ఎందుకే ఇలా గుండె లోపలా - ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా అల్లుకోకిలా - ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా
వెంటాడుతూ వేధించాలా - మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా - జ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానీయవా - దయలేని స్నేహమా // ఎందుకే ఇలా //
చరణం 1 :
తప్పదని నిను తప్పుకుని వెతకాలి కొత్త దారి
నిప్పులతో మది నింపుకుని బతకాలి బాటసారి
జంటగా చితిమంటగా - గతమంత వెంట ఉందిగా
ఒంటిగా నను ఎన్నడూ వదిలుండనందిగా
నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో - నీకే తెలియాలి // ఎందుకే ఇలా //
చరణం 2 :
ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక
జన్మలో నువు లేవని ఇకనైన నన్ను నమ్మని
నిన్నలో వదిలేయనీ ఇన్నాళ్ల ఆశని
చెంతేవున్నా సొంతం కావని నిందించేకన్నా
నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా // ఎందుకే ఇలా //
No comments:
Post a Comment