Wednesday, February 10, 2010

బ్లాగులోని ఫోటో పెద్దగా కనపడి, స్పష్టముగా చూడాలనుకుంటే?

బ్లాగులలో ఉన్న ఫోటోలూ, స్క్రీన్ షాట్లూ సరిగ్గా, స్పష్టముగా మీకు కనిపించకపోతే, పోనీ అని ఊర్కుంటారా!.. అంత ఊరుకోవాల్సిన అవసరం లేదు. మీకు యే బ్లాగులోనైనా ఫోటో పెద్దగా కనపడి, స్పష్టముగా చూడాలనుకుంటే మీరు ఈ క్రింది పద్దతులు పాటించండి. 
మీరు పెద్దగా చూడాలనుకుంటే :
  • ముందుగా మీకు కావలిసిన ఫోటో వద్దకి వెళ్ళండి.
  • అక్కడ ఏ ఫోటోనైతే పెద్దగా చూడాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద మౌస్ కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చేయండి.
  • అప్పుడు వచ్చిన పాపప్ బాక్స్ లో అన్నింటికన్నా మీద ఉన్నది, మొదటిది Open the link మీద క్లిక్ చేయండి.
  • అంతే! ఆ ఫోటో పెద్దగా వస్తుంది. ( అంటే ఆ ఫోటో ఒరిజినల్ సైజులో వస్తుంది).
ఒకవేళ మీకు ఆ ఫోటో దా(దో)చుకోవాలనిపిస్తే :
  • ఇప్పుడు వచ్చిన ఫోటో మీద మళ్ళీ రైట్ క్లిక్ చెయ్యండి.
  • అప్పుడు వచ్చిన పాపప్ బాక్స్ లో Save picture as.. ని క్లిక్ చేసి మీరు ఎక్కడ దాచుకోవాలనుకుంటారో అక్కడ సెలెక్ట్ చేసి, Save చెయ్యాలి.
  • అంతే! ఆ ఫోటో మీ స్వంతం.

2 comments:

Unknown said...

Super Ga undhi raju okappati hyderabad........... naku chala nachindhi and thanku so much e janma lo chudalenivi chupichinanduku... kalmasham and kalushayam leni aa vathavaranam chala chala super and adhi collect chesina meeru inka super....and chinna sugetion naluguriki upoyoga padalani rayanddi naluguru mechukovali ani kadu.... thappakundda meeru chesthunna pani naluguriki kadu nalugu vela mandhiki upoyoga paduthundhi........... chivaraga dhanyavadamulu.....

Raj said...

అలా వ్రాయాలనే కదా బ్లాగును పెట్టాను.. మీ ఆశ తీరేలా త్వరలో పోస్టులు పెడతాను.. మీ విలువైన సూచనకి కృతజ్ఞతలు..

Related Posts with Thumbnails