మొన్న నా మిత్రుడు ఒకరు ఈ క్రింది పేపర్ కటింగ్స్ ని మెయిల్ చేశాడు. వాటి గురించి కాస్త చెప్పాడు. కాస్త వివరముగా చెప్పమని చెప్పాడు. అతనికి అప్పుడే కాస్త చెప్పాను. ఇంకొంచెం ఆలోచించి, ఒక మంచి పరిష్కార మార్గం చెప్పాలని ఇప్పుడు ఈ టపా పోస్ట్ చేస్తున్నాను. ముందుగా ఈ పేపర్ మీదవి చదవండి.
బట్టల కొట్లో, హోటల్స్ లలో ఉండే ట్రయల్ రూమ్స్ లోని కొన్ని అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా హెచ్చరించారు. ఇది ముఖ్యముగా మహిళలని ఉద్దేశించి వ్రాశారు. నేనిప్పుడు చెప్పేదీ వారికోసమే కూడా.. కొద్దిగా ఆలోచించాక కొన్ని పొరబాట్లు, అవగాహనలేమీ, కొన్ని సూచనలూ సరిగ్గా లేవు అని అనిపించింది. కాస్త శోధించాను. కొన్నింటికి సమాధానాలు దొరికాయి. ఇంకొన్ని క్రోత్త విషయాలూ తెలిసాయి. అలాగే ఎలా చేస్తే - భద్రముగా ఉంటామో కూడా ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ఇంకొన్ని ఆలోచించాలి. కాని దసరా సీజనులో బట్టల అమ్మకాలు చాలా ఎక్కువ. అలాగే ఈ దసరా సెలవుల్లో సెలవుల్లో, ఎటైనా వెళ్ళితే హోటల్ రూముల్లో ఉండటం తప్పదు. అలా చేసి, ఆ రూముల్లో - దుస్తులు మార్చుకున్నప్పుడో, గాఢ పరిష్వంగం లో ఉన్నప్పుడో.. వీడియోస్ తీసి అంతర్జాలములో గానీ, బ్లాక్ మెయిల్ గానీ చేయ్యోచ్చును..కాని అలా కాకుండా చెయ్యవచ్చును.. అది వేరే విషయం. కనుక ఇంకా శోదించక ముందే ఈ పోస్ట్ వ్రాయాల్సి వచ్చింది.
ముందుగా అక్కడ చెప్పినవి నిజమా, కాదా అని చూద్దాం.
ట్రయల్ రూం లోకి అడుగు పెట్టగానే, మీ చేతిలో మోబైల్ ఉంటే మీ స్నేహితులకి రింగ్ ఇచ్చి చూడండి. అలా చేస్తే ఆ ట్రయల్ రూం లో రహస్యముగా కెమరాలు ఏమైనా ఉంటే వారికి కాల్ వెళ్ళదు. లేకుంటే వారికి కాల్ వెళ్ళుతుంది.. అనీ. ఇది నిజం కాదు. ఇది పక్కా అవగాహనలేమి వల్ల చెప్పటం. నిజానికి అలాని ఏమీ జరగదు కూడా. మీరు రెండు మొబైల్ ఫోన్స్ ప్రక్క ప్రక్కనే పెట్టినా ఇంటర్ఫియరన్స్ అంటూ ఏమీ ఉండదు.
మీ దగ్గర రెండు మొబైల్స్ అంటూ ఉంటే - ఆ రెండింటినీ మీ రెండు చేతుల్లో పట్టుకొని, ఒకదానిలో కెమరా / వీడియో ఆప్షన్ ఆన్ చెయ్యండి. ఇంకోదానిలో మీ ఫ్రెండ్ కి / ఎవరికైనా కాల్ చెయ్యండి. ఎంచక్కా వెళుతుంది. ఒక్క సిగ్నల్స్ బాగుంటే సరి. అలా వీడియో తీస్తుండగానే, మీరు ఎంచక్కా అవతలివారితో ఏమీ డిస్టర్బ్ లేకుండా మాట్లాడవచ్చును కూడా. నేను నిజముగా టెస్ట్ చేసి చూశాను కూడా. మామూలుగానే ఉండి - ఫోన్ ని యే డిస్టర్బ్ లేకుండా మాట్లాడాను. అలాగే వీడియో కూడా బాగానే వచ్చింది కూడా. అదీ - ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా. ఈ రెండు పరికరాలకీ కేవలం ఆర అడుగు లోపలే (ఆరు అంగుళాలు) దూరములో ఉంచి మాట్లాడాను. మామూలు డిజిటల్, HD కెమరాల కన్నా మొబైల్ ఫోన్స్ కే ఎక్కువ సిగ్నల్స్ ప్రభావం ఎక్కువ. ఆన్ చేసి ఉన్న స్పీకర్స్ వద్ద మొబైల్స్ పెడితే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ ప్రభావం గల మొబైల్ ఫోన్స్ ని ఎన్నుకొని ఈ ప్రయోగం చేశాను. అలాంటిదేమీ లేదని తేలింది. అంటే కెమరా పనిచేస్తున్నప్పుడు కూడా ఫోన్స్ మాట్లాడుకోవచ్చును, కాల్ చేసుకోవచ్చును.. రిసీవ్ చేసుకోవచ్చును కూడా..
ఇక రెండో విషయం. మిర్రర్ (అద్దాల గురించి) ఈ టూ వే (Two way = రెండువైపులా నుండి చూసుకునేలా వీలుగా ఉండే) అద్దం గురించి.. ఈ టూ వే అద్దాలని వాడేవారు / హోటల్స్ వారూ చాలా అరుదు.(అలాని ఉండకపోవచ్చును కూడా) ఈ టూ వే అద్దాల గురించి మీకు ఇంకా స్పష్టముగా తెలియాలీ అంటే - కూలింగ్ స్టికర్ అంటించిన కారు అద్దాలని ఒకసారి గమనించండి. బయటనుండీ మన ప్రతిబింబాన్ని చూసుకోవచ్చును. కాని లోపల ఉన్నవారు మనల్ని అంతా, మనం చేసే పనుల్ని ఎలా చాటుగా చూస్తారో అలాని ఇక్కడ అనుకోవచ్చును. ఏమిటీ! ఇదంతా విని మీ గుండె ఒక్కసారిగా ఆగిందా?.. వామ్మో అని అనుకుంటున్నారా.. కాస్త కూల్. కూల్. టూ వే గ్లాస్ అంటే అదేమరి!
మీరు ఇలాంటి కారు అద్దం మీద పైన ఉన్న పేపర్ కటింగ్ లో చెప్పినట్లుగా మీ గోరుని ఆనించండి. మీ గోటి ప్రతిబింబం మీ గోటిని త్రాకదు. అవును.. ఖచ్చితముగా త్రాకదు కూడా. మీ గోటికీ, అద్దం మీద ఉన్న మీ గోటి ప్రతిబింబానికీ మధ్య కాస్త గ్యాప్ వస్తుంది. ఒకేఒక కోణములో చూస్తే మీ గోటికి తాకినట్లుగా ఉన్నా.. కాస్త ఎడం గా చూస్తే అలాని అనిపించక దూరముగానే కనిపిస్తుంది. అంటే పైన పేపర్ కటింగ్ లో చేపినవి రెండూ నిజం కాదు అని తేలిపోయింది కదూ..
నిజానికి అలా టూ వే అద్దాలు కూడా వాడాల్సిన అవసరం కూడా లేదు కూడా.. మామూలు అద్దాలని కూడా వాడి కూడా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చెయ్యోచ్చును. నిజానికి ఈ పద్ధతి చాలా సింపుల్. కాని - ఇక్కడ కానీ, ఎక్కడ కానీ అలాంటి విషయం బయట పెట్టలేను. ఆశపడి అడిగినవారికి కూడా చెప్పలేను. ఇది నిజానికి ఈ టపా వ్రాస్తుండగా ఇప్పుడే తట్టింది. కానీ బయటపెట్టలేను. టెక్నాలజీ / తెలివి అనేది మేలు చెయ్యాలి గానీ, కీడు చెయ్యొద్దు అని నమ్మేవారిలో నేనూ ఒకడిని. మహిళలకి నేను మేలు చెయ్యాలని అనుకుంటున్నాను, కానీ ఇబ్బందుల పాలు చెయ్యదలచుకోలేదు.
వామ్మో!.. ఇక మేము ఎలా బట్టల కొట్లో, షాపింగ్ మాల్స్ లలో ట్రయల్ రూమ్స్ లలో బట్టలు ఎలా మార్చుకునేదీ, హోటల్స్ లలో ఎలా ఉండగలిగేదీ అని తలపట్టుకొని భయపడిపోతున్నారా? అదేమీ అంత టెన్షన్ గా ఆలోచించకండీ.. చాలా సింపుల్ విషయం ఇది. పరిష్కారము కూడా చాలా సింపులే.. ప్రపంచములో ఎక్కడైనా ఈ టెక్నిక్ ని వాడి మీ ఇబ్బందులని తగ్గించుకోవచ్చును.
1. ముందుగా మీరు షాపింగ్ సెంటర్లో మీకు నచ్చిన దుస్తుల్ని ఎన్నుకోండి. వాటిని అక్కడే ఉన్న ట్రయల్ రూం లో ధరించి చూడాలి అనుకుంటే - ఆ ట్రయల్ రూమ్స్ వద్దకి వెళ్ళండి.
2. ఆ ట్రయల్ రూం లో ఆ పేపర్ కటింగ్స్ లో చెప్పినవి ఆలోచించకండి. ఆ ఊసే మరచిపోండి. హాయిగా కూల్ గా ఉండండి.
3. మీ చేతుల్లోని బ్యాగుల్ని ఒక మూలగా పెట్టండి. ఒకసారి ఆ రూం ని కాస్త మామూలుగా పరిశీలన గా చూడండి.
4. ఆ ట్రయల్ రూం లోని లైట్ స్విచ్ ఆఫ్ చెయ్యండి. ఆ తరవాత అందులో ఉండే గుడ్డి వెలుతురులో మీరు ఆ బట్టలని మార్చుకోండి. అంతా ఒకే అయ్యాక అప్పుడు ఆ ట్రయల్ రూం లో లైట్ వెయ్యండి. లేదా స్విచ్ కనిపించక పోతే, మీ మొబైల్ ఫోన్ ఆన్ చేసి ఆ స్విచ్ ని వెదికి అప్పుడు ఆన్ చెయ్యండి. మీ చేతిలో మొబైల్ కనుక లేకపోతే - లైట్ స్విచ్ ఎక్కడ ఉందో తెలీకపోతే ఆ రూం డోర్ ఓపెన్ చెయ్యండి. (దుస్తులు అన్నీ సర్దుకున్నాక)
5. అప్పుడు అద్దములో - ఆ దుస్తుల్లో మీరు ఎలా ఉన్నారో చూసుకొని, ఆ తరవాత బిల్లింగ్ కోసం మళ్ళీ వంటి మీద నుండి విప్పాల్సి వచ్చినప్పుడు - యధావిధిగా మళ్ళీ ఆ ట్రయల్ రూం లోని లైట్ ఆఫ్ చేసి మీ బట్టలు మార్చుకోండి. అంతా అయ్యాక బయటకి వచ్చెయ్యండి.
ఇంతే! చాలా సింపుల్ గా ఉంది కదూ.. అక్కడ మొబైల్ కెమరా, డిజిటల్ కెమరా, HD కెమరా పెట్టినా లైట్ వెలుతురు లేకుండా ఏదీ తీయలేదు.. ఒకవేళ తీసినా అది నల్లగా, చూడరాకుండా వుంటుంది. దాన్ని ఎంత ఎడిట్ చేసినా మీరు కనిపించరు అందులో..
ఇక మీరు హోటల్ కి వెళ్ళినా, హోటల్ బాత్ రూం లోకి వెళ్ళినా, క్రొత్త స్థలాల్లోకి వెళ్ళినా - వేరేవారి గదుల్లోకి వెళ్ళినా అక్కడ మీరు దుస్తులు మార్చుకోవాలీ అనుకుంటే - అక్కడ వేసిన లైట్స్ తీసెయ్యండి. కిటికీలకి ఉన్న కర్టెన్స్ వెయ్యండి. డోర్ మూయండి. అందులో ఉండే గుడ్డి వెలుతురు మీకు దుస్తులు మార్చుకోవటానికి సరిపోతుంది.
హమ్మయ్య!.. ఇప్పుడు మనసు ప్రశాంతముగా ఉందా.. ఓకే.
ఒకవేళ లైట్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ లేకుంటే - ఎప్పుడూ అలాగే వెలుగుతూ ఉంటే?
ఇక్కడా సింపుల్. అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ / బాయ్ ద్వారా ఆ షాపింగ్ మాల్ హెడ్ వద్దకి వెళ్ళి ఆ లైట్ కి ఆన్ - ఆఫ్ బటన్ ఏర్పాటు చెయ్యమని చెప్పండి. అలా లేకున్నందుకు మాకు దుస్తులు మార్చుకోవటానికి ఇబ్బందిగా ఉండి.. ట్రయల్స్ చూడలేకపోతున్నాము.. అలా చూడలేక పోతున్నాము కాబట్టి - ఖరీదు చెయ్యలేకపోతున్నాము అని చెప్పండి. అప్పుడు వారు విలువైన ఖాతాదారున్ని కోల్పోవటం ఇష్టం ఉండదు. ఒక లూప్ లైన్ పెట్టేసి, దానికి ఒక బెడ్ ల్యాంప్ స్విచ్ పెట్టడం పదిరూపాయల ఖర్చుకన్నా ఎక్కువ కాదు. కేవలం పదిరూపాయల గురించి విలువైన గిరాకీలని వదులుకోవటానికి యే షాపింగ్ మాల్ యజమానీ ఇష్టపడడు. ఇలా మరికొంత మంది మహిళలు వారిని డిమాండ్ చేస్తే - వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు కూడా.. మీరు వాడకున్నా ఆ తరవాత వచ్చే మిగతా మహిళలకి ఉపయోగకరముగా ఉంటుంది. కాబట్టి అలా స్విచ్ లేని షాపుల్లో అలా స్విచ్ పెట్టమని డిమాండ్ గా అడగండి.
ఓకే.. ఇప్పుడు అలా లైట్ ఆఫ్ చేసి, గది చీకటిగా ఉంటే - అలా అలవాటు లేకుండా ఎలా మార్చుకోగలం అని మీ సమాధానం అయితే :
1. మొబైల్ లో LED లైట్ వెలిగించండి.
2. అలా మీ మొబైల్ లో అలా LED టార్చ్ లేకుంటే స్క్రీన్ సేవర్ ని ఆటో ఆన్ ని తీసెయ్యండి. అలాగే కాసేపు మీ మొబైల్ వెలుగుతుంది. ఆ వెలుగులో మీ పని కానిచ్చేయవచ్చును.
3. ఒకవేళ అలా మీకు చెయ్యరాకున్నా మీ మొబైల్ లో ఒక చిన్న వీడియో పాట ( 3GP file ) ప్లే చెయ్యండి. మన సినిమా పాటలు ఎలాగూ ఐదు నిమిషాలు ఉంటాయి. అంతవరకూ ఆ వీడియో వెలుతురు ఆ ట్రయల్ రూం లో సన్నగా వస్తుంది. అంతలోగా మీ పని కానిచ్చేయవచ్చును. ఆ పాట వింటూ - మీరు మీ కష్టాన్ని మరచిపోవచ్చును - బయట ఉన్నవారు లోపల ఎవరో ఒకరు ఉన్నారు అనుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఈ మొబైల్ వెలుతురు లో ఫోటో తీసినా, వీడియో తీసినా - అంతా నల్లగా తప్ప అంతగా ఏమీ కనిపించదు.
ఓకే.. ఇప్పుడు ఈ టెక్నిక్స్ ని బట్టీ పట్టేసి, అలాగే పాటించేసి, ఈ ప్రపంచములోని యే మూలనైనా నిశ్చింతగా ట్రయల్ రూమ్స్ , హోటల్స్ గదులనీ వాడుకోండి. మీరు ఈ విషయాన్ని మీ స్నేహితురాళ్ళని వారి వాటి స్నేహితురాళ్ళ గుంపులో చెప్పమని చెప్పండి.
9 comments:
మీరు రాసిన విషయం బాగానే ఉంది. తెలుగులో "ట్రయల్" అని రాసారు మంచిదే. కాని దీని స్పెల్లింగ్ "trial" అని గమనించండి. Trail అంటే అర్ధం వేరు, త్రోవ లేదా అడుగుల జాడ అని.
అక్షర దోషము సరిచేసినందులకు చాలా కృతజ్ఞతలు.. అలవాట్లో పొరబాటు. చిన్నప్పటినుండీ అలాగే వ్రాయటం అలవాటు అయ్యింది. మా టీచర్స్ కూడా నేను అలాని వ్రాయటం తప్పు అని చెప్పకపోవటముతో అదే సరియైనది అని ఫిక్స్ అయిపోయా.. సరిచేసినందులకు ధన్యవాదములు.
Your suggestion for change of dress in low light will not work out with the cameras with IR (infra red) cameras. these cameras can record in no light situation also.
Better to be cautious in public places.
మీరన్నదీ నిజమే!కానీ ఇన్ఫ్రా రెడ్ కెమరాలు అంత తేలికగా దొరకవు. ఈ పోస్ట్ వ్రాసినప్పుడు - ఈ HD కెమరాలు అంతగా ప్రాచుర్యం రాలేదు.
మీ ఇంకో కామెంట్ డిలీట్ చేశాను. టెక్నాలజీ మేలు చెయ్యాలని అనుకుంటాను నేను. మీరు వ్రాసిన విషయం తెలుసుకొని, తుంటరులు ఇంకా భద్రత లేకుండా చేస్తారనీ, నేనే ఆ కామెంట్ రిమూవ్ చేశాను. ఏమీ అనుకోవద్దు.
very useful information.
Thank you..
raj garu.. chala baga rastunnaru miru.
manchi vishiyalu share chestunnanduku.. mariyu mi blog chadivi comment kuda pettalenanta busy unnavalla tarupuna kuda nene thanks chebutunnanu
Thank you Raja chandra garu.. Andari tharapuna ani cheppinandulaku mee manasuki hatsoff..
Post a Comment