Saturday, March 13, 2010

ఏజంట్లు చెప్పే క్రొత్త పాలసీలు - ఒక పరిష్కారం.

మార్చి నెల చివరికి వచ్చేస్తుందిగా! అలాగే ఆర్ధిక సంవత్సరం ముగియబోతున్నది కదూ.. మీరు ఉద్యోగులై గానీ, వ్యాపారస్తులైతే ఈపాటికి నేను చెప్పబోయే విషయం మీకు అనుభవం లోనికి రావచ్చును.. "సార్! మేడం! ఒక్క పాలసీ.. చాలా బాగుంటుంది.. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.. రిటర్న్స్ కూడా బాగున్నాయి. ఒక్క సారి వినండి సార్.. " అని. మీరు టెంప్ట్ అయి అతడికో పాలసీ చేసి, ఆతర్వాత రెగ్యులర్ గా ప్రీమియాలు కట్టలేక, లాప్స్ అవటమో.. లేక పాలసీ సరెండర్ చెయ్యటమో జరిగుతుంది. నేనిప్పుడు చెప్పేది మీరు పాలసీలు చెయ్యడం గురించి కాదు. అది మీ ఇష్టం. చెప్పబోయేది పాలసీ ప్రీమియం ఎలా తగ్గించుకోవచ్చో చెబుతున్నాను.

మనకు ఏజంట్లు చెప్పే క్రొత్త పాలసీలు - అలాంటివే చాలా భీమా సంస్థలు ఆ వెంటనే ప్రారంభించి ఉంటాయి. అన్ని సంస్థలకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవటం చాలా ప్రయాసకి గురి అవుతాము. అందుకే ఈ ఇబ్బంది తొలగించుకోవటానికి ఒక చిట్కా ఉంది. అదే http://www.policybazaar.com/ అనే సైటు.. అందులో ఎంటర్ అవ్వండి. మీకు ఎలాంటి పాలసీ కావాలో ( హెల్త్, లైఫ్, కార్, హోం..) ఎన్నుకొని అందులోకి వెళ్ళండి. ఇదే ఆ సైటు.


అందులోకి ఎంటర్ అవ్వండి. మీకు యే రకమైన భీమా కావాలో ఎన్నుకోండి. ఉదాహరణకి జీవిత భీమా లోకి వెళ్లామే అనుకోండి. ఇలా వస్తుంది ఆ పేజి.


ఇందులో వివరాలు ఇవ్వండి. ఇస్తే వెంటపడి ఇబ్బంది కలిగిస్తారు అనుకుంటే మీ బంధువుల పేర్లతో, ఎంటర్ అవండి. ఇక ఇక మీకు కావలసిన పాలసీకి గురించిన వివరాలు ఎంటర్ చెయ్యండి.. అప్పుడు ఒక పట్టికలో అదే రకము పాలసీకి - అన్ని సంస్థల ప్రీమియాలు ఎంతెంత ఉన్నాయో పట్టిక వస్తుంది.. అప్పుడు మీరు యే సంస్థ తక్కువ ప్రీమియం వసూలు చేస్తుందో దాన్ని ఎంచుకోవచ్చు.  అప్పుడు ఆ సంస్థ కి ఫోన్ చేసి ఏజంటుని పంపమని చెప్పండి. 

ఇక్కడ ఒక చిన్న విన్నపం: మీరు యే పాలసీ చేయబోతున్నా, ముందుగా ఒక  టర్మ్ పాలసీని  తప్పక  తీసుకోండి. ప్రీమియం తక్కువ, ఏమైనా జరిగితే ఆదాయం ఎక్కువ. ఆర్ధిక ఇబ్బందులు  ఎప్పటికైనా తప్పవు. అప్పుడు ఇదే అవసరం వస్తుంది. ఇది నేను అనే మాట కాదు.. అనుభవజ్ఞులు చెప్పే మాట.

No comments:

Related Posts with Thumbnails