[తెలుగుబ్లాగు:22437] వత్తు ప్రక్కన సున్నా టైపు చేయడం కుదరటం లేదు, సహాయం చేయగలరు.
ఉదహరణకు 'చేయడం' లో సున్నా సులువగా టైపు చేయవచ్చు కాని 'సెల్వం' లో మత్రం వత్తు ప్రక్కన ఉన్న యెడల ఎలా టైపు చేయాలో తెలియడం లేదు. దయచేసి సహాయం చేయ మనవి.
ధన్యవాదములు
పై సందేహానికి నా సమాధానం..
మీరు తెలిపిన సందేహంలో " చేయడం, తెలియడం, సహాయం.. " వాటిని చాలా తేలికగా టైప్ చేసిన మీకు - చాలా మామూలుగా టైప్ చేస్తే వచ్చే selvam సెల్వం పేరు టైపు చెయ్యడంలో ఇబ్బందిగా ఉంటున్నది అంటే ఆశ్చర్యముగా ఉంది. వీవెన్ గారు మీ సందేహానికి సమాధానం ఇచ్చినా, లేఖిని వాడుక మీకు క్రొత్తగా భావించి, కాస్త పెద్దగా, వివరంగా చెప్పాలనిపించి ఈ రిప్లై ఇస్తున్నాను.. అంతేగానీ మరోలా భావించకండి. ఈ క్రింది లేఖిని తెరపట్టులో ఎర్రని వృత్తం లో చూపినది ( M ) - పదం ప్రక్కన సున్నా రావటానికి వాడే కీ. కీ బోర్డ్ మీదున్న M కీ ని వాడి మీరు అలా పదాల చివర సున్నాని వచ్చేలా చెయ్యవచ్చును.

టైప్ చేసిన పదాలు, వచ్చిన తెలుగు పదాలని వాటి ప్రక్కనే పెద్దగా జూమ్ చేసి, బాణాల గుర్తులతో చూపించాను.. గమనించగలరు.
అలా వత్తు ప్రక్కన సున్నా రావటానికి M మీటని వాడితే సరి. అలాంటి మరికొన్ని పదాలు ఎలా వ్రాయాలో మీకు తెలియడానికి మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నాను. వాటిని అభ్యాసం చెయ్యండి.
diTTam = దిట్టం,
prEmaikyam = ప్రేమైక్యం,
gAndharvam = గాంధర్వం,
Arghyam = ఆర్ఘ్యం,
kAryam = కార్యం,
divyam = దివ్యం,
pAnchajanyam = పాంచజన్యం.
chEyaDam = చేయడం,
tinaDam = తినడం,
sahAyam = సహాయం,
aDagaTam = అడగటం,
kOpam = కోపం,
SAntam = శాంతం,
teliyaDam = తెలియడం,
cheppaTam = చెప్పటం,
vinaDam = వినడం..... ఇలా చాలానే ఉన్నాయి.
No comments:
Post a Comment