అన్నింటికన్నా కష్టమైనది అంటే ఇదే! - అని అనుకుంటారు కాని ప్రయత్నిస్తే సులభముగానే ఉంటుంది. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. అసలు ఎలా వ్రాయాలో తెలిసేది కాదు. ఎవరిని అడగాలో తెలీదు.. ఎలా వ్రాయాలో తెలీదు.. చెప్పేవారూ లేరు.. నా బ్లాగుని చాలా కాలం క్రిందటే పెట్టినా ఏమీ వ్రాయక వదిలేసాను - గల కారణాలలో ఇదీ ఒకటి. (వ్యవహారిక) తెలుగు భాషలో చాలా ఇంగ్లీష్ పదాలు కలిసిపోయాయి. వాటిని కాకుండా తెలుగులో వ్రాయాలంటే ఎవరికీ అర్థం కాదు.
ఉదాహరణకి :
బస్టాప్ ని అలా వ్రాయాలంటే షట్చక్ర వాహన నిలుపు స్థలం అనీ,
కంప్యూటర్ ని కలన యంత్రం అనీ,
లింకు ని లంకె అనీ,
ఇంటర్నెట్ ని అంతర్జాలం అనీ,
ఫాంట్ లనీ ఖతులు అనీ,
స్క్రీన్ షాట్ ని తెరపట్టు అని
(నిజానికి అవన్నీ సరియైనవే - అలా వ్రాస్తే చాలా మంది అర్థం చేసుకోరేమో)
ఇలా ఒక్కసారిగా తెలుగులో వ్రాయలేము. అలా వ్రాసిననూ చాలా మంది ఇష్టపడక పోవచ్చు. అంతెందుకూ.. వ్రాయుట అని వ్రాయాలి నిజానికి. చాలామంది రాయుట అనే వ్రాస్తారు. అది తప్పు. వ్రాసినప్పుడు మాత్రం వ్రాయుట అని వ్రాసినా అనాల్సినప్పుడు రాయుట అనే అంటాము. ఇలాంటి విషయాలమీద తరవాత చర్చిద్దాం! ఇప్పడు ఇంగ్లీష్ పదాల గురించి మాట్లాడుకుందాం!
నాకు తెలిసీ ఈ ఇంగ్లీషు పదాలని 4 భాగాలుగా వర్గీకరించవచ్చును.
- తప్పకుండా ఇంగ్లీషులోనే టైప్ చేయాల్సినవి.
- పదం టైప్ చేసాక స్పేస్ నొక్కడం వల్ల మారే తెలుగులోకి మారే పదాలు.
- పదం టైప్ చేసాక బాక్ స్పేస్ నొక్కి ఆ వచ్చే మెనూలో సరియైన పదం ఎంచుకోవడం వల్ల మారే తెలుగులోకి మారే పదాలు.
- పదాన్ని ముక్కలు ముక్కలుగా టైప్ చేసి బాక్ స్పేస్ తో వాటిని కలపడం
తప్పకుండా ఇంగ్లీషులోనే టైప్ చేయాల్సినవి.
నాకు తెలిసీ ఇందులో చాలా చాలా కొన్నే పదాలు వస్తాయి. ఇలాంటి పదాలు ఇప్పుడైతే నాకైతే అగుపించలేదు. ఒకసారి ఒక పదం టైప్ చేయటం రాలేదు.. ఆ పదమేమిటో నాకు గుర్తులేదు. (ఇలా పాఠాలు చెబుతానని అనుకోలేదు.. అందుకే గుర్తుపెట్టుకోలేదు) ఏమైనా అలాంటి పదాలు వస్తే ఇందులోనే మళ్ళీ ఎడిట్ చేసి వ్రాస్తాను. అంతవరకూ ఈ భాగాన్ని వదిలేద్దాము.
2 comments:
Very useful
ధన్యవాదములు.
Post a Comment