Tuesday, February 9, 2010

కృతజ్ఞతలు - నా బ్లాగు గురించి

నా బ్లాగుని దర్శించి, అమూల్యమైన సలహాలను అందించిన వారికీ, నా బ్లాగుని చూసే వారికీ, నా మిత్రులకీ, శ్రేయోభిలాషులకీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. చాలా తక్కువ కాలములో మీ అందరి మనసుని ఆకట్టుకున్నందులకి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మొదట నా బ్లాగు ఇలా ఉండేడిది. 


ఇలా ఉన్న నా బ్లాగు ఇలా మారింది.


ఆ తరవాత ఇలా మారింది.

ఇప్పుడు మీరు చూస్తున్న రూపములో ఉంది. ఈ చిన్ని ప్రయాణకాలమున ఎన్నో అనుభూతులు కలిగాయి. నూతన సంవత్సరములో నా బ్లాగును మార్చాలి అనుకొని కొద్దిగా శ్రమ తీసుకొని, మార్చాను. ఊహించని ప్రతిస్పందన వచ్చింది. ఇంతగా వస్తుందని / ఉంటుందని నేనసలు ఊహించలేదు. నా పని చేస్తూ పోయాను..

ఇలా వ్రాస్తున్నప్పుడే ఇంకో ఆలోచన వచ్చింది. ఏ  ఏ తేదీలలో ఏమి టపాలు నేను పెట్టానో తెలియ దానికి కోసం ఒక Blog Visitors List   ( ఈ లింకు ద్వారా ఈ ఫైల్ ను దింపుకొని / డౌన్లోడ్ చేసుకొని చూడండి )ఫైల్ తయారు చేసాను. నిజానికి ఈ ఆలోచన జనవరి 8 వ తేదీన వచ్చింది. ఆ రోజునుండీ ఏ ఏ రోజుల్లో ఏ టపాలు పోస్టు చేస్తున్నదీ, ఎంత మంది నా బ్లాగుని విజిట్ చేసారు, వారి సంఖ్య ఏమిటో అన్నీ వ్రాస్తూపోయాను. కొద్దిరోజులయ్యాక పోస్ట్ లింక్ ని అందులో పేస్టు చెయ్యటం జరిగింది. అందుకే ఆ  Blog Visitors List   ఫైల్ సగమునుండి నీలిరంగులో (blue) కనపిస్తుంది. అలా నెల రోజులుగా మైంటైన్ చేసాను. సరిగ్గా నెల రోజుల తరవాత విశ్లేషిస్తున్నాను..

ఇదే నేను నా బ్లాగు గురించి తయారు చేసిన ఎక్సెల్ ఫైల్. ( మైక్రోసాఫ్ట్ ఆఫీసు - 2003 / 2007 ఉన్నవారికి కనిపిస్తుంది. డౌన్లోడ్ సైజు: 50 KB  Blog Visitors List  ) ఇలా చేసినందులకి కొన్ని ప్రయోజనాలు కలిగాయి.

  1. నా బ్లాగులో ఎప్పుడు, యే తారీకులో ఏమి పోస్ట్ చేసానో ఈజీగా నెట్ ఆన్ చెయ్యకుండానే తెలుసుకుంటున్నాను. 

  2. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఏమి పోస్టులు పెట్టానో వివరముగా తెలుసుకుంటున్నాను.

  3. ఆయా సమయాల వరకు నా బ్లాగుని ఎంతమంది దర్శించారో కూడా తెలుసుకుంటున్నాను.

  4. టపాలని కాపీ చేసి పేస్టు చేసే సరికి అది ఇక్కడ లింకుగా మారి నేరుగా ఆ పేజి / పోస్టుకే వెళుతున్నాను. అంటే బ్లాగు ఓపెన్ చేసి, లేబుల్స్ లోనో, Blog Archieve లోకో వెళ్లి ఆ పోస్టు ఎక్కడ ఉన్నదో వేదుక్కోవాలసిన అవసరం లేకుండా నేరుగా ఆ టపా లోకే వెళుతున్నాను.

  5. ఇలా లింక్లను ఎక్సెల్ ఫైల్ లో రావాలంటే మీ బ్లాగుని ఓపెన్ చేసాక, మీ బ్లాగు పోస్టు హెడ్ లైన్ వద్ద ( ఇక్కడ మౌస్ పాయింటర్ ని పెడితే చేతి గుర్తును చూపుతుంది.) ఆ హెడ్ లైను ని మార్కు చేసి, రైట్ క్లిక్ చేసి వచ్చిన బాక్స్ లో Copy నొక్కి, ఎక్సెల్ ఫైల్ లో ఎక్కడ పేస్టు చెయ్యాలో అక్కడ పేస్టు చెయ్యాలి ( దీని గురించి త్వరలో వివరముగా ఫోటోలతో ఒక పోస్టు వ్రాస్తాను.. సరేనా!)..
ఈ నెల రోజులలో నా బ్లాగు గురించిన విశ్లేషణ: 

  1. ఈ నెల రోజుల్లో నా బ్లాగుని 6842 మంది దర్శించారు. (12642 - 5800) అంటే 31 రోజులకి గాను, రోజుకి సగటున 220.70 హిట్స్ వచ్చాయన్నమాట. ఇంతకన్నా హిట్స్ ఉన్న బ్లాగులు అనేకం.. నా బ్లాగు వాటితో పోలిస్తే పీపీలికం.

  2. ఏ ఏ దేశాలనుండి ఎంతమంది చూస్తున్నారు అనే ఆడ్-ఆన్ ని జనవరి సగమునుండి పెట్టాను. (అయినా 6206 పేజీలు  చూసారు అని తెలిసింది.) నేను జనవరి మొత్తములో 108 పోస్టులు, ఫిబ్రవరీలో 16  (ఇప్పటివరకూ)  పోస్టులూ పెట్టాను. 

  3. భారత దేశము నుండి అత్యధికముగా 1131 ( 63.1%), ఆ తర్వాత స్థానములో అమెరికా 424 ( 23.7%) ఉంది.

  4. ఇప్పటివరకూ 34 దేశాలనుండి నా బ్లాగుని చూసారు.  
ఇదంతా గొప్పల కోసం చెప్పుకోవటం కాదు.. ఇలా ఆలోచిస్తేనే ఇంకా మనం మన బ్లాగుని అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన కలుగుతుందని  - చెప్పటం. ఇలా చెప్పితే నాకు ఒరిగేదేమీ ఉండదు. కాని మీరు కూడా మీ బ్లాగులని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారన్న ఆలోచన. - అంతే!!

No comments:

Related Posts with Thumbnails