుకోవాలి.
ఇలా ఆడ్ చేసుకోవాలీ అంటే - మీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, అక్కడ సర్చ్ బార్ 1 లో Facebook Mobile అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. అప్పుడు ఈ క్రింద ఉన్న సైట్ ని ఎన్నుకొని ఓకే చేస్తే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు 2 వద్ద చూపినట్లు Get the App ని నొక్కండి.
ఇప్పుడు ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది.
అక్కడ 3 వద్ద మీ దేశం పేరూ, ISD కోడ్ ని, డ్రాప్ మెనూ వాడి ఎన్నుకోవాలి.
దాని క్రింద ఉన్న మరో బ్లాంక్ 4 లో మన ఫోన్ నంబర్ ని వ్రాయాలి.
అప్పుడు 5 వద్ద నున్న Send Link to my mobile ని నొక్కాలి.
అంతే!.. ఆ ఆప్ లింక్ ఒక SMS రూపములో మీ మొబైల్ కి ఇలా వస్తుంది.
ఆ SMS ని ఓపెన్ చెయ్యండి.
ఆ లింక్ మీద ఓపెన్ చేస్తే ఇలా
దాన్ని ఓకే చేస్తే -
ఇక్కడ Install Now ని నొక్కితే సరి. అప్పుడు దాని ద్వారా ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చును. ఈ అప్లికేషన్ దానంతట అదే ఇన్స్టాల్ అవుతుంది.
ఒకవేళ ఇదంతా ఇబ్బందిగా ఉంటే - మీరు ఈ లింక్ లోకి నేరుగా వెళ్ళండి. ఫేస్ బుక్ ఆప్ ని నొక్కి నేరుగా వెళ్ళొచ్చును.
No comments:
Post a Comment