"ఏం మాయ చేసావే" ఇప్పుడు ఆంద్ర దేశములో ఓ.. అంటూ ఊదరగొట్టుతున్న సినిమా అని ఇటు పబ్లిక్కూ, అటు మీడియా ఒకటే హొరు. ఆ సినిమాలో నాకు నచ్చినదేమిటంటే - చాలా ఉన్నాయి. వాటన్నింటికన్నా నాకు నచ్చినదీ, మన తెలుగు రంగములో క్రొత్తగా చూపింది ఏమిటంటే - హీరోయిన్ స్వరం.
ఈ సినిమాలో హీరోయిన్ మాట్లాడుతుంటే కొద్దిగా మగ గొంతులో ఉన్నట్లుంది, కాస్త ముద్దు, ముద్దుగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇలాంటి గొంతుని హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పటానికి నిర్ణయించినందులకి ఈ సినిమా డైరెక్టర్ అయిన గౌతం మీనన్ ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. హిందీలో రాణీ ముఖర్జీ గారిదీ కూడా ఒక ప్రత్యేకమైన స్వరం. వందమందిలో ఆ గొంతుని కలిపినా తేలికగా గుర్తుపట్టొచ్చు. మొదట్లో ఆమె స్వరం నాకు నచ్చలా! తినగ తినగ వేము తియ్యగా నుండు.. అన్నట్లు రాణీ ముఖర్జీ గారి గొంతు కూడా బాగా నచ్చింది. ఆ తరవాత ఈమెదే!.. (ఈ పాత్రకి డబ్బింగ్ చెప్పిన ఆమెదే). ఇక ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలంటే మాత్రం ఈ "యే మాయ చేసావే" లోని హీరోయిన్ గొంతుక కన్నా "సూర్య సన్ అఫ్ కృష్ణన్" లో సమీరా రెడ్డి కి వాడిన స్వరం నాకు ఇంకా బాగా నచ్చింది. ఆ స్వరం లోని హస్కీనేస్ ఇంకా మరచిపోలేక పోతున్నాను. చూస్తుంటే.. క్షమించాలి - వింటుంటే రెండు స్వరాలూ ఒకేలా ఉన్నాయనిపిస్తుంది, కాని సూర్య సన్ అఫ్ కృష్ణన్ లోని సమీరా కి వాడిన స్వరం మాత్రం దీనికన్నా నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాలకీ దర్శకుడు గౌతం మీనన్ నే!! ఈ స్వరం కలిగి, డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ - చిన్మయి గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఎలాగూ స్వరం టాపిక్ వచ్చిందిగా.. నేను చిన్నప్పుడు విన్న హస్కీ వాయిస్ ని ఇంకా మరచిపోలేక పోతున్నాను. అదేవరిదంటే స్వర్గీయ సిల్క్ స్మిత @ విజయలక్ష్మి ది. "వసంత కోకిల" సినిమాలో ఆమె స్వంతముగా డబ్బింగ్ చెప్పిందని అప్పట్లో విన్నాను. ఆ స్వరం చాలా పెక్యూలియర్ గా ఉంటుంది. త్రాగకున్నా త్రాగినంతగా మత్తు తెప్పించేస్తుంది ఆ స్వరముతో..
4 comments:
chinmayi..aa dubbing artist
కృతజ్ఞతలు..
హ హ హ హీరోయిన్ ని కాకుండా ఆమే గొంతుని పొగిడినావాళ్ళుగా మిమ్మల్నే మొదట చూస్తున్ననండీ....బాగా రాసారు.మీరన్నట్టు సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్ లో సమీరా రెడ్డి వాయిస్ అదుర్స్...అదే డబ్బింగ్ చెప్పిన అమ్మయి గొంతు చాల బాగుంది హస్కీ గా.
ఈ మధ్యా నాకు ఒక గొంతు అలానే బాగా నచ్చింది.
కింగ్ సినిమాలో హీరోయిన్ త్రిష కి డబ్బింగ్ చెప్పిన అమ్మయి తెలంగాణా యాసలో చాలా బాగా మాట్లాడింది. అది నాకు నచ్చింది.
maaku kuda baaga nachchindandi heroine voice.
Post a Comment