పైన ఉన్న ఫోటోని మరొక్కసారి బాగా చూడండి. డబల్ క్లిక్ నొక్కి బాగా చూడండి. చూశారా.. ఓకే. ఇప్పుడు అది ఏమని అనుకుంటున్నారు?.. ఒక చిన్న ట్రే లాంటి దాంట్లో, రెండు నట్టుల మధ్య ఒక చిన్న సర్క్యూట్ బోర్డ్, ఏదో కనెక్టర్ కి అటాచ్ చేశారని అనుకుంటున్నారా...? ఓకే. మీరు కాస్త సరిగ్గానే ఊహించారు.. మార్కెట్లో ఈ మొత్తం యూనిట్ ని ఏమంటారో తెలుసునా?..
..
..
జవాబు తట్టడం లేదు కదా..
..
..
..
..
ఆలోచించారా..?
..
..
..
ఆగండాగండి.. ఇక చాలులెండి.. మరీ చించేసేలా ఉన్నారు..
..
ఓకే. నేనే చెబుతాను. అది -
ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్.
షాక్ అయ్యారా?.. నిజమే!.. మీలాగే నేనూ అయ్యాను. లోపల ఇలా ఉంటుందా అని మరీ హాస్చర్య పడిపోయారా? నిజానికి ఇలా ఉండదు. వేరేలా ఉంటుంది. లోపల మొబైల్ ఫోన్ లో పట్టే మామూలు మైక్రో SD కార్డ్ ని అందులో ఉంచి దాన్ని హార్డ్ డిస్క్ లా భ్రమింపచేసి, అమ్మేస్తున్నారు. అందులో ఉన్నది మెమొరీ కార్డ్ కాబట్టి ఎన్నిసార్లు అయినా వాడవచ్చును. ఒకవేళ వారంటీ లోగా పాడయితే?
హా! ఏముంది?.. దాన్ని విప్పేసి, ఇంకో మెమోరీకార్డ్ పెట్టి, ప్యాక్ చేసి, రెండురోజుల తరవాత డెలివరీ చేస్తారు. (అలాని ఎందుకూ అంటే - అడిగిన వెంటనే రిపేర్ చేసి ఇస్తే, ఆ వ్యాపార సంస్థ మీద నమ్మకం ఉండదు. కాస్త సమయం తీసుకొని చేసిస్తే, బాగా నమ్మకం కుదురుతుంది. నమ్మకున్నా, నవ్వుకున్నా సరే - ఇది మాత్రం నిజం. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇది నిజమని మీరే ఒప్పుకుంటారు)
కాని మార్కెట్లో ఉన్న మోసాలకి ఒక ఋజువుగా ఇది మీకు చూపిస్తున్నాను.. అన్ని కంపనీలు ఇలా చేస్తాయని కాదు. ఈ మధ్య పేరులేని కంపనీలు తామరతంపరగా ఇలా చేస్తున్నాయి. ఇక్కడ వాదనలు అనవసరం.. మీకు వర్క్ అవుతుందా, లేదా అని దబాయిస్తారు. అప్పుడు మనం ఏమీ అనలేము..
అందులోని మెమొరీ కార్డ్ ని ఎలా మారుస్తారు అంటే - ముందుగా ఒక మామూలు పెన్ డ్రైవ్ ని విప్పేస్తారు. అలా విప్పేసిన పెన్ డ్రైవ్ ఇలా ఉంటుంది.
ఇలా ఉన్న ఆ పెన్ డ్రైవ్ లోని ఆ సర్క్యూట్ బోర్డ్ ఇంకోవైపున ఇలా ఉంటుంది.
ఇదే భాగాన్ని ఆ హార్డ్ డిస్క్ లో పెట్టేస్తారు. ఇంతే!.. చాలా సింపుల్. ఈ ఫోటోలో మీరు మెమొరీ కార్డ్ స్లాట్ నీ, అందులో అమర్చిన మెమొరీ కార్డ్ నీ చూడండి. ఇదే భాగాన్ని ఆ ఎక్స్టర్నల్ డిస్క్ లో చూడవచ్చును.
2 comments:
సార్,మీరు చాలా బాగా వ్రాస్తారు అర్దం అయ్యెటట్లు.
ఏదో అలా మామూలుగా అలా.. అంత గొప్పగా మాత్రం కాదు లెండి.
Post a Comment