[తెలుగుబ్లా గు:22293] ప్రశ్నకి సమాధానంగా నేనిచ్చిన జవాబు:
మీరు అంటున్నది జీ మెయిల్ లో తెలుగులో వ్రాయటం అన్నది అనుకుంటాను. జీ మెయిల్ లో ఒకప్పుడు తెలుగులో వ్రాయుటకు ఒక పనిముట్టు అ అని టూల్ బార్ లో ఉండేది. జీ మెయిల్ నవీకరణలో ఆ పనిముట్టు తొలగిపోయింది. ఇప్పుడు క్రొత్తగా వేరే పద్ధతిలో ఇస్థున్నారు. మీరు చెయ్యాల్సిందల్లా - ఈ క్రింది తెరపట్టులో చూపిన విధముగా అనుసరించండి. అప్పుడు మీరూ జీ మెయిల్ లో తెలుగులో వ్రాయుటకి సౌలభ్యముగా ఉంటుంది.
1. వద్ద ఉన్న చక్రం గుర్తు ( సెట్టింగ్స్ గుర్తుని ) నొక్కండి.
2. అప్పుడు తెరచిన సెట్టింగ్స్ పేజీలో పైన టూల్ బార్ లో ఉన్న ( 2 ) General డిఫాల్ట్ గా తెరవబడి ఉంటుంది.
3. వద్ద నున్న Enable Input tools ప్రక్కనున్న గదిలో మౌస్ తో టిక్ చెయ్యండి.
4. ఆ లైనుకు చివర ఉన్న Edit tools లంకెని నొక్కండి. అప్పుడు మీకు ఒక భాషల పనిముట్లు గల మెనూ వస్తుంది. ఎడమన ఉన్న గడిలోంచి, కుడి గడిలోకి మీరు ఎంచుకున్న భాషని ( ఉదాహరణ : తెలుగు ) మౌస్ సహాయాన డ్రాగ్ చెయ్యండి. క్రిందన Save నొక్కండి.
5. ఇప్పుడు మీరు సెట్టింగ్స్ చిహ్నం ప్రక్కన అ ( 5 ) అనే భాషా పనిముట్టు కనిపిస్తుంది. దాన్ని నొక్కి, ilaa roman telugulo vraasthoo unte - padam padaaniki venuventane తెలుగులోకి మారుతుంది. అలా వ్రాస్తూ స్పేస్ బార్ నొక్కగానే - అక్కడ తెలుగు ఫాంట్ లో మీరు వ్రాసినది వస్తుంది.
ఒక పరిశీలన కోసం ఇక్కడ ఒక ఉదాహరణని మీకు చూపిస్తున్నాను.. గమనించండి.
No comments:
Post a Comment