Friday, September 2, 2011

Social NW Sites - 39 - Post Scripts - 6

వరైనా మీకు, మీ ఫ్రెండ్స్ అందరికీ కలిపి మ్యూజికల్ స్క్రాప్ పంపారు అనుకోండి. మీరు మీ ఇష్టమైన పాటలు వింటూ సిస్టం మీద - మీ అకౌంట్ ని చూసుకునేవారు అయితే ఆ పాట మాటిమాటికీ మిమ్మల్ని ఇబ్బందే పెట్టిందే అనుకోండి. ఇప్పుడు వారికి అలాంటివి పెట్టొద్దని చెప్పండి. అలా చెబితే ఏమైనా అనుకుంటారు అని మీరనుకుంటే - ఆ మ్యూజికల్ స్క్రాప్ నుండి మిమ్మల్ని మీరు తొలగించుకోండి. అదే ఎలా అంటే - ఇది చాలా సింపుల్. ఆ గ్రూప్ లోని మీ ఫోటో మీద కర్సర్ పెట్టగానే ఆ గ్రూప్ లోని, మీ ప్రొఫైల్ డీపీ మీద క్లోజ్ (x) గుర్తు వస్తుంది. మీరు దాన్ని నొక్కితే చాలు. మీకు ఆ మ్యూజిక్ స్క్రాప్ శాశ్వతముగా వెళ్ళిపోతుంది. ఆ స్క్రాప్ కి వచ్చే మిగతావారి కామెంట్స్ ఏమీ రావు కూడా. ఇదొక్కటే ఇబ్బంది అందులో. ఆ కామెంట్స్ కూడా రావాలి అంటే అలా అందులోనుండి వెళ్ళిపోకుండా, ఆ మ్యూజిక్ వింటూ, మనకి నచ్చిన పాటలు ఏమీ వినకుండా  ఉండాల్సి వస్తుంది. స్పీకర్స్ ఆన్ చేస్తే ఆ పాటనే రిపీట్ అవుతుంది. ఈ క్రింది ఫోటోని కావాలనే బ్లర్ గా చేసి పెట్టాను. ఇందులో సాధారణముగా మొదటి ఫోటో మీదే ఉంటుంది. దాని మీద కర్సర్ పెడితే అలా x మార్క్ వస్తుంది. దాన్ని నొక్కితే ఆ స్క్రాప్ గుంపు నుండి వెళ్ళిపోతారు.


నం ఎదుగుతున్నప్పుడు - మన విచక్షణా జ్ఞానాన్ని వాడి, స్వంతముగా నిర్ణయాలు తీసుకోవాలి. వేరే వారి నిర్ణయాలు అమలు చేస్తే - రేపు ఏదైనా జరిగితే - నేను తీసుకోలేని నిర్ణయాన్ని, అలా పాటించి అనవసరముగా బలయ్యాను అనే ఫీలింగ్ మీలో కలుగుతుంది. మీరంతటమీరుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటే - మీ దైనందిక జీవితములో కూడా క్లిష్టమైన సమస్యల్లో నిర్ణయాలు తీసుకొనే ధైర్యం వస్తుంది. 

వివేచనా ఉండాలి. ఎవరో ఎవరి మీదో అన్నారనీ, అదే నిజం అనుకొని, వారిని దూరం చేసుకొంటే - ఆతరవాత తీరికగా బాధ పడాల్సి ఉంటుంది. ఈరోజుల్లో ఆవేశాలు ఎక్కువ. ఆలోచనలు తక్కువ. ఏదో చెప్పగానే అదే నిజం అని అనుకోకుండా - వేరేవారిని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళిద్దరూ చెప్పిన విషయాన్ని విశ్లేషించి, ఎవరి మాట వినాలో, ఏది మంచో, చెడో తెలుసుకోవాలి. ఆ తరవాతే దూరం చేసుకోవాలి.

కసారి దూరం అయ్యాక, మళ్ళీ కలవాలని అనుకుంటే - అభిజ్యాతం (Ego) అడ్డం వస్తుంది. అప్పుడు కలవటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ కలసినా అప్పటిలా ఉండకపోవచ్చును. కనుక అలా చేసేముందు ఒకసారి గట్టిగా ఆలోచించుకోండి.

వరినీ తప్పు పట్టోద్దు. మీకు చేతనైనంత సహాయం చెయ్యండి. అది కూడా వారు సహాయం అడిగితేనే. మీతో అయితే ఓకే. చెయ్యండి. ఒకవేళ మీతో కాకుంటే - నిజాయితీగా, డొంకతిరుగుడు లేకుండా నావల్ల కాదని చెప్పండి. అంతేకాని వారిని మీ చుట్టూ త్రిప్పుకునేలా చెయ్యకండి. ఒకవేళ మీరు చేస్తే మీ పట్ల వారు చూపే అభిమానానికి దెబ్బ తగలటం మొదలవుతుంది. అలాచేసి మీకు దూరముగా అయ్యేలా చేసుకోకండి.

(సశేషం..)

No comments:

Related Posts with Thumbnails