Wednesday, May 13, 2015

ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు

ఈ మధ్య తెలుగు దినపత్రికల్లో - ఆంగ్ల పదాలకు బదులుగా తెలుగు పదాలని వాడుతూ తెలుగు భాషని నలుదిశలా విస్తరించటానికి, అలాగే తెలుగు భాషపట్ల ఆసక్తినీ కలుగ చేస్తున్నాయి. ఇలా ఇంగ్లీష్ పదాలకు బదులుగా తెలుగు పదాల ప్రయోగం కొంత క్రొత్తగా, వింతగా ఉన్నా వాడుకలోకి వచ్చాక అది మామూలు పదమైపోతుంది. అలాంటి కొన్ని పదాల సేకరణని ఇక్కడ ఇస్తున్నాను. వీలువెంట మళ్ళీ క్రొత్తపదాల చేర్పు ఉంటుందని తెలియచేసుకుంటున్నాను..

Internet -- అంతర్జాలం 
Cellphone -- సంచారవాణి
Air hostess -- గగనసఖి
Browser -- విహారిణి
Gel -- జిగురు ద్రవం 

Wrong direction -- అపసవ్య దిశ
Refund -- వాపసు చేయటం
Contract workers -- ఒప్పంద కార్మికులు / ఉద్యోగులు
No frills -- శూన్య మొత్తం
Information Technology -- సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం 

Outsource -- పొరుగు సేవ
Lubricant -- కందెన
(Dinner) Menu -- (విందు) జాబితా
Mass copying -- మూక చూచిరాత 
Value added services -- విలువ జత చేరిన సేవలు 

Non-convertible debentures -- మార్పిడికి వీలు లేని రుణ పత్రాలు 
BPO (Business process outsourcing) -- వ్యాపార పొరుగు సేవలు 
Board -- నామసూచిక 
Fonts -- ఖతులు 
User name -- వినియోగ నామము 

Password -- సంకేత నామము
Sign board -- నామసూచిక 
Single Window -- ఏక గవాక్షం 
Tablets -- గుళికలు 
Font -- ఖతి 

Account -- ఖాతా 
Touch Screen -- తాకిడి తెర. 
Circle Inspector -- వలయాధికారి / పోలీసు అధికారి 
Add -- చేర్చు 
Eduction officer -- విద్యాధికారి 

Regularization -- క్రమబద్ధీకరణ  
Transformer -- నియంత్రిక 
Contractor -- గుత్తేదారు 
Fire Engine -- అగ్నిమాపక శకటం 
Disturbances -- అవాంతరాలు 

Age Limit -- వయోపరిమితి 
File -- దస్త్రం 
Astronaut -- వ్యోమగామి 



5 comments:

Narendar Reddy said...

lubricant = స్నేహకం

Narendar Reddy said...

tablet = మాత్ర
capsule = గుళిక

Raj said...

మీ సహకారానికి కృతజ్ఞతలు నరేందర్ రెడ్డి గారూ..

Gopal said...

మీ పాఠాలు బాగున్నాయి.

నేను వారణాసిలో హిందీ వాళ్లకు కంప్యూటర్ లో హిందీ లో ఏలా టైపుచెయ్యాలో చెప్తుంటాను. చాలామంది ఓక చెవితో విని వేరే చెవితో వదిలేస్తో ఉంటారు. ఈ మధ్య మా ఛాయాచిత్రకారుడు (ఫొటోగ్రాఫరు) టాబ్, మొబయిల్ లలో హిందీలో ఎలాటైపు చెయ్యాలో నా దగ్గర నేర్చుకున్నాడు. అతను ఫొటోలు పత్రికలకు పంపుతూ ఉంటాడు. వాటి గురించి పేపరు వాళ్లకు తెలియాలి కదా అందుకని ఆ వార్తలు హిందీలో టైపుచేసి వెంటనే పంపిస్తూ ఉంటాడు. అంతే కాదు యూనికోడ్ లో టైపు చెసి హిందీ వార్తలు పంపిస్తే వెంటనే పేపర్లో వేసుకుంటారు కూడాను. చాలామంది చేతితో వ్రాసి స్కాన్ చేసి పంపిస్తారు. వాటిని పేపరు వాళ్ళు పట్టించుకోరు కూడాను. అందుకని అతను ఈ మద్య కంప్యూటర్లో కూడా గూగుల్ ఇన్ పుట్ టూల్ వాడి హిందీలో న్యూస్ పంపిస్తుడు. అతడ్ని చూసి ఈ మధ్య మరికొందరు మొదలు పెట్టారు. మొదలు పెట్టడం కష్టం కాని ఓకసారి అలవాటయితే మరి వదలబుద్ధి కాదు కదా।
మీ పాఠాలు బాగున్నాయి.

Raj said...

దువ్వూరి వేణుగోపాల్ గారూ!
నేను చెప్పిన తెలుగులో వ్రాయటం ఎలా - అన్నవి మీకు ఎంతగానో నచ్చాయని తెలిసి, చాలా సంతోషముగా ఉందండీ.. అందులకు కృతజ్ఞతలు.

Related Posts with Thumbnails