వాదనల వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. వాటికి దూరముగా ఉండండి.
అవును. అభిప్రాయాల భేదాల వల్లనే గానీ, ఏదైనా సంఘటనలో గానీ, మరే సందర్భములో గానీ వాదనలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాదనలు మాటలతో మొదలయ్యి, గొంతు పెరుగుతూ చివరకి - ఒక్కోసారి చేయి చేసుకోవటాలూ జరుగుతుంటాయి. వాదన పెంచుకోవటం మూలాన అంతవరకూ ఎదుటి వారి మీద ఉన్న అభిమానం, ఆత్మీయత, అనురాగం కొద్దిగా తగ్గుతాయి. ఇద్దరే ఉండి, వాదన పెట్టుకుంటే ఫరవాలేదు. అది కాసేపట్లోనే సమసి పోతుంది. కానీ ఒక సమూహములో ఉన్నప్పుడు - వాదన జరిగితే, అందరి ముందూ తమదే సరియైనది చూపించటానికి సర్వ శక్తులూ ఒడ్డుతారు. అప్పుడు వాదనలో పస లేనివారు ఎదుటివారిలోని శారీరక, మానసిక లోపాల్ని అందరి ముందూ బయటపెడుతూ తూలనాడుతారు. ఫలితముగా అభిజ్యాతాలు ( ego) దెబ్బతిని, ఇదివరకట్లా సఖ్యతగా ఉండలేక పోతారు.
అందుకే వాదనలు వచ్చినప్పుడు - నేను ఇలా అనుకుంటున్నాను అని క్లుప్తముగా కొద్దిమాట్లల్లో చెప్పాల్సింది చెప్పేసి ఊరుకోండి. ఆ తరవాత దాని మీద చర్చ జరిగినా పాలు పంచుకోకండి. పాలు పంచుకొంటే - అందులో కలుగజేసుకుంటే - ఆ విషయం చిలికి, చిలికి పెద్దది కావొచ్చును. ముఖ్యముగా రాజకీయ, సామాజిక, సినీ విషయాల్లో వాదనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలా మాట్లాడుకొనే ఇరవై ఏళ్ళ స్నేహాన్ని - కేవలం అరగంట ఈ విషయాలు మాట్లాడుకొని, ఇప్పటికీ మొఖం చూసుకోకుండా దూరం చేసుకున్న నా మిత్రులని చూశాక, నేనూ వాదన పెట్టుకోవటం మానేసుకున్నాను.
No comments:
Post a Comment