ఇప్పుడు మీరు రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు అక్షరాల పదాలని మీరు నేర్చుకొనే ఉండొచ్చు.. వాటిని ఇంకా క్రొత్తపదాలతో ఇంకా అభ్యాసం చెయ్యండి. బాగా వేగముగా వ్రాసేలా తయారవుతారు. ఇప్పుడు అలాంటి పదాలను ఉపయోగించి మీకు వాక్యాలు ఎలా వ్రాయాలో నేర్పిస్తాను ఇందులో.. ఇక్కడ చెబుతున్న వాక్యాలన్నీ రోమన్ ఇంగ్లీష్ లో టైపు చేసాక, స్పేసు బార్ ని నొక్కగానే వచ్చే తెలుగు పదాలతో ఇక్కడ మీకు తెలియజేస్తాను.
raamudu manchi baaludu = రాముడు మంచి బాలుడు.
neevekkada unnaavu? = నీవెక్కడ ఉన్నావు?
aavida alaa enduku unnadi? = ఆవిడ అలా ఎందుకు ఉన్నది?
neevu ninna baagaane unnaavugaa! = నీవు నిన్న బాగానే ఉన్నావుగా!
anthalone emayyindi? = అంతలోనే ఏమయ్యింది?
meeru chaalaa manchivaaru.. = మీరు చాలా మంచివారు..
meeru kramam thappakundaa blaaguki vasthaaru = మీరు క్రమం తప్పకుండా బ్లాగుకి వస్తారు
meeru baagaa vraayagalaru = మీరు బాగా వ్రాయగలరు
bhojanam chesaaraa? = భోజనం చేసారా?
monna nenu ooriki vellaanu = మొన్న నేను ఊరికి వెళ్లాను
meeru ninna pettukunna topee baagundi = మీరు నిన్న పెట్టుకున్న టోపీ బాగుంది
nenu yadhaavidhigaa maa intiki vellaanu = నేను యధావిధిగా మా ఇంటికి వెళ్లాను
anthalo maa mitrudu okaru vachhaaru = అంతలో మా మిత్రుడు ఒకరు వచ్చారు
meeru emi chesthuntaaru? = మీరు ఏమి చేస్తుంటారు?
appudemi jarigindo telusaa? = అప్పుడేమి జరిగిందో తెలుసా?
maadi chaalaa anuraagam, aathmeeyatha bandham = మాది చాలా అనురాగం, ఆత్మీయత బంధం
monna maa bujjigaadu jaari paddaadu = మొన్న మా బుజ్జిగాడు జారి పడ్డాడు
ninna naaku oka uttharam vachhindi = నిన్న నాకు ఒక ఉత్తరం వచ్చింది
meeru madyapaanam cheyatam maaniveyaali = మీరు మద్యపానం చేయటం మానివేయాలి
anthalone aa nirnayam teesukunnaanu = అంతలోనే ఆ నిర్ణయం తీసుకున్నాను
andaroo nannu choodadaaniki vachhaaru = అందరూ నన్ను చూడడానికి వచ్చారు
aa ammaayi chaalaa baagundi = ఆ అమ్మాయి చాలా బాగుంది
shamshaabaad vimaanaashrayaaniki vellaamu = శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళాము
naaku antharjaalam nundi manchi mitrulu dorikaaru = నాకు అంతర్జాలం నుండి మంచి మిత్రులు దొరికారు
ee blaagu chaalaa chaalaa baagaa nachhindi = ఈ బ్లాగు చాలా చాలా బాగా నచ్చింది
nenu ippudu telugulo vraayatam nerchukuntunnaanu = నేను ఇప్పుడు తెలుగులో వ్రాయటం నేర్చుకుంటున్నాను
andaroo antaare gaani cheyaru = అందరూ అంటారు గాని చేయరు
eppudochhaamannadi kaadu annayyaa = ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా
manchivaariki eppudoo manche jaruguthundi = మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది
anthaa mana manchike = అంతా మన మంచికే
naannaa nenu ninna naaninaanu = నాన్నా నేను నిన్న నానినాను
kaakeeka kaakiki kaaka kukkakaa = కాకీక కాకికి కాక కుక్కకా
nakkakee, naagalokaaniki antha thedaa = నక్కకీ, నాగలోకానికి అంత తేడా
meeru baagunnaarani anukuntunnaanu = మీరు బాగున్నారని అనుకుంటున్నాను
aa ammaayi chaalaa baagundi = ఆ అమ్మాయి చాలా బాగుంది
ee blaagulo ilaantivi baagaa chepputhunnaaru = ఈ బ్లాగులో ఇలాంటివి బాగా చెప్పుతున్నారు
eeroju oka manchi vishayam nerchukunnaanu = ఈరోజు ఒక మంచి విషయం నేర్చుకున్నాను
meeru chaalaa goppavaaru = మీరు చాలా గొప్పవారు
mee shakthi meeku teliyadu = మీ శక్తి మీకు తెలియదు
raamudu, seetha iddaroo aadarsha bhaaryaabharthalu = రాముడు, సీత ఇద్దరూ ఆదర్శ భార్యాభర్తలు
aa baabu entha muddosthunnaado! = ఆ బాబు ఎంత ముద్దోస్తున్నాడో!
meeru baaga vraasthunnaaru = మీరు బాగా వ్రాస్తున్నారు
andamaina vasanthakaalam idi = అందమైన వసంతకాలం ఇది
evaroo puttinchaka pothe maatalelaa pudathaayi? = ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయి?
brundaavana mana andaridee = బృందావన మన అందరిదీ
adigo! alladigo sree harivaasamoo! = అదిగో! అల్లదిగో శ్రీ హరివాసమూ!
nee gnaapakaalu inkaa naa madilo unnaayi = నీ జ్ఞాపకాలు ఇంకా నా మదిలో ఉన్నాయి
neevalaa nisthejamugaa undaku = నీవలా నిస్తేజముగా ఉండకు
manishi annaaka nerchukuntoo undaali = మనిషి అన్నాక నేర్చుకుంటూ ఉండాలి
manaki vachhinadi itharulaki panchaali = మనకి వచ్చినది ఇతరులకి పంచాలి
...ఇలా ఇన్నెన్నో వాక్యాలు వ్రాయోచ్చును. మీరు కాసింత వీలు చూసుకొని అబ్యాసం చేస్తే మీరూ బాగా తెలుగులో వ్రాయగలరు. వచ్చే క్లాసులో ఇంగ్లీష్ పదాలని తెలుగులో ఎలా వ్రాయాలో చెబుతాను. సరేనా!..
Wednesday, March 10, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment