Friday, February 12, 2010

మిలే సుర్ మేరా తుమ్హారా

మిలే సుర్ మేరా తుమ్హారా  = చాలా మంది భారతీయుల హృదయాన్తరాలల్లో "మిలే సుర్ మేరా తుమ్హారా.." అనే పాట శాశ్వతముగా నిలిచిపోతుంది.. నిలిచిపోయింది కూడా. అందులో ఏమాత్రం సందేహమే లేదు..

ఈ  పాటని మొదట్లో 15 ఆగష్టు 1988 నాడు దేశవ్యాప్తముగా దూరదర్శన్ లో "unity in diversity" అన్న థీం తో ప్రసారమయ్యింది. ఈ పాటని భారతీయులు తమ ప్రాంతీయ భాష అక్కడక్కడా ఉన్నా, ఈ పాటని మొత్తాన్ని- ఎప్పుడూ వారు మాట్లాడలేని భాష పదాలు కూడా  హమ్ చేసెడివారు. ఈ పాటని చాలావరకూ దూరదర్శన్లో కార్యక్రమాల అనంతరం ఈ పాటని వేసెడివారు. అప్పటికి ఆ కార్యక్రమం అయిపోయినా లేచి, బయటకి పోతున్నవారు కూడా ఈ పాట వస్తుంటే ఆగి, మరీ చూసేడివారు.. అంతగా వీరిని ఆకట్టుకున్న  ఈపాటలో - పెద్ద పెద్ద స్టార్లూ, సంగీత విద్వాంసులూ, సాంస్కృతిక చిహ్నాలూ, ఆటగాళ్ళు, మరియు సామాన్య ప్రజానీకం.. ఇలా  ఎంతమందో కనిపిస్తారు. పాత  మిలే సుర్ మేరా తుమ్హారా.. పాట ని ఇక్కడ చూడండి. http://www.youtube.com/watch?v=gstRrEmTcBc

No comments:

Related Posts with Thumbnails