Thursday, September 19, 2013

Good Morning - 456


ఒకరిని అనడం చాలా తేలిక, కానీ దానికి అవతలివారు కౌంటర్ ఇస్తే - తట్టుకోగలిగే శక్తి ఉంటేనే అనడం నేర్చుకోండి. 

ఒకరిని నిందించడం, వెక్కిరించడం, బాధపెట్టడం, చులకనగా చూడటం, సూటిపోటి మాటలు అనడం చాలా తేలిక. ఎందుకో గానీ, మనకి కారణం లేకుండానే ఒక్కోసారి ఎదుటివారిని అనడం చేస్తుంటాం - వారు ఏమీ అనకున్నా సరే..! మనం అన్నదానికి వారు మౌనముగా ఉండి, ప్రతిస్పందన అంటూ ఏమీ చూపకపోతే, ఫరవాలేదు. కానీ, అవతలివారు మనం అన్నదానికి ప్రతిగా కౌంటర్ వంటి మాటలు మాట్లాడారే అనుకోండి. ఆ ప్రతిస్పందన మాటలు కాసింత కటువుగా, హేళనగా, వక్రముగా, తిరుగులేని సమాధానముతో, సూటిగా, చాలా పదునుగా ఉంటాయి. అలా వచ్చిన స్పందనని మీరు ముందే ఊహించగలగాలి. వాటిని తట్టుకోనగలిగి ఉండగలిగితే, మనం అనడం చెయ్యాలి. లేకుంటే మానసికముగా చాలానే దెబ్బ తినాల్సి వస్తుంది. 

ఆ మాటలు తిరుగులేనివిగా ఉంటే - ఆ సమయములో మీరొక్కరే ఉంటే కాసేపట్లోనే తట్టుకుంటారు. కానీ " మొగుడు కొట్టినందులకు కాదు కానీ, తోటి కోడలు నవ్వినందులకు.. " అన్న చందాన, ఆ సమయాన మీరు నలుగురిలో ఉన్నప్పుడు ఇలా ప్రతిస్పందన వస్తే - మీరు మీ మీ మనస్థత్వ స్థాయిని బట్టి, బా...గా దెబ్బతింటారు. దాని నుండి కోలుకోవడానికి  చాలానే సమయం పడుతుంది. మరచిపోవడానికి ఒక్కోసారి జీవితకాలం పట్టొచ్చు. తస్మాత్ జాగ్రత్త!. 

" నేనేదో ఇలా అంటే - ఇంతగా అంటావా?.."  అని అనబోతే, 
" ఆ అనడం కూడా ఎందుకు ? నేను నిన్నేమైనా అన్నానా ? నీ జోలికి వచ్చానా ? రానప్పుడు - నా మానాన నేను ఉన్నప్పుడు, నా జోలికి వచ్చి ఏమైనా అంటే  - నేను ఊరుకోను.. "  అంటే ఏమీ మాట్లాడలేక పోతాం. చేష్టలుడిగిపోతాం. 

No comments:

Related Posts with Thumbnails