ధన్యవాదములు.......
బిందు గారూ.. కాస్త మన్నించండి. కాస్త బీజీ అయ్యాను. అలాగే సమయం చిక్కటమూ లేక మీరు అడిగినది పోస్ట్ చెయ్యలేకపోయాను. ఇప్పుడు చేస్తున్నాను చూడండి.
అలా నొక్కిన తరవాత మీకు ఇలా కనిపిస్తుంది. మీరు డబ్బులు కట్టి వాడుకోవాలనుకుంటే ఆ HOME, BUSINESS లలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోండి. అలా క్రెడిట్ కార్డ్ వాడి, డౌన్లోడ్ చేసుకోండి.
లేదా
ఒక్కసారికే వాడుకుంటాను, ట్రయల్ వర్షన్ చూస్తానూ అంటే - 2 వద్ద నున్న ఆ * గుర్తు ఉన్న చోట ఉన్న Download from Periform ని నొక్కండి.
అక్కడ సెలెక్ట్ చేసుకున్నాక - Start Download అనే 3 వ గుర్తు చూపిన వద్ద నొక్కండి. అప్పుడు మీకు (మీరు గూగుల్ క్రోం వాడినట్లయితే ఇలా 4 వద్ద మీకు కనిపిస్తుంది.) మీరు అప్పుడు SAVE అనే బటన్ నొక్కండి.
అలా నొక్కగానే మీ సిస్టం లోకి ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఇది మీ సిస్టం లో డిఫాల్ట్ గా Downloads అనే దాంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ మీద రైట్ క్లిక్ చేసి 5 లా ఓపెన్ చెయ్యండి.
ఇప్పుడు వచ్చిన ఆ డైలాగ్ బాక్స్ లోని RUN ని 6 నొక్కండి. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ మీ సిస్టం లో ఇన్స్టాల్ అవుతుంది.
అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 7 వద్ద నున్న OK నొక్కండి.
అప్పుడు ఇలా వస్తుంది. అందులో ఆ NEXT అనే 8 మీద నొక్కండి.
ఇలా వారి అగ్రిమెంట్ ని I Agree 9 వద్ద OK చెయ్యండి.
ఆ తరవాత మీ సిస్టం లో ఇలా ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది.
ఆ తరవాత ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో Finish 10 ని నొక్కండి.
ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. అందులో 11 వద్ద నున్న Next ని నొక్కండి.
ఇప్పుడు మీరు మీ కెమరా లోని మెమొరీ కార్డ్ ని కార్డ్ రీడర్ ద్వారా మీ సిస్టం కి అటాచ్ చెయ్యండి. అలా చేశాక మీకు ఫొటోస్ కావాలనుకుంటే ఈ సాఫ్ట్వేర్ లోని * వద్ద Pictures ని 12 వద్ద సెలెక్ట్ చేసుకొని, 13 వద్ద నున్న Next ని నొక్కండి.
ఇప్పుడు ఆ ఫొటోస్ మీ మెమొరీ కార్డ్ లో ఉంటే * వద్ద నున్న 14 ని ఎన్నుకోండి. ఆ తరవాత 15 వద్ద Next ని నొక్కండి.
ఇప్పుడు అలా ఇంకో డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో ఆ 16 వద్ద చూపినట్లుగా Enable Deep Scan ని నొక్కండి. ఇప్పుడు 17 వద్ద Start ని నొక్కండి.
ఇప్పుడు ఇలా మీ కెమరా మెమొరీ కార్డ్ స్కాన్ అవుతుంది. మీ మెమొరీ కార్డ్ సైజుని, అందులో ఉన్న డాటా బట్టి, సమయం తీసుకుంటుంది. అంతవరకూ ఆగండి.
మీ మెమొరీ కార్డ్ మొత్తం స్కాన్ అయ్యాక ఇలా మీ పాత ఫొటోస్ ఏమైనా దొరికితే ఇలా మీకు కనిపిస్తాయి. ఒకవేళ ఆ ఫొటోస్ మీద ఏమైనా డాటా మనం నింపితే, క్రింద ఫోటో లో వచ్చినట్లుగా No preview available అని వస్తుంది. మీ ఫొటోస్ ఏమైనా రికవరీ అయితే అవి ఇక్కడ కనిపిస్తాయి. (వాటిని ఇందులో డబ్బాలు కొట్టి ప్రైవసీ కోసం తీసేశాను.) అప్పుడు వాటి క్రింద ఉన్న * గుర్తు వద్ద చిన్న గడిలో టిక్ చెయ్యండి. అప్పుడు 18 వద్ద Recovery ని నొక్కండి.
అంతే!.. మీ ప్రాబ్లెం తీరుతుంది. ఇక మీరు పోగొట్టుకున్న ఫొటోస్ మీకు దొరుకుతాయి.
ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ : రికవరీ సాఫ్ట్వేర్
4 comments:
చాల చాల థ్యాంక్స్ రాజ్ గారు...
మీకు అది వర్కౌట్ అయ్యిందో లేదో కాస్త చెప్పండి. మీ సమాధానం వల్ల మిగతావారికీ కూడా ఇంకా నమ్మకం ఏర్పడుతుంది.
ఆ సాఫ్ట్వేర్ ని ఎలా download చేసుకొవాలో, ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలో, ఇమేజ్ లతో సహ వివరించినందుకు ముందుగా మీకు కృతగ్నతలు..
నేను ఫ్రీ వెర్షన్ వాడి చుసాను చాల బాగుంది, డెలెట్ అయిన ఫైల్స్ ని ఆ సాఫ్ట్వేర్ సహయంతో మల్లి సేవ్ చేసుకోగలిగాను, తొందర్లో దాన్ని కొనుగోలు చేస్తాను, నాకు మత్రం ఆ సాఫ్ట్వేర్ చాల ఉపయోగ పడింది...
మరొక సారి మీకు దన్యవాదములు...
మీ అనుభవాన్ని, ఫీల్ ని వివరముగా వ్రాయమన్న వెంటనే వ్రాసినందులకు కృతజ్ఞతలు..
Post a Comment