నా పేరు మీద ఏమున్నాయో అని గూగుల్ లో సరదాగా వెదికాను. పదో - పన్నెండు లింకు పోస్టులను చూపాడు గూగుల్ వాడు. ఒక్కక్కటిగా చూస్తూ పోయాను.. ఒక లింక్ ఓపెన్ చేసాను. చాలా గొప్ప రచయిత బ్లాగులో నా పేరు కనిపించింది. ఏమిటబ్బా! నా బ్లాగు పేరు ఇందులో ఉంది అనుకుంటూ కళ్ళు నులిమి మరీ చూసా.. ఇప్పుడు మీరు కూడా చూడండి.
ఇక్కడ ఎర్ర రంగు డబ్బాలో మార్క్ చేసిన కామెంట్ చూసారుగా.. (వ్యక్తుల పేర్లని ఎడిట్ చేసాను).. అది చదివి చాలా సంతోషించాను - అబ్బా!ఇన్నాళ్ళకి నా బ్లాగు ఒకరికి ఉపయోగపడింది అని. కాకపోతే కించిత్ బాధ. ఎందుకంటే ఆ కామెంట్ కూడా నా బ్లాగులో వ్రాస్తే ఎంత బాగుండును. నా బ్లాగు ఎవరికీ ఉపయోగపడటం లేదనీ, ఈ పాటల లిరిక్కులు ఎవరికీ అవసరం ఉండవు.. అనుకొని బ్లాగు మీద నుండి దృష్టి మరల్చిన సమయములో ఆ కామెంట్ వ్రాసారు. ఆ కామెంట్ ఏదో నా బ్లాగులో వ్రాస్తే నాకు ఉత్తేజముగా ఉంది మరిన్ని పోస్టింగులు పెట్టేవాడినిగా.. నిజానికి అక్కడ కామెంట్ వ్రాయకున్నా ఏమీ ఫరవాలేకుండెను. కాని నా దాంట్లో వ్రాస్తే ఇంకా ప్రోత్సాహకరముగా ఉండేడిది కదా.. ఈ విషయం మీరు గమనించి అందరూ పాటించాలని మనవి.
నా బ్లాగులో పోస్టుల క్రింద మీ రియాక్షన్స్ అంటూ పెట్టాను. అది చాలా మంది వాడుటలేదు. మీరు కామెంట్ వ్రాయకున్నా సరే.. కాని ఆ బాక్స్ లలో ఎందులోనైనా క్లిక్ చేసి ఆ టపా ఎలా ఉందో చెపితే నాకూ మీ అభిప్రాయాలు తెలుస్తుందిగా.. నేనేమీ మిమ్మల్ని కోప్పడనుగా.. మరి ఎందుకంత భయం.. ఇప్పటినుండీ ఇక మరవకండీ..
1 comment:
వంశీ కృష్ణ గారూ!.. మీ కామెంట్ పబ్లిష్ చేయ్యాబోయి.. పొరబాటున డిలీట్ కొట్టేశా. ఏమీ అనుకోవద్దు. తెలుగులో వ్రాయటం గురించి బ్లాగులో కూడా చెప్పాను. చూడండి. తెలుగులో టైపు చెయ్యడం - పాఠాలు అన్న లేబుల్ లో ఉంటాయి.
Post a Comment