నాకసలు లాంగ్ డ్రైవ్ లంటే అసలు తెలీదు.. ఆ మాటంటే వెర్రిమాటని విన్నట్టే వినేవాడిని అంటే అతియోశక్తి కాదు. చేతక్ స్కూటర్ మీద అలా 15-20 కి.మీ దూరం లోని డ్యాముకు వెళ్ళడం మొదలు..అప్పట్లో నేనేనా ఇంత దూరం ( 15 కిమీ) నడిపానా అని హాశ్చర్య పోయేవాడిని. ఆ తరవాత నా ఉన్నతాభ్యాసానికి నా స్నేహితునితో మూడు కాలేజీలలో అప్లై చేయటానికి వెళ్లాను. అదీ నాకు గుర్తున్నదాంట్లో మొదటి లాంగ్ డ్రైవ్.. ప్రొద్దున్నే బయలుదేరి కాలేజీలకు త్వరగా చేరి, అవసరమైన ఫారములు నిమ్పిచ్చి, తరవాత ఇంకో కాలేజీలకి వెళ్ళటం, ఇలా దగ్గరలోని ( మొదటి కాలేజీ 55 కిమీ దూరం, అక్కడి నుండి ఇంకో కాలేజీ 60 కిమీ దూరం ఉంటుంది. అక్కడినుండి ఇంటికి 75 కిమీ ల దూరం, మొత్తం 180 కిమీ దూరం.. ఇంటికి బయలు దేరేసరికే రాత్రయింది.. మధ్యలో - ఎక్కడైనా ఉందామంటే ఎవరూ తెలియదు తప్పదుగా. ఆ రాత్రే తిరిగిరావటానికి నిర్ణయించుకున్నాము. ఆ రాత్రే బయలుదేరాము. ఇప్పుడున్నంతగా సౌకర్యాలు అప్పుడు లేవు. సింగిల్ రోడ్డు లైన్లూ, ఊర్లో అక్కడక్కడా లాండ్ ఫోనులూ అప్పటి దృశ్యం. మేమొచ్చే దారిలో ఒక చిన్న అడవి కూడా ఉంది. రాత్రి పూట వస్తుంటే టూ వీలర్ మీద వస్తున్న వారి తలల మీద కర్రలతో కొట్టి, వారు క్రింద పడ్డాక దోచుకునేవారు. అలా చాలా సంఘటనలు జరిగాయి. ఏమి చెయ్యాలో తెలీదు. ఎక్కడైనా ఉందామంటే ఎవరూ తెలీని పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో తిరిగి ఆ రాత్రే ఇంటికి వచ్చే పరిస్థితుల్లో ఉన్నాము. మా చిన్ని బుర్రలకి అరగంట సమయం తీసుకొని ఆలోచించి, ఏది ఏమైనా జరగనీ అనుకొని ఆ అడవి గుండా రావటానికి డిసైడ్ అయ్యాము. తీరా అడవి దాకా వచ్చాము. ఎవరైనా తోడుగా టూ వీలర్ వాళ్ళు వస్తారేమోనని చూసాం. ఊహు! పోనీ - బస్సో, లారీయో ఉంటే వాళ్ళు వెళుతుంటే మేమూ వాళ్ళ వెంట వెళదామని చూసాము. అంటే వారు మా వెనక వారు వస్తుంటే మేము ముందున.. రాజు వెళుతుంటే వెనక సైన్యం వస్తున్నట్లుగా -(దోపిడీ అయితే బస్సులనీ కూడా చేసేవాళ్ళు. కాకపోతే మాతో బాటు వారినీ దోచుకున్నారు అని కాస్త ఊరట. ;) అంతే!) కాని ఎవరూ రాలేదు.. బస్టాండులో బస్ కోసం చూసాము. కాని ఆఖరి బస్ కూడా వెళ్ళిపోయింది. బస్ స్టాండ్ అంతా నిర్మానుష్యం.
అక్కడ ఒకరిని అడిగితే ఐదు నిముషాల ముందు ఒక బైకు వెళ్ళింది అన్నారు. ఇంకేం! ఆ బైకుని అందుకోవాలని (తోడుకోసం) బండిని పరిగెత్తిన్చాము. మధ్యలోనే ఆ బైక్ ని అందుకున్నాము కూడా. హ్హంమయ్య అంటూ చాలా సెక్యూర్ గా ఫీలయ్యాము. అక్కడే మాతో బాటు మరో మూడు మోటారు సైకిళ్ళూ, ఒక బస్ (అదే ఆఖరి బస్) కనిపించాయి. వాటన్నింటినీ ఓవర్టేక్ చేసి, ముందున ఉన్నాము.. అలా ఆ అడవిని దాటి ఇంటికి వచ్చాము. మా అదృష్టం.. ఆ రాత్రి ఏమీ జరగలేదు.. తరవాత మెల్లమెల్లగా ధైర్యం వచ్చి, 30 కి.మీ, 100 కి.మీ, 150 కి.మీ ల దూరం పోవటం మొదలెట్టాను.. ప్రొద్దున్నే బయలుదేరి సాయంత్రం లోగా తిరిగివచ్చేయటం. అలా మెల్ల మెల్లగా దైర్యం వచ్చి నేనూ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళే సత్తా ఉందని - కాస్త ఆత్మవిశ్వాసం కలిగింది. ఇదే నా మొదటి లాంగ్ డ్రైవ్ అనే చిన్న అనుభవం. అలా మొదలైన నా లాంగ్ డ్రైవ్ మెల్ల మెల్లగా పరధిని పెంచుకోవాలనుకున్నాను. కాని నా మిత్రులెవరూ ఎవరూ ఆసక్తి చూపలేదు.
ఆ తరవాత చాలా రోజులకి నాకంటే చిన్నవాళ్ళు 18-25 సంవత్సరాల వయస్సు వారు బైకుల మీద గోవా, తిరుపతి.. వెళుతుంటే నాకూ అలా వెళ్ళాలనిపించింది. కానీ అలాంటి ఆసక్తి గల స్నేహితులు నాకు ఎవరూ లేరు. ఆ కల అలాగే మిగిలిపోయింది. ఆ
తరవాత మా ఫ్రెండ్ గాడు LML select (80kmpl) స్కూటర్ కొన్నాడు. దానిపైన వైజాగ్ వెళ్లి అక్కడ వారం రోజులున్దామని అన్నాడు..ఎలా వెళతాము? ఎక్కడ ఉంటాము? అని భయం వేసినా అన్నిటికీ సరియైన సమాధానాలు చెప్పాడు. అయినా యే మూలో కించిత్ అనుమానం. అది ఇప్పటివరకూ సాధ్యపడలేదు.. నేను రెడీ ఉన్నా. వాడు చెప్పిన లెక్కలు అన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ తరవాత ఒక మ్రొక్కు మొక్కాడు తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లి (రావులపాలెం దగ్గర) కి వస్తానని. నేనూ అక్కడికి అతని వెంట వెళ్ళాలి అనుకున్నాను. ఆ తరవాత అతనివి మాటలే.. అని తేలింది. అదే సమయములో నాకేమో - వస్తానన్న అనుకోవటం వల్లనేనో గాని కష్టాలు మొదలయ్యాయి. ఎన్ని ఇబ్బందులో. అప్పుడు నాకు ఏలినాటి శని దశ. సరిగా కారణం తెలీదు అందువల్లనే కావచ్చు.. ఏది ఏమైనా సరే అక్కడికి వెళ్లాలని ఒక్కడినే APSRTC వారి జెట్ టికెట్ తో వెళ్లి నా పని ముగించుకొచ్చాను. ఎప్పుడూ ఇంత దూరం ఒంటరిగా వెళ్ళని నేను ఈసారి ఈ ప్రపంచం అంటే ఇంతేనా అని చాలా ధైర్యం వచ్చింది. వాడు రాకపోక నాకు చాలా మేలుచేసాడు. అంతా నా మంచికే అనుకున్న నేను - ఆ సంఘటనతో చాలా ధైర్యం వచ్చింది. లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలన్న ఆలోచన అక్కడే మొదలయింది..
Saturday, March 27, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment