[తెలుగుబ్లాగు:22483] BhutEbhya&@H ani koditE భుతేభ్యః Ya vattu last lo vasthondi Bha prakkana raavadaaniki nenu emi cheyyali? అనే ప్రశ్నకు నేనిచ్చిన జవాబు :
మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు కావలసిన పదాన్ని తెలుగులో చూపించారు. అది చూస్తే - మీకు కావలసిన పదం ( భుతేభ్యః ) మీకు వచ్చేసినట్లుగా కనిపిస్తున్నది. అలా వచ్చాక కూడా మీరు అలా ఎలా టైప్ చెయ్యాలో మళ్ళీ అడిగినట్లుగా తికమకగా ఉంది. అయిననూ మీకు సమాధానంగా ఈక్రింది తెరపట్టుని చూపిస్తున్నాను. అందులో మీకు పరిష్కారం కనిపించవచ్చు.
గూగుల్ తెలుగు లిప్యంతరములో :
లేఖిని లో :
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు నాకు ఏర్పడిన ఇబ్బందులను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇలాంటి ప్రశ్నలను ఇకమీదట అడిగే ఈ బ్లాగర్స్ గ్రూప్ సభ్యులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి.
1. మీరు టైప్ చెయ్యాలనుకుంటున్న పదం ని టైప్ చెయ్యడం రాకపోతే - దాన్ని ఒక పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి మెయిల్ తో బాటుగా పంపండి. దాన్ని చూశాక ఎలా దాన్ని టైప్ చెయ్యాలో చెప్పడం ఇతర సభ్యులకు తేలికగా ఉంటుంది.
2. మీరు అడుగుతున్న పదం ఎలా టైపు చెయ్యాలన్నది - ఇంస్క్రిప్ట్, లేఖిని..... లాంటి సైట్లలోనా లేక గూగుల్ వారి లిప్యంతరం లోనా అన్నది కూడా తెలియచెయ్యండి. ఇది ఎందుకంటే ఈ రెండింటిలో కాస్త వేరుగా టైప్ చెయ్యాల్సి ఉంటుంది. పైన ఉన్న తెరపట్లలో ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. చాలామంది ఇక్కడే అయోమయానికి గురి అవుతారు. మీరు ఇంస్క్రిప్ట్ లో టైప్ చెయ్యాలని అనుకొని అది ( ఇంస్క్రిప్ట్ అని ) ప్రస్తావించకుండా అడిగితే - సభ్యులు లిప్యంతరం లో గనుక మీకు సమాధానం ఇస్తే - అది మీకు సరియైన పరిష్కారంగా తోచదు. అందువల్ల మీరు ఎందులో టైపింగ్ చేస్తున్నారో తప్పనిసరిగా చెప్పాలన్నది గుర్తుపెట్టుకోవాలి.
3. మీరు టైప్ చేస్తున్నప్పుడు వచ్చిన తప్పుడు పదాన్ని - ఎలా వస్తున్నదో గ్రూప్ లోని ఇతర సభ్యులకు చూపించడానికి - దాన్ని స్క్రీన్ షాట్ ( తెరపట్టు ) తీసి, పోస్ట్ చెయ్యండి. మీ సమస్య ఏమిటో తోటి బ్లాగర్స్ కి బాగా అర్థం అవుతుంది.
- అచ్చంపేట్ రాజ్
No comments:
Post a Comment