చిత్రం: రాజమకుటం (1960)
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: మాస్టర్ వేణు
గానం: పి. లీల
****************
పల్లవి:
ఆ.. ఆ.. ఆ..
సడి సేయకో గాలి.. సడి సేయబోకే
సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే! సడిసేయకే..
చరణం 1:
రత్నపీఠికలేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే.. సడిసేయకే!
చరణం 2:
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే.. సడిసేయకే
చరణం 3:
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరి పోరాదే
సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే!
సడి సేయకో గాలి... ఆ.. ఆ.. ఊ..ఊ..
Monday, March 1, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
కొత్తపాళీగారికి కృతజ్ఞతలు.. మీరు చెప్పనట్లే మార్చాను.. కృతజ్ఞతలు.
మీరు కామెంట్ వ్రాసినది పబ్లిష్ చేయబోయి పొరబాటున డిలీట్ చేసాను. అన్యదా భావించకండి.
Post a Comment