నేను ఒక బ్లాగ్ లో కామెంట్ పొస్ట్ చెద్దమని ఎంత ప్రయత్నించినా నా కామెంట్ పోస్ట్ కాకుండా Your comment will be visible after approval అని వస్తుంది, ఎందుకు అలా వస్తుంది, ఆ బ్లాగ్ లో కామెంట్ పోస్ట్ చేయాలి అంటే ఎలా?
మీరు కామెంట్ ని పోస్ట్ చేసిన బ్లాగ్ లో - కామెంట్ మాడరేషన్ పెట్టారు. అనగా - ఆ బ్లాగ్ లోని టపాలని చదివి, ఎవరైనా ఇబ్బందికరమైన కామెంట్స్, అభ్యంతకరమైన, స్పాం కామెంట్స్ పెట్టకుండా - ఆ బ్లాగర్ స్వంతదారుడు అలా సెట్టింగ్ ఎన్నుకొని అలా సందర్శకులు వ్రాసిన కామెంట్స్ వెంటనే పబ్లిష్ కాకుండా చూస్తారు. అప్పుడు ఆ కామెంట్ వ్రాసిన వారికి Your comment will be visible after approval అని వస్తుంది. వీలున్నప్పుడు ఆ కామెంట్స్ చూసి, బాగుంటే - వాటిని అక్కడ పబ్లిష్ చేస్తారు.
మీకు ఆ బ్లాగ్ లో అలా కామెంట్ మాడరేషన్ ఉందని మీకు తెలీకపోవచ్చును. మామూలుగానే కామెంట్ పోస్ట్ చెయ్యండి చాలు.ఆ బ్లాగ్ ఓనర్ - ఆ బ్లాగ్ హోం పేజికి వచ్చినప్పుడో, లేదా మెయిల్ ID ఓపెన్ చేసినప్పుడు ఆ కామెంట్ ని చూసి, బాగుంది అనుకున్నప్పుడు ఓకే చేస్తాడు. లేదా డిలీట్ చేస్తాడు. ఇది మీ సమస్య కానే కాదు. అవాంఛనీయమైన కామెంట్స్ పెట్టేవారి సమస్య. మీరు హ్యాపీగా ఉండండి.
2 comments:
రాజ్ గారు, నేను తెలుగు మంచి మాటలు పేజి అడ్మిన్మం జునాథ శర్మగారి మిత్రుడను..
(నేను ఫేస్ బుక్ పేజీ.. తెలుగువిజ్ఞానం వినోదం అడ్మిన్ ను)వారి ద్వారా మీగురించి తెలుసుకున్నా మిమ్మల్ని కలిసే భాగ్యం నేటికి దొరికింది... మీ సలహాలు/బ్లాగు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి!! ధన్యవాదములు...
నాబ్లాగు:
www.teluguvignanamvinodam1.blogspot.in
www.facebook.com/telugu.vignanam.vinodam
నా బ్లాగు పట్ల మీ స్పందనకి కృతజ్ఞుడిని. .
Post a Comment