Saturday, September 24, 2011

Shoe inner sole

మీరు ఎంత విలువ పెట్టి, కాళ్ళకి ఇంపోర్టెడ్ బూట్లు కొన్నా - అవి ఆ కంపెనీ వాడి సూచన మేరకి - ఆరు నెలల కన్నా ఎక్కువ వాడుకోరాదు. ఆ తరవాత అవి మార్చేయ్యాలి. లేకుంటే అవి అలాగే ఉపయోగిస్తుంటే - మీ కాలిపిక్కలు పట్టుకొని, కాళ్ళ నొప్పులు మొదలు కావచ్చును.. అని వారి అభిప్రాయం. చూస్తూ, చూస్తూ అంత ఖరీదైన షూస్ పారేయ్యబుద్ధి కాదు. అవునా..!

నిజానికి వారు చెప్పింది నిజమే.. కాని వేయి, రెండు వేలు పెట్టి కొన్న షూస్ కేవలం ఆరునెలలే వాడి పారేయ్యాలంటే - ఏదోలా అనిపిస్తుంది. ఇది అందరికీ కాసింత బాధగా ఉంటుంది కూడా..

అసలు ఈ మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు ఎలా ఉంటాయో వాటి లక్షణాలు ఏమిటో చూద్దాం. ఆ షూస్ కాళ్ళకి వేసుకొని మన దైనందిక జీవిత అవసరాలు తీర్చుకుంటున్నప్పుడు, ముఖ్యముగా నిలబడి పని చేసే మీ ఉద్యోగాల్లో మీ అరికాళ్ళలో సూదుల్లా గుచ్చుకొని, నొప్పి వస్తుందీ అంటే - ఇక ఆ షూస్ మార్చాల్సిన అవసరం వచ్చింది అన్నమాట. అలా అరికాళ్ళలో నొప్పులు వస్తున్నాయి అంటే ఆ షూస్ లోని మీ పాదానికి తాకుతూ ఉండే, ఒక లేయర్ క్రింద ఉండే షూ సోల్ అడుగు భాగం మోల్డింగ్ లోని కొన్ని భాగాలు బుడిపెల్లా వచ్చి, అవి మీ పాదాలకి నొప్పి పెట్టిస్తూ ఉంటాయి.

లెదర్ బూట్లలో ఈ ప్రాబ్లెం చాలా ఎక్కువ. అదే స్పోర్ట్స్ బూట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉండదు కూడా. ఎందుకూ అంటే - ఆయా షూస్ లలో మీరు పాదం పెట్టే / మీ పాదం తాకుతూ ఉండే భాగం లో ఉండే సన్నని ఒక లేయర్ (పొర) వల్ల ఇది వస్తుంది. మీరు మాటిమాటికీ షూస్ వేసుకున్న కారణముగా, అరికాలి నుండి వచ్చే చెమట వల్ల కూడా ఆ పొర తేమకి గురి అయ్యి, ఆ పొర బాగా అణిగిపోతుంది. అప్పుడు మీ పాదానికి ఆ షూ లోపలి మోల్డింగ్ భాగం మీద మీ పాదం ఆనుతుంది. అది సన్నగా గళ్ళు గళ్ళు గా ఉండటం వల్ల, మీ అరిపాదాలు వాటి మీద ఆనినప్పుడు అప్పుడు అలా అరికాలిలో నొప్పులు మొదలవుతాయి. ఇది నేను ఎక్కువగా షాపింగ్ మాల్స్ లలో షాపింగ్ చేసినప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు గమనించాను.

లెదర్ షూస్ లలో ఉండే ఆ పొర - సన్నగా, తోలుతో చేసినది ఉంటుంది. ఇది అరికాలి నుండి వచ్చే చెమటని పీలుస్తుంది. అలా కాస్త మెత్తగా అయ్యి, పాదం పెట్టినప్పుడు అణిగిపోతుంది. పాదం తీసేశాక, వచ్చే గాలికి ఆరిపోయి, అణిగినట్లుగా ఉంటుంది. అదే స్పోర్ట్స్ షూస్ లలో కాస్త లావుగా, ఫోం లా మెత్తగా, సింథటిక్ పొర ఉంటుంది. ఇది మన్నిక ఎక్కువగా ఉంటుంది. లెదర్ షూస్ కన్నా ఈ స్పోర్ట్స్ షూస్ ని ఎక్కువసేపు వేసుకోవటానికి ఇష్టపడతాం. అందుకే స్పోర్ట్స్ షూ ఎక్కువ సౌకర్యముగా అనిపించటములో ఏమాత్రం సందేహము లేదు.

ఇలా మీకూ అనిపిస్తున్నప్పుడు ఏవేవో మందులు వాడేముందు.. మీరు ఒక పని చెయ్యండి.

Skin coloured sole

Various colours soles



1. షూ లోపలి ఇన్నర్ సోల్ ని - మీ షూ కలర్ లోనివి (ఇందులో ఎక్కువగా నలుపు, తెలుపు, స్కిన్ కలర్ లలో ఎక్కువగా దొరుకుతాయి.) బయట విడిగా ఖరీదు చెయ్యండి.

2. ఇవి షాప్ ని బట్టి పది (10) రూపాయల నుండి దొరుకుతాయి. ఫుట్ పాత్ మీద కూడా దొరుకుతాయి.

3. ఇందులో నాణ్యమైనవి అంటే రెండు వ్రేళ్ళతో వత్తితే, రబ్బర్ లాగా మెత్తగా ఉంటాయి. అలాగే చుట్ట చుట్టినా చుట్టుకుంటాయి.

4. ఇందులో స్పోర్ట్స్ షూ లోని ఇన్నర్ సోల్స్ దొరికితే మీరు మరీ అదృష్టవంతులు.

5. ఈ ఇన్నర్ సోల్స్ 2 - 3 mm వి ఉంటాయి. నిజానికి ఇవే బాగుంటాయి. అంతకన్నా లావువి వాడితే - షూ వేసుకొని, నాడాలు కట్టితే బాగా బిగుసుకపోయి పాదాలనీ, నడకనీ దెబ్బతీస్తాయి.

6. మీరు ఇవి కొనేసి తెచ్చాక, ఆ షూ లోపలి పాత ఇన్నర్ సోల్ తీయండి.. లేదా షూ ని ఆ సోల్ మీద పెట్టి, స్కెచ్ గీసి, దాన్ని ఈ సోల్ మీద పెట్టేసి కత్తిరించండి. మీకు రాకపోతే - మీకు దగ్గరలోని యే మోచీ వారి దుకాణానికి వెళ్ళితే తను నామమాత్ర ఫీజుకి ఆ పని చేసిపెడతాడు. అప్పుడు మీ షూ సైజులోని ఇన్నర్ సోల్ రెడీ..

7. ఇప్పుడు దాన్ని ఆ షూ లో అమర్చి, మీ షూ టాగ్స్ (త్రాళ్ళు) కాసింత మామూలుగా కట్టేస్తే సరి. ఇక దాదాపుగా మీ పాదాలకి నొప్పులు ఉండవు. గట్టిగా షూ నాడాలు బిగించవద్దు.. ఇదొక్కటే మీరు తీసుకోవలసిన జాగ్రత్త.


1 comment:

Anonymous said...

Most usefull tip for me.. thanks a lot.

Related Posts with Thumbnails