ఫేస్ బుక్ లో మీరు మీ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు అవి మరింత క్లారిటీగా, క్వాలిటీతో ఉండాలని అనుకుంటున్నారా ? అయితే మీరు ఇలా చెయ్యండి.
మీ అకౌంట్ లో ఏదైనా ఒక ఫోటో ఆల్బమ్ తెరవండి. అది ఇంతకు ముందే తెరచిన ఫోటో ఆల్బమ్ అయి ఉండొచ్చు, లేదా క్రొత్తగా తెరుస్తున్న ఫోటో ఆల్బమ్ అయినా సరే. ఫోటో అప్లోడ్ చేసే ముందు ప్రతి ఆల్బంలో ఈ ఆప్షన్ ఉంటుంది. లేదా ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ క్రింది ఫోటోలో మాదిరిగా మీకు కనిపిస్తుంది.
ఇలా కనిపించిన ఆల్బం అప్లోడింగ్ సమయములో ఎడమ - క్రింద మూలన మీకు + Add more Photos అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఒక / కొన్ని ఫొటోస్ ని మీరు మీ ఆల్బం లలోకి అప్లోడ్ చేస్తున్నప్పుడు, మరిన్ని ఫొటోస్ ని ఎన్నుకొని, వాటి వెంటే అప్లోడ్ చెయ్యటానికి ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది.
ఆ ఆప్షన్ ప్రక్కన పైన స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్నట్లు ఒక చిన్న చదరపు గడి, దాని ప్రక్కనే High Quality అని కనిపిస్తుంది. ఈ గడిలో మనం ఒకసారి క్లిక్ చేస్తే, ఆ తరవాత నుండి మనం మన ప్రొఫైల్ లోని ఆల్బం లలోకి అప్లోడ్ చేసే ప్రతి ఫోటో మరింత క్వాలిటీతో అప్లోడ్ అయ్యి, మన మితృలకి, వీక్షకులకీ అగుపిస్తుంది. చాలామందికి ఈ విషయం తెలీక మామూలుగా ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటారు.
ఇలా ఆ గడిలో ( High Quality ) ఒకసారి మాత్రమే క్లిక్ చేస్తే చాలు. మీ ప్రొఫైల్ లోని అన్ని ఆల్బమ్స్ కీ ఇది పనిచేస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ క్లిక్ చెయ్యాల్సిన అవసరం లేదు అని అర్థం. ఆ తరవాత ఫొటోస్ అన్నీ మంచి క్వాలిటితో కనిపిస్తాయి. ఇది అవసరం లేకుంటే - జస్ట్ మళ్ళీ ఆ గడిలో క్లిక్ చేస్తే - మామూలు క్వాలిటీతో ఫొటోస్ అప్లోడ్ అవుతాయి.
No comments:
Post a Comment